తూర్పుగోదావరి

ఎన్నికల హామీలు నెరవేరుస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామర్లకోట, నవంబర్ 19: కాపులను బీసీల్లో చేర్పిస్తామని హామీ ఇచ్చి ఒక్కొక్కటిగా అమలుచేస్తున్న సీఎం చంద్రబాబును కొంతమంది అదే పనిగా విమర్శిస్తున్నారని, కనీసం నవరత్నాల్లో గానీ, మేనిఫెస్టోలో గానీ హామీ ఇవ్వని విపక్ష నాయకుడు జగన్‌ను ఎవరూ ఎందుకు ప్రశ్నించరని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. సామర్లకోట విస్తరణ శిక్షణ కేంద్రం తోటలో ఆదివారం సామర్లకోట కాపు కార్తీక వన సమారాధనను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సభకు ముఖ్య అతిధిగా హాజరైన ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ కాపులకు బీసీల రిజర్వేషన్ అంశంలో చంద్రబాబును అదే పనిగా కొంతమంది విమర్శిస్తున్నారన్నారు. కాపులను బీసీల్లో కలుపుటకు కమిషన్ వేశారని, నివేదిక ద్వారా తగు చర్యలు తీసుకుంటున్నారని, ఈలోగా కాపు కార్పొరేషన్ ద్వారా నేరుగా ఉపాధి రుణాలు, అలాగే విదేశీ విద్యకు, ఐఏఎస్, ఐపీఎస్‌ల కోచింగ్‌లకు అర్హత పొందిన వారికి లక్షలాది రూపాయలతో ఉచిత శిక్షణలు వంటి కార్యక్రమాలు అమలుచేస్తున్నారన్నారు. విపక్ష నేత కనీసం కాపుల అంశంపై స్పందించరని, హామీ ఇవ్వకపోయినా విమర్శకులు ప్రశ్నించరని అన్నారు. అదే పనిగా విమర్శలు చేయడం వల్ల చేసేవారికి కూడా ఆటంకం కల్గించినట్టు అవుతుందన్నారు.
వచ్చే కార్తీక సమారాధనలు సొంత భవనంలోనే...
కాగా వచ్చే ఏడాది కార్తీక వన సమారాధనలు కాపు కమ్యూనిటీ సొంత భవనంలో నిర్వహించుకోవచ్చని, రూ.50 లక్షలు కార్పొరేషన్ నిధులతో కమ్యూనిటీ భవనం నిర్మాణానికి పనులు జరుగుతున్నాయన్నారు. ఈ నిధులతో పనులు టెండర్ దశకు వచ్చాయన్నారు. రూ.50 లక్షలు కేటాయించిన తనను ప్రశంసించకపోయినా పర్వాలేదని, విమర్శలు చేస్తే సరికాదని వ్యాఖ్యానించారు. సొంత భవనం వచ్చే ఏడాదిలోగా పూర్తవుతుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వేదికపై నిర్వాహకులు మంత్రి రాజప్ప, తనయుడు రంగనాగ్‌లను సత్కరించారు. మరో ముఖ్య అతిధి కాకినాడ ఎంపీ తోట నరసింహం, తనయుడు రాంజీలను కూడా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ జ్యోతుల నవీన్‌కుమార్, పెద్దాపురం మాజీ ఎమ్మెల్యే పంతం గాంధీ మోహన్, పెద్దాపురం వైసీపీ ఇన్‌చార్జి తోట సుబ్బారావునాయుడు, ప్రభుత్వ క్లస్టర్ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, కాపు సంఘాల ప్రతినిధులు తుమ్మల దొరబాబు, తుమ్మల బాబు, నార్నే రవిప్రసాద్, దవులూరి సుబ్బారావు, సంగినీడు భవన్నారాయణ, మండల టీడీపీ అధ్యక్షుడు తోటకూర శ్రీనివాసు, కాపు సంఘాల నాయకులు, కుటుంబీకులు పాల్గొన్నారు.
జ్వరంతో గిరిజన మహిళ మృతి
విఆర్ పురం, నవంబర్ 19: వారం రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఒక గిరిజన మహిళ మృతిచెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మండల పరిధి గుర్రంపేట గ్రామానికి చెందిన మొట్టుం రమాదేవి (35) అనే గిరిజన మహిళకు జ్వరం రావటంతో రేఖపల్లి ప్రభుత్వ వైద్యశాలలో చూపించారు. జ్వరం తగ్గకపోవటంతో భద్రాచలం ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువెళ్లారు. అక్కడ వైద్యులు రమాదేవికి రక్తకణాలు తగ్గిపోయాయని తెలిపారు. నాలుగు రోజులు వైద్యం అందించినప్పటికీ జ్వరం తగ్గకపోవటంతో ఇంటికి తీసుకురాగా, ఇంటి వద్ద ఆదివారం మృతిచెందింది. మృతురాలికి కొడుకు, కూతురు ఉన్నారు. భర్త ఐదు సంత్సరాల క్రితం మృతిచెందాడు. ఇప్పుడు తల్లి మృతితో పిల్లలిద్దరూ అనాధలయ్యరని వారు విలపించారు.