తూర్పుగోదావరి

రైతుల ప్రయోజనాలే ప్రభుత్వ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, నవంబర్ 19: రైతుల ప్రయోజనాలే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుని రైతుల సంక్షేమానికి సంపూర్ణ సహకారం అందిస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఆదివారం అమలాపురం మండలం రంగాపురంలో గోదావరి డెల్టా సిస్టమ్ ఆధునికీకరణ నిధులు రూ.1.50 కోట్లతో నిర్మించే జలవనరుల శాఖ గోదావరి సెంట్రల్ డెల్టా ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్ కార్యాలయం, ఇన్‌స్పెక్షన్ బంగ్లా (అతిథి గృహం) నిర్మాణాలకు రాజప్ప శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అధ్యక్షతన జరిగిన సభలో రాజప్ప మాట్లాడుతూ ఇంతవరకు ధవళేశ్వరంలో ఉన్న ఈఈ కార్యాలయాన్ని ఎన్నో వత్తిడులు ఎదుర్కొని అమలాపురానికి తీసుకువచ్చామన్నారు. ఈ కార్యాలయం ద్వారా సెంట్రల్ డెల్టాలోని లక్షా 75 వేల ఎకరాలకు సంబంధించి రైతులకు ప్రయోజనం చేకూరుతుందని మంత్రి అన్నారు. భవన నిర్మాణం పూర్తయితే రైతులకు దూరాభారం తగ్గడమే కాకుండా అన్ని సేవలను ఇక్కడ నుండే పొందవచ్చన్నారు. రైతు సంక్షేమానికి అహర్నిశలు కృషిచేసే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని, రైతులు ఎదుర్కొనే ఏ సమస్యనైనా సత్వర పరిష్కారానికి ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారన్నారన్నారు. రైతులు ముఖ్యంగా ఈ విషయాన్ని గ్రహించాలని రాజప్ప విజ్ఞప్తి చేశారు. కోటి రూపాయలతో ఈఈ కార్యాలయం, రూ. 50 లక్షలతో అతిథి గృహం నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. రైతులకు సాగునీటికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా పూర్తిస్థాయిలో నీరు అందిస్తున్నామని, రైతులు సాగునీటిని పొదుపుగా వాడాలని మంత్రి సూచించారు. ఈ సీజన్‌లో పంట కాల్వలకు సంబంధించిన ఆధునీకరణ పనులను సకాలంలో పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని జలవనరుల శాఖ ఎస్‌ఈ బి రాంబాబును మంత్రి రాజప్ప ఆదేశించారు. ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ సెంట్రల్ డెల్డా పరిధిలో అమలాపురం డివిజన్‌లో సుమారు రూ. 100 కోట్లతో అభివృద్ధి పనులు చేశామన్నారు. గతంలో జలయజ్ఞం పేరుతో రూ. 80 వేల కోట్లు ఖర్చుచేసినా రైతులకు ఏ విధమైన ప్రయోజనం చేకూరలేదన్నారు. గతంలో ధవళేశ్వరం నుండి ఈఈ కార్యాలయాన్ని అమలాపురం తీసుకురావడంతో అప్పటి మంత్రులు పూర్తిగా విఫలమయ్యారని, రాజప్ప కృషితో రైతుల కల నేటికి సాకారమయ్యిందని ఆనందరావు అన్నారు. జలవనరుల శాఖ ఈఈ బి రాంబాబు మాట్లాడుతూ రైతులకు మూడు పంటలకు సమృద్ధిగా సాగు నీరు ఇవ్వాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్యేయమని, ఆ దిశగా జిల్లాలో రైతుల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని గత ఏడాది, ఈ ఏడాది కూడా నూరుశాతం సాగు నీరందించామన్నారు. ఈ కార్యక్రమంలో గోదావరి డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ భూపతిరాజు ఈశ్వరవర్మ, మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్, ఎంపీపీ బొర్రా ఈశ్వరరావు, జడ్పీటీసీలు అధికారి జయవెంకటలక్ష్మి, డి లక్ష్మీనారాయణ, మెట్ల రమణబాబు, పెచ్చెట్టి చంద్రవౌళి, డీసీ చైర్మన్లు జంపన రామరాజు, నిమ్మకాయల చెల్లయ్యనాయుడు, ఏఎంసీ చైర్మన్ నిమ్మకాయల సూర్యనారాయణమూర్తి, ఇరిగేషన్ ఈఈ పి సుధాకరరావు, డీఈఈలు కె రాంబాబు, జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఆటాపాటలతో అలరించిన
ఆనంద ఆదివారం
రాజమహేంద్రవరం, నవంబర్ 19: నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం పుష్కరాలరేవు వద్ద ఆటపాటలతో హ్యాపీ సండే కార్యక్రమం ఆహుతులను అలరించింది. నగరపాలక సంస్థ, రాజానగరం జెడ్పీ స్కూలు, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు జానపద, సినీ నృత్యాలతో అలరించారు. ఈకార్యక్రమంలో మేనేజర్ సిహెచ్ శ్రీనివాసరావు, కార్పొరేటర్ గొర్రెల సురేష్ పాల్గొన్నారు.