తూర్పుగోదావరి

వ్యవసాయ రంగంపై సవతి తల్లి ప్రేమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచంద్రపురం, నవంబర్ 17: వ్యవసాయ రంగంపై ప్రభుత్వాలు సవతి తల్లి ప్రేమను కనబరుస్తున్నాయని, ప్రభుత్వ కంటి తుడుపు చర్యల వల్లే వ్యవసాయంలో సమగ్ర ఫలితాలు కానరావడం లేదని ప్రముఖ ఆర్థికశాస్త్ర నిపుణుడు ప్రొఫెసర్ జి చంద్రశేఖరరావు పేర్కొన్నారు. వీఎస్‌ఎం కళాశాలలో భారతీయ వ్యవసాయ రంగం-సవాళ్లు-అవకాశాలు అనే అంశంపై నిర్వహిస్తున్న రెండురోజుల జాతీయ సదస్సు ప్రిన్సిపాల్ ఎన్‌ఎస్‌వి కిరణ్‌కుమార్ అధ్యక్షతన జరిగింది. తొలిరోజు శుక్రవారం సదస్సులో చంద్రశేఖర్ మాట్లాడుతూ పెట్టుబడి విధానాలు, యాజమాన్య పద్ధతుల్లో లోపాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు వ్యవసాయ రంగాన్ని భారీగా దెబ్బతీస్తున్నాయన్నారు. రుణమాఫీ వంటి ప్రభుత్వ కంటి తుడుపు చర్యల వల్ల పెద్ద రైతులకే ఎక్కువ మేలు జరిగే అవకాశముందన్నారు. పంట పండించిన రైతుకు గిట్టుబాటు ధర కల్పించకపోవడమే రైతులు అప్పుల ఊబిలో చిక్కుకునేలా చేస్తోందన్నారు. ఆకలి చావులు, ఆత్మహత్యలు దేశ ఔన్నత్యాన్ని దెబ్బతీస్తున్నాయన్నారు. గౌరవ అతిథి రాయుడు గంగారావు, కన్వీనర్ డాక్టర్ ఎస్ రామాంజనేయులు తదితరులు ప్రసంగించారు.

పింఛను కష్టాలు..
-బతికుంటే రెండంతస్తులు ఎక్కాల్సిందే..!-
--పిఎఫ్ కార్యాలయంతో సీనియర్ సిటిజన్లకు అవస్థలు--

రాజమహేంద్రవరం, నవంబర్ 17: పింఛనుదారులకు ఎంత కష్టం.. ఎంత కష్టం.. వానప్రస్థంలో ఏమిటీ అవస్థలు అనుకుంటున్నారు వీరంతా.. బతికే వున్నామని భవిష్య నిధి కార్యాలయంలో నిరూపించుకోవాలంటే రెండంతస్తులు ఎక్కాల్సిందే.. ఇదీ రాజమహేద్రవరం దానవాయిపేటలో ఉన్న ఉద్యోగుల భవిష్య నిధి కార్యాలయంలో పరిస్థితి. ప్రతీ ఏడాది నవంబర్ మాసంలో దానవాయిపేటలోని ఒక భవంతిలోని రెండవ అంతస్థులో ఉన్న ఉద్యోగుల భవిష్య నిధి (ఇపిఎఫ్) కార్యాలయానికి వెళ్లాలి. ఆ కార్యాలయంలో లైఫ్ సర్ట్ఫికెట్ సమర్పించి ఫింగర్ ప్రింట్ వేయాల్సివుంది. ఈ మేరకు ఆయా పింఛనుదారుల సెల్‌ఫోన్‌కు ఒక ఓటీపీ నంబరు వస్తుంది. దీనితో ఏడాది వరకు మళ్లీ పింఛన్‌కు ఎటువంటి ఢోకా ఉండదు. ఈవిధంగా ప్రతీ ఏడాది ఉద్యోగుల భవిష్య నిధి రీజినల్ కార్యాలయానికి వెళ్లి నవంబర్ మాసంలో తాము బతికే ఉన్నామని చెప్పి ఫింగర్ ప్రింట్ వేయాల్సి ఉంది. ఇదీ నిబంధన. ఇదంతా బాగానే ఉంది గానీ పింఛనుదారులంటే వయసంతా ఉద్యోగ జీవితంలోనే సరిపోతుంది. పింఛన్ అందుకునే వయసు అంటే వానప్రస్థమే. ఎక్కడో రెండస్తుల భవంతిలో ఉన్న కార్యాలయానికి చేరుకోవాంటే భారంగానే మారింది. దీనికి తోడు ఈ కార్యాలయానికి లిఫ్ట్ కూడా పాడైపోయింది. ఆరోగ్యంగా వయసులో ఉన్నవారే రెండు మూడు అంతస్తుల మెట్లెక్కేందుకు ఆపసోపాలు పడుతున్న పరిస్థితివుంటే ఈ పింఛన్ అందుకునే వయసులో మెట్లెక్కి వేలి ముద్రవేసే ఓపిక లేక వృద్ధులు నానా అవస్థలు పడుతున్నారు. కుర్చీల్లో కూర్చోబెట్టి వారిని రెండో అంతస్తులో ఉన్న భవిష్య నిధి కార్యాలయానికి తీసుకెళుతూ అవస్థలు పడుతున్న పరిస్థితి చోటుచేసుకుంది. ఈ అవస్థలు లేకుండా చూడాలని పింఛనుదారులు కోరుకుంటున్నారు. సాధారణంగా ఇటువంటి కార్యాలయాన్నీ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదని కోరుకుంటున్నారు. ఈ అవస్థలు తప్పించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

