తూర్పుగోదావరి

జిల్లాకు వాయుగండం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, అక్టోబర్ 16: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశాలుండటంతో జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమయ్యింది. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం విశాఖ-తూర్పు గోదావరి తీరం మధ్య తుని తీర ప్రాంతం కేంద్రంగా ఆవరించి ఉన్నట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ అల్పపీడన ప్రయాణం ఉత్తర దిశగా ఒడిస్సా వైపు సాగుతున్నట్టు కనుగొన్నారు. అల్పపీడనం ఒడిస్సా వైపునకు తరలినప్పటికీ దాని ప్రభావం వలన విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచడంతో పాటు భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నట్టు హెచ్చరికలు వెలువడ్డాయి. దీంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. అల్పపీడన హెచ్చరికల నేపథ్యంలో తీర ప్రాంతంలోను, మండల కేంద్రాల్లోను విధిగా ఉండాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. ఈమేరకు జిల్లా కేంద్రం కాకినాడలో ఏర్పాటుచేసిన అత్యవసర సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ నియోజకవర్గాల అభివృద్ధి అధికారులు ఆయా నియోజకవర్గాల్లో సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. మంగళవారం మధ్యాహ్నానికి అల్పపీడన దశ, ప్రభావాలు ఏ విధంగా ఉండనున్నదీ స్పష్టమయ్యే అవకాశాలున్నాయన్నారు. కాగా తీర ప్రాంతంలో మత్స్యకారులు వేటకు వెళ్ళకుండా అధికారులు నిఘా ఏర్పాటుచేశారు. అవసరమైతే సహాయ శిబిరాలను ఏర్పాటుచేసేందుకు సిద్ధంగా ఉండాలని రెవెన్యూ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అలాగే కోస్ట్‌గార్డ్, మెరైన్ పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేరవేసేందుకు వీలుగా రెవెన్యూ, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసే పనిలో అధికారులున్నారు. నిత్యావసర సరుకులు, తాగునీటిని ఆయా గ్రామాల్లో సిద్ధంగా ఉంచడంతో పాటు విద్యుత్‌కు అంతరాయం కలిగే అవకాశం ఉండటంతో జనరేటర్లను సిద్ధంగా ఉంచాలని ప్రభుత్వం ఆదేశించింది. చెరువులు, కాలువలకు గండ్లు పడిన పక్షంలో ఇరిగేషన్ శాఖ అవసరమైన సామగ్రితో సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే వివిధ శాఖల అధికారులకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలందాయి.
అర్జీల పరిష్కారంలో జాప్యం చేస్తే చర్యలు

కాకినాడ, అక్టోబర్ 16: ప్రజల నుండి అందే అర్జీలను సకాలంలో పరిష్కరించకుండా జాప్యం వహించే అధికారులపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా స్పష్టం చేశారు. ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా జిల్లాస్థాయిలో ప్రతి సోమవారం మీకోసం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సోమవారం కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్‌లో మీకోసం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు అర్జీదారులు తమ సమస్యలు విన్నవించేందుకు అధిక సంఖ్యలో హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా ప్రజాసమస్యలను అర్జీల ద్వారా స్వీకరించేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. పెండింగ్ సమస్యలను సకాలంలో పరిష్కరించడానికి కృషిచేయాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. ప్రజావాణిలో సుమారు 418 మంది విజ్ఞాపనలను అందించారు. తమ సమస్యలు, విజ్ఞాపనలు అందించేందుకు హాజరైన వృద్ధుల వద్దకు కలెక్టర్ నేరుగా వెళ్ళి వారి సమస్యలను విన్నారు. ఇటీవల జగ్గంపేటలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కంటి చికిత్స చేసుకుని కంటి చూపు దెబ్బతిన్న వారంతా కలెక్టర్‌ను కలిసి తమ సమస్యను విన్నవించారు. దీనిపై కలెక్టర్ స్పందించి వీరిలో ఎనిమిది మంది సదరమ్ ధ్రువపత్రాలను ఇచ్చారని, వారికి నెలకు వెయ్యి రూపాయల చొప్పున పింఛను మంజూరు చేశామని చెప్పారు. పింఛన్‌ను నవంబర్ మొదటి వారం నుంచి చెల్లిస్తారని కలెక్టర్ చెప్పారు. అలాగే వీరికి ఆర్థిక సహాయం అందించడానికి ముఖ్యమంత్రి సహాయ నిధికి సిఫార్సు చేస్తామని హామీనిచ్చారు. ఇంకా కలెక్టర్ అక్కడకు హాజరైన వారి నుండి సమస్యలు విని, అర్జీలను స్వీకరించి సమస్యల పరిష్కారించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో ప్రజాసమస్యల పరిష్కారానికి పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని, అర్జీదారులు నేరుగా తమ అర్జీలను అందజేయవచ్చని కలెక్టర్ తెలిపారు. అర్జీదారులు దళారులను ఆశ్రయించకుండా తమ విజ్ఞాపనలను నేరుగా తమకు అందజేయాలని సూచించారు. ప్రజాసమస్యల పరిష్కార నిమిత్తం నిర్వహిస్తున్న ఈ ప్రజావాణి కార్యక్రమాన్ని అర్జీదారులు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. జెసి-2 జె రాధాకృష్ణమూర్తి, డిఆర్‌ఓ ఎం జితేంద్ర, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.