తూర్పుగోదావరి

జగన్ పాదయాత్రకు స్పందన కరవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, నవంబర్ 19: వైఎస్సార్‌సిపి అధినేత జగన్ చేపట్టిన పాదయాత్రను ప్రజలు పట్టించుకోవడం లేదని ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప వ్యాఖ్యానించారు. ఆపార్టీ పరిస్థితి, జగన్ వైఖరి చూసి పార్టీ శ్రేణులు క్రమంగా జారిపోతున్నాయన్నారు. ఇంటింటికీ తెలుగుదేశం ముగింపు కార్యక్రమం ఆదివారం సాయంత్రం స్థానిక 42వ డివిజన్‌లోని శ్రీరామ్‌నగర్‌లో జరిగింది. ఈసందర్భంగా గుడా చైర్మన్ గన్ని కృష్ణ అధ్యక్షతన జరిగిన సభలో, అనంతరం విలేఖర్లతో నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ పాదయాత్రలో ప్రతిపక్షనేత జగన్ అన్నీ అబద్ధాలే చెబుతున్నారని ధ్వజమెత్తారు. ఆయన ప్రతీ శుక్రవారం కోర్టుకు ఎందుకు వెళ్తున్నారన్నది ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన వైఖరి చూసి న్యాయస్థానం కూడా విసిగిపోయిందన్నారు. జగన్‌ను ప్రజలు నమ్మడం లేదన్నారు. జగన్ రాష్ట్భ్రావృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్నారని, రాజధాని నిర్మాణాన్ని అడ్డుకున్నారన్నారు. విజయవాడలోని పవిత్రసంగంలో జరిగిన బోటు ప్రమాదంలో మంత్రుల ప్రమేయం లేదని స్పష్టం చేశారు. ప్రమాదానికి గురైన బోటు ప్రైవేటుదని, మంత్రులకు వాటిని నిర్వహించాల్సిన అవసరం లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్భ్రావృద్ధికి చిత్తశుద్ధితో కృషిచేస్తున్నారన్నారు. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రం సందర్భంగా గుర్తించిన సమస్యలన్నింటినీ ప్రభుత్వం పరిష్కరిస్తుందన్నారు. రాష్టవ్య్రాప్తంగా 19లక్షల ఇళ్లు నిర్మించనున్నట్లు చెప్పారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో ఇంటింటికీ మంచినీటి సరఫరాకు రూ. 100కోట్లు కేటాయించాలని నిర్ణయించారన్నారు. వచ్చే ఎన్నికలు ఏకపక్షంగా జరుగుతాయని, తెలుగుదేశం తిరిగి అధికారంలోకి వస్తుందని చినరాజప్ప జోస్యం చెప్పారు. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం సందర్భంగా టిడిపి శక్తి నిరూపితమైందని, 80శాతం మంది ప్రజలు టిడిపి పాలన పట్ల సంతృప్తితో ఉన్నారన్నారు. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నిరాటంకంగా కొనసాగిస్తున్నారన్నారు. ఈవిషయాన్ని కార్యకర్తలు ప్రజలకు వివరించాలన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో సమస్యలు తగ్గుముఖం పట్టాయన్నారు. ఇంటింటికీ టిడిపి కార్యక్రమంలో భాగంగా ప్రజా సమస్యలను గుర్తించి, ప్రభుత్వానికి నివేదించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్లు, ఇళ్ల నిర్మాణంలో దోపిడీకి పాల్పడిందని గోరంట్ల ఆరోపించారు. గత ప్రభుత్వం 14లక్షల ఇళ్లను మాయం చేసిందన్నారు. 5వేల చొప్పున రాజమహేంద్రవరం, రూరల్ నియోజకవర్గాల్లో 10వేల ఇళ్లను నిర్మించనున్నట్లు చెప్పారు. ఈకార్యక్రమంలో మేయర్ పంతం రజనీశేషసాయి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, పార్టీ పరిశీలకుడు సత్యనారాయణరాజు, డిప్యుటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, ఫ్లోర్‌లీడర్ వర్రే శ్రీనివాసరావు, స్థానిక కార్పొరేటర్ మళ్లా నాగలక్ష్మి దంపతులు, పలువురు కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.