తూర్పుగోదావరి

ఆక్రమణలు క్రమబద్ధీకరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, అక్టోబర్ 17: ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను క్రమబద్దీకరించేందుకు చర్యలు తీసుకోవాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సిసిఎల్‌ఎ) అనిల్ చంద్ర పునీత జిల్లా అధికాఠులను ఆదేశించారు. విజయవాడ నుండి మంగళవారం భూసేకరణకు సంబంధించి వివిధ అంశాలపై సమీక్షించేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల సంయుక్త కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. సమావేశంలో అనిల్ చంద్ర పునీత మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేఠకు ఆక్రమిత భూములను నిబంధనల ప్రకారం క్రమబద్దీకరించాలని స్పష్టం చేశారు. రాష్ట్ర, జాతీయ రహదారుల అభివృద్ధి, విస్తరణ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని అనిల్‌చంద్ర పునీఠ సూచించారు. జిల్లా నుండి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న డిఆర్‌ఒ ఎం జితేంద్ర మాట్లాడుతూ జాతీయ రహదారి 216 (కత్తిపూడి-కాకినాడ) మధ్య విస్తరణ పనులు ఆశాజనకంగా జరుగుతున్నాయని, ఈ మార్గంలో రైతులు తమ భూముల ధర పెంచాలని డిమాండ్ చేస్తున్నారని సిసిఎల్‌ఎ దృష్టికి తీసుకువెళ్ళారు. అలాగే కాకినాడ బైపాస్, రాజోలు బైపాస్ అభివృద్ధికి సంబంధించి భూసేకరణ పనులను జిల్లా సంయుక్త కలెక్టర్-2 పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. జిల్లాలో ఎపిఐఐసికి భూముల సేకరణ ప్రక్రియను కూడా వేగవంతం చేస్తామని డిఆర్‌ఒ తెలియజేశారు. సిసిఎల్‌ఎ అనిల్‌చంద్ర పునీత మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్ట్‌లకు అవసరమైన భూములను సేకరించేందుకు కృషి చేయాలని సూచించారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం సూచించిన భూములను కూడా సత్వరమే సేకరించాలని స్పష్టంచేశారు. జాతీయ రహదారుల చట్టం ప్రకారం ఆయా ప్రాంతాల్లో భూములు సేకరించాలని, రైతులు భూములు ఇవ్వడానికి నిరాకరించిన పక్షంలో సంబంధిత సొమ్మును వారి ఖాతాలో జమచేయాలని సూచించారు. డిజిటలైజేషన్ ఆఫ్‌ఎఫ్‌ఎంబి సర్వేలో క్వాలిటీ చెక్ చేయాలని, డిజిటల్ సిగ్నేచర్ పెండింగ్ ఉంటే సత్వరమే పరిష్కరించాలని అనిల్‌చంద్ర పునీత సూచించారు. సమావేశంలో రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ సాయికాంత్ వర్మ, సర్వే ఎడి జి నూతన్‌కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.