తూర్పుగోదావరి

క్లీనిక్‌లపై విజిలెన్సు మెరుపుదాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, నవంబర్ 17: నకిలీ క్లినిక్‌లు, వైద్యులపై విజిలెన్స్ శాఖ మెరుపు దాడులు నిర్వహించడం తీవ్ర కలకలం రేగింది. రాష్ట్ర విజిలెన్స్ డీజీపీ ఆదేశాల మేరకు జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ రామప్రసాద్ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారుల బృందాలు శుక్రవారం నగరంలోనూ, రాజమహేంద్రవరం రూరల్ మండలంలో మెరుపు దాడులు నిర్వహించారు. ద్వారపూడి పీహెచ్‌సీలో కాంట్రాక్టు హెల్త్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రంగప్రసాద్‌పై విజిలెన్స్ అధికారులు కేసు నమోదు చేశారు. ఐఎల్‌టీడీ జంక్షన్ వద్ద సాయి క్లినిక్‌పై ముందుగా దాడి చేశారు. హెల్త్ అసిస్టెంట్ అయిన రంగప్రసాద్ పేరు ముందు డాక్టర్‌గా బోర్డు పెట్టుకుని క్లినిక్ నడపడాన్ని గుర్తించి విజిలెన్స్ అధికారులు కేసు నమోదు చేశారు. ఇతనిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. పక్కనే ఉన్న యాపిల్ డెంటల్ క్లినిక్‌ను కూడా తనిఖీలు చేశారు. ఈ క్లినిక్ మెడికల్ షాపులో ఫార్మాసిస్టు లేకపోవడాన్ని గుర్తించారు. అదేవిధంగా ధవళేశ్వరంలో కూడా పలు మెడికల్ షాపులను, క్లినిక్‌లను కూడా తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్ దాడులు నగరంలో కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో విజిలెన్ ఎస్పీ రామ్‌ప్రసాదరావు ఆధ్వర్యంలో అడిషనల్ డీఎంఅండ్ హెచ్‌వో డాక్టర్ కోమలి, డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ గోపాలకృష్ణ, విజిలెన్స్ సీఐ సత్యకిషోర్ పాల్గొన్నారు.

పర్యాటక లాంచీల్లో అన్ని వసతులుండాలి
విఆర్ పురం, నవంబర్ 17: పాపికొండ పర్యాటక లాంచీలలో అన్ని వసతులు ఉండాలని, ఐడీడీఏ పీవో అభిషిక్త్ కిశోర్ అన్నారు. ఇటీవల కృష్ణానదిలో జరిగిన బోటు ప్రమాదంతో అప్రమత్తమైన అధికారులు మండల పరిధి పోచవరం గ్రామం వద్ద గల పాపికొండల పర్యాటక లాంచీలను శుక్రవారం నిలుపుదల చేశారు. ఈ సందర్భంగా బోటు సూపరింటెండెంటు ప్రసన్నకుమార్, డీఈ వెంకటరత్నం, ఫైర్ ఆఫీసర్ సాగర్, తహసీల్దారు జివిఎస్ ప్రసాద్ లాంచీలను పరిశీలించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ లాంచీలలో లైఫ్‌జాకెట్లు, గజఈతగాళ్లు తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. అలాగే లాంచీల రేవు వద్ద పర్యాటకులు ఎక్కి దిగేందుకు అనువుగా తాక్కాలికంగా ఒక ఫ్లాట్‌ఫారం నిర్మించాలన్నారు.