తూర్పుగోదావరి

ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెంకు ఘనస్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, ఏప్రిల్ 15:రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా నియమితులై తొలిసారి తన నివాసమైన అయినవిల్లి మండలం మాగాం వచ్చిన మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు కారెం శివాజీకి ఘనస్వాగతం లభించింది. కోనసీమ నలుమూలల నుండి మాల మహానాడు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ధ సంఖ్యలో మాగాం చేరుకుని శివాజీని పూలమాలలతో ముంచెత్తారు. టిడిపి నాయకులు నాగాబత్తుల శ్రీనివాసరావు, చిల్లా పురుషోత్తమరావు, మాజీ ఎమ్మెల్యే చిల్లా జగదీశ్వరి, అయితాబత్తుల వెంకట కృష్ణారావు, మెల్లం సత్యనారాయణ, నక్కా రామకృష్ణ తదితరులు స్వాగతం పలికారు. అలాగే కారెం శివాజీకి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ ఛైర్మన్ పదవిని ఇవ్వడం పట్ల దళిత యువత హర్షం వ్యక్తం చేసింది. మాలమహానాడు పట్టణ యువజన నాయకుడు కొప్పుల బాబి అధ్యక్షతన శుక్రవారం గడియారస్తంభం సెంటర్‌లో జరిగిన సమావేశంలో రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తికి పదవిని కల్పించి చంద్రబాబు తీసుకున్న హర్షణీయమని దళిత యువత పేర్కొంది. ఈ సందర్భంగా చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసారు. కార్యక్రమంలో టి గోపి, బవిరిశెట్టి బాబి, కొప్పుల కృష్ణప్రసాద్, ఎన్ మూర్తి, జి చిన్ని, రాపాక పవన్, పి కోటేశ్వరరావు, పి దావీదు తదితరులు పాల్గొన్నారు.
ముమ్మిడివరం: ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌గా నియమించిన కారెం శివాజీకి ముమ్మిడివరంలో టిడిపి ఎస్సీసెల్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు శుక్రవారం ఘన స్వాగతం పలికారు. శివాజీ అమలాపురం, నుండి కాకినాడ వెళ్తుండగా మార్గ మధ్యలో ముమ్మిడివరం నగర పంచాయతీ కార్యాలయం వద్ద ఎస్సీసెల్ అధ్యక్షులు దాసరి నాగేశ్వరరావు, గొల్లపల్లి గోపితో పాటు పలువురు పుష్పగుచ్చాలు ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు. అంతకు ముందు స్ధానిక టిడిపి కార్యాలయంలో దాసరి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఎస్సీసెల్ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయాలతో సంబంధం లేకుండా ఉద్యమ నాయకుడికి పదవి ఇవ్వడం ద్వారా దళితుల పట్ల ఆయనకు ఉన్న అవగాహన, అభిమానాన్ని తెలియజేస్తున్నాయన్నారు. ఈ సమావేశంలో కాశి పరివాజ్‌కుమార్, బడుగ సాయిసందీప్, భీమవరపు సూర్యారావు, బడుగు శ్రీరాములు, గెడ్డం బాబ్జి, ఎం చిరంజీవి, దాసరి సాయిబాబు, జంగా నాగేశ్వరరావు, కె శివ, బి శివ, వాకపల్లి వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.