తూర్పుగోదావరి

ఉచిత మెగా సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, అక్టోబర్ 23: రాజమహేంద్రవరం ఎంపి మాగంటి మురళీమోహన్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం అర్బన్, రాజమహేంద్రవరం రూరల్ మండలాల్లో రెండు రోజుల పాటు ఉచిత మెగా సూపర్ స్పెషాలిటీ వైద్యశిబిరాన్ని నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి భారీ ఏర్పాట్లు చేపట్టారు. ఈ నెల 28వ తేదీన రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలోని ఎస్‌కెవిటి ఇంగ్లీషు మీడియం స్కూలులోనూ, రాజమహేంద్రవరం రూరల్ మండలం శాటిలైట్ సిటీలో 29వ తేదీన ఈ ఉచిత మెగా సూపర్ స్పెషాలిటీ వైద్యశిబిరం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఎంపి మాగంటి మురళీమోహన్ తన గృహంలో మంగళవారం విలేఖరుల సమావేశంలో వివరాలు తెలియజేశారు. ఈ ఉచిత మెగా సూపర్ స్పెషాలిటీ వైద్యశిబిరంలో ప్రధానంగా కేన్సర్, గుండె, మూత్రపిండాలు, ఎముకలు, ఊపిరితిత్తులు, వెనె్నముక, చెవి, ముక్కు, గొంతు, లివర్, దంత, నేత్ర, నరాలు, జనరల్, స్ర్తిలు, పసి పిల్లలకు సంబంధించిన వ్యాధులకు నిపుణులైన కార్పొరేట్ ఆస్పత్రుల వైద్యులు సేవలు అందిస్తారని చెప్పారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందిస్తారని వివరించారు. హైదరాబాద్, శ్రీకాకుళం, రాజమహేంద్రవరానికి చెందిన కిమ్స్ ఆస్పత్రి వైద్య నిపుణులు, హైదరాబాద్, విశాఖపట్నం స్టార్ ఆస్పత్రుల నుంచి, బసవరామ తారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఇనిస్టిట్యూట్ హైదరాబాద్‌కు చెందిన నిపుణులు, జిఎస్‌ఎల్ మెడికల్ అండ్ డెంటల్ కాలేజీ నిపుణులు, గాజువాక ఆర్‌కె హాస్పిటల్ వైద్య నిపుణులు, రాజమహేంద్రవరం సాయి హాస్పిటల్ వైద్య నిపుణులు, హైదరాబాద్, కపిలేశ్వరపురంనకు చెందిన ఎల్ ప్రసాద్ కంటి హాస్పిటల్స్ నుంచి వైద్య నిపుణులు, రాజమహేంద్రవరం ఐ ఎం ఎకు చెందిన వైద్య నిపుణులు ఈ వైద్యశిబిరంలో తమ సేవలు అందిస్తారని ఎంపి మాగంటి వివరించారు. ఒఎన్‌జిసి, రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి, నగరపాలక సంస్థ, సిసిసి ఛానల్ యాజమాన్యం ఈ శిబిరానికి చేయూతనందిస్తున్నాయని, హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్, హైదరాబాద్ హెటిరో డ్రగ్స్, హైదరాబాద్ నాట్కో డ్రగ్స్ సంస్థలు ఉచితంగా మందులు అందజేస్తున్నాయని చెప్పారు. కేన్సర్ అధికంగా కన్పిస్తోందని, ముందస్తుగా పరీక్షించుకుని మందులు వాడితే నయమవుతుందని, ఆ దిశగా ఈ మెగా సూపర్ స్పెషాలిటీ వైద్యశిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ మెగా వైద్య శిబిరంలో దేశవ్యాప్తంగా పేరున్న వైద్య నిపుణులు హాజరుకావడం విశేషమన్నారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ కార్పొరేట్ వైద్యాన్ని సామాన్యులకు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. రోగం వచ్చిన తర్వాత వైద్యం చేయించుకోవడం కంటే రోగాన్ని ముందుగా పసిగట్టి వ్యాధి నిరోధక మందులు వాడటం చాలా ముఖ్యమన్నారు. స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఈ వైద్యశిబిరంలో సహకరించాలన్నారు. మల్టీ స్పెషాలిటీ వైద్యుల సేవలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ స్క్రీనింగ్‌ను ప్రధానంగా తీసుకుని కేన్సర్ వంటి రోగాల పట్ల ముందస్తు సమాచారంతో అప్రమత్తంగా వుండాలని, అత్యాధునిక వైద్య పరికరాల ద్వారా నివారించుకోవాలన్నారు. ప్రైవేటు రంగంలోని వైద్య నిపుణులు ఈ శిబిరంలో సేవలందిస్తారని, ముందస్తు నివారణకు సద్వినియోగం చేసుకోవాలన్నారు. యువ నాయకుడు ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ ఎంపి మాగంటి మురళీమోహన్ ఈ వైద్యశిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మందులు సరఫరా చేసేందుకు సిద్ధంగా వున్నామన్నారు. వివిధ దూర ప్రాంతాల నుంచి వచ్చే వైద్య నిపుణుల సేవలను స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు ఈ వైద్యశిబిరం చాలా ఉపయోగపడుతుందన్నారు. లక్షలు ఖర్చయ్యే వైద్యాన్ని ఉచితంగా అందించడం స్థానిక ప్రాంతానికి ఎంతో మేలు చేసినట్టన్నారు. మేయర్ పంతం రజనీ శేషసాయి మాట్లాడుతూ పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడం చాలా అభినందనీయమని, ఈ రెండు రోజుల వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ ప్రజల వద్దకే వైద్య నిపుణులను తీసుకురావడం అభినందనీయమన్నారు. డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు పాల్గొన్నారు.