తూర్పుగోదావరి

అయ్యో రామచంద్రా !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచంద్రపురం, అక్టోబర్ 23: విద్యార్జన కోసం కళాశాలలకు వచ్చే విద్యార్థినులపై మాయమాటలతో ప్రేమ వల విసిరే పోకిరీలు ఇటీవలి కాలంలో రామచంద్రపురం పరిసర ప్రాంతాల్లో ఎక్కువయ్యారు. వీరి మాయమాటలకు వలలో పడుతున్న పలువురు విద్యార్థినులు కళాశాలలకు డుమ్మాకొట్టి, రహదారులపైనే వారితో కాలక్షేపం చేస్తూ విలువైన భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో రామచంద్రపురం పట్టణంలో విద్యాసంస్థలు నెలకొన్న ప్రాంతాలతోపాటు, కళాశాలలు లేని ప్రాంతాలకు చేరి, యువతీ యువకులు గంటల తరబడి ముచ్చట్లు చెప్పుకునే సన్నివేశాలు కానవస్తున్నాయి. మరీ బరి తెగించి రహదారి పైనే.. అందరూ చూస్తోండగానే.. వికృత చేష్టలకు దిగుతున్నారు. ఈ వ్యవహారాలను చూసిన వారు ముక్కున వేలేసుకుంటున్నారు.
ఇలాంటి వారిలో కొందరు యువతులు ఇంట్లో వారికి సమాచారమీయకుండా పరారై, పెళ్ళి చేసుకున్నామని, తమకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయిస్తున్న ఘటనలు ఎక్కువగా కనపిస్తున్నాయి. మైనర్లు కూడా ఇలా వెళ్లిపోయి, పోలీసు కేసుల్లో ఇరుక్కున్న ఘటనలు కూడా రామచంద్రపురం సబ్‌డివిజన్ పరిధిలో చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలు పలు సామాజిక సమస్యలకు సైతం కారణమవుతున్నాయి.
కాగా ఆడపిల్లలు కళాశాలలకు వెళుతున్నపుడు నిత్యం వారి హాజరుపై తల్లిదండ్రులు పర్యవేక్షణ జరుపుతుండాలని సామాజికవేత్తలు పేర్కొంటున్నారు. అలాగే కళాశాలల యాజమాన్యాలు కూడా విద్యార్థినులు ఇలాంటి మోసగాళ్ల వలలో చిక్కుకోకుండా తగు పర్యవేక్షణతో ప్రత్యేక కార్యాచరణను రూపొందించుకోవాలని సూచిస్తున్నారు.
ఆకతాయిల బెడదా ఎక్కువే...
రామచంద్రపురం పట్టణంలో ఆకతాయిల బెడద ఎక్కువగానే ఉంటోంది. గతంలో పోలీసులు షీ టీంలు ఏర్పాటుచేశారు. అయితే అవి ప్రస్తుతం అవి ఎక్కడున్నాయో?.. ఏం చేస్తున్నాయో?.. తెలియని పరిస్థితి. సూర్య కాంప్లెక్స్ సమీపంలో, ఆర్‌టిసి కాంప్లెక్స్ నుండి త్యాగరాయ గానసభ భవనం వరకు ఉన్న బైపాస్ రహదారి వద్ద విద్యార్థినులను కొందరు ఆకతాయిలు వేధిస్తున్నారు. స్థానిక పోలీసు యంత్రాంగం దీనిపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.