తూర్పుగోదావరి

డెంగ్యూ కేసు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెదపూడి, అక్టోబర్ 23: మండల కేంద్రమైన పెదపూడిలో డెంగ్యూ కేసు నమోదయ్యింది. ఎస్సీ పేటకు చెందిన టి.అబ్బులు తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాడని, కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని పెద్దాడ పిహెచ్‌సి వైద్యాధికారిణి టి.స్వర్ణలత సోమవారం తెలిపారు. ఈ నెల 14వ తేదీన జ్వరంతో ప్రభుత్వాసుపత్రిలో చేరిన అబ్బులుకు వైద్య పరీక్షల అనంతరం డెంగ్యూగా గుర్తించి ప్రత్యేక వైద్యం అందిస్తున్నట్టు ఆమె తెలిపారు. పెదపూడిలో నాలుగు సర్వే బృందాలు పరిశీలించి గ్రామంలో పరిస్థితిని ఎప్పటికపుడు సమీక్షిస్తున్నారన్నారు. 145 మంది నుంచి రక్త నమూనాలను సేకరించగా 2 తీవ్రమైన జ్వరం కేసులు, 9 ఫ్లూ కేసులు నమోదైనట్టు తెలిపారు. పంచాయతీ ఆధ్వర్యంలో మురుగు కాలువలలో దోమల మందులు పిచికారీ చేసి పారిశుద్ధ్యంపై జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఆర్‌డబ్ల్యుఎస్, పంచాయతీ, వైద్య, ఆరోగ్య సిబ్బంది తదితర విభాగాల సిబ్బందిని అప్రమత్తం చేసినట్టు డా. స్వర్ణలత తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలో పరిసరాలను పరిశీలించారు. అలాగే డెంగ్యూ వ్యాధి లక్షణాలు, నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచి కలవల వెంకటరమణ, కార్యదర్శి ఉష తదితరులు పాల్గొన్నారు.

రంగా విగ్రహం ఆవిష్కరణపై ఉత్కంఠ !
డి గన్నవరం, అక్టోబర్ 23: మండల పరిధిలోని నరేంద్రపురం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వంగవీటి మోహనరంగా విగ్రహం ఆవిష్కరణపై ఉత్కంఠ నెలకొంది. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం రంగా విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్టు నెల రోజుల క్రితం వెలుగులోకి వచ్చింది. దీనిపై జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రత్యేక పోలీసు అధికారులు, ఇంటెలిజెన్స్ అధికారులు రంగా విగ్రహావిష్కరణపై గ్రామంలోని కాపు నాయకులు, మండల కాపు జెఎసి నాయకుల నుండి వివరాలు సేకరిస్తున్నట్టు తెలిసింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా రంగా విగ్రహాన్ని ముద్రగడ చేతుల మీదుగా ప్రారంభించాలని కాపు నాయకులు తీర్మానించారు. ఇదిలావుండగా సోమవారం ప్రత్యేక పోలీసు డిఎస్పీ, సిఐలు నరేంద్రపురంలో రంగా విగ్రహావిష్కరణ జరిగే ప్రదేశాన్ని, గ్రామంలోకి వెళ్లే రూట్లను పరిశీలించినట్లు తెలియవచ్చింది.