తూర్పుగోదావరి

కాలమనీ దోషులకు అండగా నిలుస్తున్న వైసిపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమండ్రి, డిసెంబర్ 26: అధిక వడ్డీ పేరుతో ప్రజలను పట్టి పీడిస్తున్న కాల్‌మనీ దోషులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని రాష్ట్ర దేవాదాయ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు విమర్శించారు. నగరానికి వచ్చిన ఆయన తనను కలిసిన విలేఖరులతో మాట్లాడారు. కాల్‌మనీ అంశంపై చర్చించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండగా శాసన సభ సమయాన్ని వృథాచేస్తూ వైసిపి ఎమ్మెల్యేలు వ్యవహరించారని మండిపడ్డారు. పూర్తిస్థాయిలో చర్చ జరిగితే బాధితులకు న్యాయం జరిగి ఉండేదని, సభ జరగకుండా వ్యూహాత్మకంగా అడ్డుకున్నారని చెప్పారు. శాసన సభ సజావుగా జరిగేందుకు వైసిపి ఎమ్మెల్యేలు బాధ్యతగా వ్యవహరించాలని, సభా మర్యాదలు మంటగలిపేలా మాట్లాడటం సరికాదన్నారు.
వైభవంగా భీమేశ్వరుని జన్మ నక్షత్రం పూజలు
సామర్లకోట, డిసెంబర్ 26: పంచారామ క్షేత్రంలో వేంచేసియున్న శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత చాళుక్య కుమారారామ భీమేశ్వరస్వామి జన్మనక్షత్రం (ఆరుద్ర) పూజలు శనివారం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారుఝామున నాలుగు గంటలకు మహాన్యాసం నిర్వహించారు. అనంతరం విఘ్నేశ్వరునికి అభిషేకం పూజలు, భీమేశ్వరుని యోగలింగానికి అభిషేకం నిర్వహించారు. ఆలయ అభిషేక పండిట్ వేమూరి సోమేశ్వరశర్మ, అర్చకులు కొంతేటి జోగారావు, సన్నిధిరాజు వెంకన్న, లచ్చన్న తదితరులు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదాన ట్రస్టు దాతల ఆధ్వర్యంలో ప్రసాద వితరణ నిర్వహించారు. ఆలయ ఇఒ పులి నారాయణమూర్తి, మండల రైతు సంఘం అధ్యక్షుడు కంటే జగదీష్‌మోహన్‌బాబు తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అలాగే స్థానిక జగదాంబ సమేత శ్రీ జగదీశ్వరస్వామివారి ఆలయంలో కూడ జగదీశ్వరస్వామివారి జన్మ నక్షత్రం పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ నిర్వహకులు సన్నిధిరాజు సూర్య భాస్కరరావు, కుక్కుటేశ్వరరావు సోదరులు పాల్గొన్నారు.
వెయ్యి ఆకర్షణీయ గ్రామాలు
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, డిసెంబర్ 26: జిల్లాలో వెయ్యి గ్రామాలను ఆకర్షణీయ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన దీర్ఘకాలిక ప్రణాళికను ప్రభుత్వ యంత్రాంగం రూపొందించింది. ఇప్పటికే ఆకర్షణీయ గ్రామాల ఎంపికలో భాగంగా గ్రామాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రభుత్వ యంత్రాంగం కొనసాగిస్తోంది. ఇప్పటివరకు సుమారు 600 గ్రామాలను ఆకర్షణీయ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ముందుకువచ్చిన భాగస్వాములతో రిజిస్ట్రేషన్లు చేశారు. మరో 400 గ్రామాలను ఆకర్షణీయ గ్రామాలుగా ఎంపిక చేసేందుకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నిర్వహిస్తున్నారు. గ్రామాల అభివృద్ధికి స్వచ్ఛందంగా ముందుకువచ్చే భాగస్వాములను గుర్తించేందుకు గ్రామ సమన్వయ అధికారులను నియమించారు. అభివృద్ధికై ముందుకువచ్చిన భాగస్వాములతో గ్రామ సమన్వయ సంఘాలు సమావేశాలు ఏర్పాటుచేసి ఆకర్షణీయ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు కలెక్టర్ అరుణ్‌కుమార్ చెప్పారు.
సామాజిక బాధ్యతగా...
గ్రామాల అభివృద్ధిని సామాజిక బాధ్యత కోణంలో చూస్తున్నారు. కార్పొరేట్లు, ధనవంతులు, దాతలు ఈ అభివృద్ధిలో భాగస్వాములయ్యేలా గ్రామస్థాయిలో ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్ణయించారు. దాతలను ప్రభుత్వ యంత్రాంగమే గుర్తించి, ఆకర్షణీయ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని కోరుతున్నారు. గ్రామాల్లో సంపూర్ణ పారిశుద్ధ్యం అమలు, ప్రతీ ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణం ద్వారా బహిరంగ మల విసర్జన లేని గ్రామాలుగా తీర్చిదిద్దడం, గ్రామాల్లో చెత్తను సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ పద్ధతి ద్వారా సేంద్రియ ఎరువుగా వినియోగించటం, మురుగునీటి పారుదల వ్యవస్థను మెరుగుపరచటం వంటి అంశాలకు ఆకర్షణీయ గ్రామాల్లో ప్రాధాన్యతనిస్తారు. తల్లి బిడ్డల ఆరోగ్య పరిరక్షణ, పాఠశాలల్లో నర్సరీల పెంపకం ద్వారా ఆస్తుల రక్షణ, వైద్యం, విద్యపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ్భారత్ కార్యక్రమాలను కూడా ఈ గ్రామాల్లో పెద్ద ఎత్తున అమలుచేయనున్నారు. జిల్లాలో తొలివిడతగా 2016 మార్చి నాటికి 62 మండలాల్లో మండలానికి ఒక గ్రామం చొప్పున సంపూర్ణ పారిశుద్ధ్యాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. స్వచ్ఛ్భారత్ క్రింద యునిసెఫ్ సహకారంతో ఎంపిక చేసిన గ్రామాల్లోని పాఠశాలల విద్యార్ధులకు భాగస్వామ్యం కల్పించి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బహిరంగ మలవిసర్జన అరికట్టడం, గ్రామాల్లో చెత్తను సద్వినియోగ పరచటం, మురుగు నీటి పారుదల వ్యవస్థ క్రమబద్దీకరణ, మాతా, శిశు సంరక్షణ తదితర పనులపై విద్యార్ధులు, తల్లిదండ్రుల్లో చైతన్యాన్ని తీసుకువచ్చే కార్యక్రమాలకు ప్రభుత్వ యంత్రాంగం రూపకల్పన చేసింది. రానున్న మూడు, నాలుగు సంవత్సరాల్లో ఈ కార్యక్రమాలన్నీ ఆయా గ్రామాల్లో అమలు జరిగే విధంగా ప్రభుత్వ యంత్రాంగం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది.