తూర్పుగోదావరి

పొలైట్ పోలీసింగ్‌కు నిలువెత్తు రూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచంద్రపురం, అక్టోబర్ 16: బాధితుల పక్షాన నిలిచే పోలీస్ అధికారిగా, పొలైట్ పోలీసింగ్‌కు నిలువెత్తు నిదర్శనంగా డిఎస్పీ ఎన్‌బిఎం మురళీకృష్ణ నిలిచేవారని రామచంద్రపురం మున్సిపల్ ఛైర్‌పర్సన్ శ్రీ రాజాకాకర్లపూడి రాజగోపాల నరసరాజు (గోపాల్‌బాబు) ప్రశంసించారు. నెల్లూరు డిఎస్పీగా బదిలీపై వెళ్ళిన ఎన్‌బిఎమ్ మురళీకృష్ణకు వీడ్కోలు, గుంటూరు జిల్లా గురజాల నుండి రామచంద్రపురం డిఎస్పీగా బదిలీపై వచ్చిన జయంతి వాసవీ సంతోష్‌కు స్వాగతం పలికేందుకు సోమవారం సబ్‌డివిజన్ పరిధిలోని సిఐలు, ఎస్సైలు, ఇతర సిబ్బంది ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిథిగా గోపాల్‌బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు రెండు దశాబ్దాలపాటు రామచంద్రపురం సబ్‌డివిజన్ పరిధిలోని ప్రజానీకానికి ఆయన సుపరిచితులన్నారు. ఎఎంసి ఛైర్మన్ గరిగిపాటి సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ బాధితులకు న్యాయం చేసే అంశంలో చట్టం, ధర్మాన్ని కాపాడే రీతిలో మురళీకృష్ణ వ్యవహరించారన్నారు. కొమరిన వీర్రాజు, నందుల రాజు తదితరులు మురళీకృష్ణ విధి నిర్వహణ తీరును ప్రశంసిస్తూ ప్రసంగించారు. అనపర్తి సిఐ ఎస్ రాంబాబు మాట్లాడుతూ తీవ్రవాదం హెచ్చుగా ఉన్న ప్రాంతాలైన ఏజెన్సీలో ఆయన కర్తవ్య నిర్వహణ చేసిన విధానాన్ని కొనియాడారు. ఏలేశ్వరం, రాజవొమ్మంగి తదితర ప్రాంతాల్లో ఆయన నిర్వహించిన సేవాకార్యక్రమాలను వివరించారు. ఎస్సై రజనీ కుమార్ మాట్లాడుతూ ఆయన సబ్‌డివిజనల్ పోలీస్ అధికారిగా ఉన్న సమయంలో తాను ఎస్సైగా పనిచేయడం ఆనందదాయకమన్నారు. మండపేట రూరల్ సిఐ కోనాల లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ ఎస్‌ఐలకు, సిఐలకు ఎటువంటి శ్రమ, ఒత్తిడి లేకుండా కేసుల పరిష్కారానికి సహకరించేవారన్నారు. కొత్త డిఎస్పీగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సంతోష్ మాట్లాడుతూ పనిచేసిన ప్రాంతంలో ప్రజల అభిమానాన్ని, అధికారుల మన్ననలను అందుకున్న మురళీకృష్ణ ఏర్పరచిన బాటలో తానూ నడుస్తానని స్పష్టం చేశారు.
నెల్లూరు డిఎస్పీ గా బదిలీ అయన ఎన్‌బిఎమ్ మురళీకృష్ణ మాట్లాడుతూ తన హయాంలో మండపేట రూరల్ పరిధిలో రెండు పోలీస్ స్టేషన్‌ల నిర్మాణం, అనపర్తి సర్కిల్ ఇనస్పెక్టర్ కార్యాలయ భవన నిర్మాణం జరగడం ఆనందాన్నిస్తోందన్నారు. అదేవిధంగా సబ్‌డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో వౌలిక వసతుల కల్పనకు ప్రతి ఒక్కరూ సహకరించారని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం నూతన డిఎస్పీ సంతోష్ నేతృత్వంలో సిఐలు కొమ్ముల శ్రీ్ధర్ కుమార్, ఎస్ రాంబాబు, కోనాల లక్ష్మణరెడ్డి, ఎం గీతా రామకృష్ణలు డిఎస్‌పి మురళీకృష్ణను ఘనంగా సత్కరించారు. అదే విధంగా నూతన డిఎస్పీ జయంతి వాసవీ సంతోష్‌ను సబ్‌డివిజన్ పరిధిలోని సిఐలు శ్రీ్ధర్‌కుమార్, రాంబాబు, లక్ష్మణరెడ్డి, గీతా రామకృష్ణ సత్కరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.