కాపుల హక్కుల సాధనకు పోరాటాల్లో పాల్గొంటా
-రామచంద్రపురం ఎమ్మెల్యే తోట

అమలాపురం, నవంబర్ 17: కాపుల హక్కుల సాధన కోసం పార్టీలకు అతీతంగా, పదవులను త్యజించి పోరాటాల్లో పాల్గొంటానని రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు స్పష్టంచేశారు. అమలాపురంలో శుక్రవారం కాపు రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కాపు వనసమారాధన కార్యక్రమంలో తోట పాల్గొని మాట్లాడారు. రిజర్వేషన్లు అమలు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషిచేస్తున్నారన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అమలుకోసం డెడ్‌లైన్ విధించడం భావ్యం కాదన్నారు. ఈ సందర్భంగా కాపు రిజర్వేషన్ అమలుకు ముఖ్యమంత్రి చేస్తున్న కృషిని తోట కొనియాడారు. వనసమారాధనలు కాపుల ఐక్యతను చాటిచెపుతున్నాయన్నారు. విభజన రాష్ట్రంలోని 13 జిల్లాల్లో కాపు సామాజిక వర్గం అధికంగా ఉండటమే కాకుండా వారిలో అధిక శాతం మంది పేదరికంలో ఉన్నారు. కాపుల్లో ఉన్న పేదలకు రిజర్వేషన్లు తప్పనిసరిగా ఉండాల్సిందేన్నారు. కాపుల హక్కుల సాధనకు ఐక్యంగా పోరాటం చేయడం తప్పుకాదు.. 30 ఏళ్లుగా ఎదురుచూస్తున్న రిజర్వేషన్ సాధన చివరి దశలో ఉందన్నారు. త్వరలోనే కాపుల కల సాకారమవుతుందని తోట ఆశాభావం వ్యక్తంచేశారు. రాజ్యాంగ పరంగా ఉన్న అవకాశాల కోసం పోరాటంసాగాలని, ఈ పోరాటం గతంలో ఎంతోమంది చేశారన్నారు. ప్రసుతం చేస్తున్న పోరాటం చివరిది కావాలని, భవిష్యత్తులో మరో పోరాటంచేసే అవకాశం కలగకుండా ఉద్యమించాలని సూచించారు. కాపుల పోరాటం ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. యువతం మంచి పనిచేస్తే వారికే వర్తిస్తుందని, చెడ్డ పనిచేస్తే జాతికంతటకూ ఆపాదించడం జరుగుతుందని, దీనిని దృష్టిలో పెట్టుకుని యువత మసలుకోవాలన్నారు. కాపు యువత తాము అభివృద్ధి చెందడమే కాకుండా పక్కవారికి సహాయపడేలా ఉండాలన్నారు. ఈ రాష్ట్రంలో నాలుగైదు శాతం ఉన్న వారు రాష్ట్రాన్ని పాలిస్తున్నారంటే వారికున్న ఐక్యమత్యమే కారణమన్నారు. వారి నుండి పాఠాలు నేర్చుకుని రాజ్యాధికారం పొందాలన్నారు. కాపు జాతి ఏ పార్టీకీ బానిస కాదన్నారు. సీఎం చంద్రబాబు చొరవతో రిజర్వేషన్ అంశం ముందుకు వెళుతోందన్నారు. ఒకవేళ మాటతప్పితే తామంతా పోరాటంలో భాగస్వాములవుతామని తోట ప్రకటించారు. రాజకీయ అవసరాల కోసమే పార్టీల్లో ఉన్నామని, కులానికి నష్టం జరిగితే సహించేదని లేదన్నారు. ఇటీవల వైసీపీ రాష్ట్ర యూత్ అధ్యక్షుడు జక్కంపూడి రాజాపై దాడిని కాపు కులస్థుడన్న కారణంతోనే తాను స్పందించి సీఎం దృష్టికి తీసుకువెళ్లానన్నారు. దానిపై సీఎం కూడా సానుకూలంగా స్పందించి ఎస్సైను సస్పెండ్ చేశారని ఈసందర్భంగా తోట తెలిపారు. కాగా తోట త్రిమూర్తులు సభా స్థలికి వచ్చేసరికి ముద్రగడ పద్మనాభం ర్యాలీలోనే ఉండిపోయారు. దీంతో తోట తన ప్రసంగాన్ని ముగించి వెళ్లిపోయారు. అయితే వనసమారాధనకు తోట వస్తారని భారీ ఫ్లెక్సీలు ఏర్పాటుచేసినా ఆయన వస్తారా? రారా? అని కాపు యువత చర్చించుకోవడం జరిగింది.