తూర్పుగోదావరి

సమారాధనల నీడలో సమీకరణలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, నవంబర్ 19: కార్తీక వన సమారాధనల ముసుగులో ప్రధాన రాజకీయ పార్టీలు భారీ ఎత్తున రాజకీయ సమీకరణల్లో మునిగితేలాయి. ఆదివారంతో కార్తీక మాసం ముగియడంతో చివరి రోజు జిల్లాలో భారీ ఎత్తున కుల సంఘాల నీడలో అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు తమ హవా చాటుకునే ప్రయత్నాలు చేశాయి. ప్రధానంగా కార్తీకమాసం నేపథ్యంలో జిల్లాలో కాపు సామాజికవర్గం ఆధ్వర్యంలో పోటాపోటీగా కార్తీక వన సమారాధనలు నిర్వహించారు. వివిధ నియోజకవర్గాలు సహా జిల్లా కేంద్రం కాకినాడలో నిర్వహించిన సమారాధనలను రాజకీయ పార్టీలకు అతీతంగా నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. అయితే కాపుల ఆధ్వర్యంలో నిర్వహించిన వన సమారాధనలు అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల బల ప్రదర్శనలకు వేదికలుగా మారాయి. కోనసీమలో నిర్వహించిన కాపుల సమారాధనలకు కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రధాన ఆకర్షణగా నిలిచారు. వాస్తవానికి ముద్రగడపై వైఎస్సార్ కాంగ్రెస్ సానుభూతిపరుడిగా ముద్ర పడింది. 2019 ఎన్నికల్లో ఆ పార్టీ నుండి ముద్రగడ బరిలోకి దిగే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ముద్రగడ హాజరయ్యే కాపుల కార్తీక వన సమారాధనలకు ఆయన వర్గీయులు అధికంగా హాజరు కావడం కనిపించింది. కాపు సమారాధనల్లో ముద్రగడ సహా ఆయన అనుయాయులు, కాపు జెఎసి నేతల హవా అధికంగా కనిపిస్తే అది వైసీపీకి కలసివస్తుందన్న ఆలోచనతో తెలుగుదేశానికి చెందిన కాపు నేతలు వారికి దీటుగా హడావుడి చేశారు. కోనసీమ సహా కాకినాడ, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో నిర్వహించిన కాపుల సమారాధనల్లో ఇదే సామాజికవర్గానికి చెందిన ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ ఎంపి తోట నరసింహం, ఎమ్మెల్యేలు తోట త్రిమూర్తులు, జ్యోతుల నెహ్రూ తదితరులు చురుగ్గా పాల్గొన్నారు. కొన్నిచోట్ల ముద్రగడ పద్మనాభం పాల్గొన్న కాపుల వన సమారాధనలకు ఆయన రాజకీయ శత్రువైన హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పాల్గొన్నారు. జిల్లా కేంద్రం కాకినాడలో ఆదివారం కాపు సద్భావన సంఘం ఆధ్వర్యంలోనిర్వహించిన వన సమారాధనకు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప హాజరయ్యారు. ఇదిలా ఉంటే జిల్లాలో నిర్వహించిన కార్తీక వన సమారాధనలు రాజకీయ రంగు పులుముకున్నాయి. కులాల వారీ తమ బలాన్ని ప్రదర్శించుకునేందుకు తెలుగుదేశం, వైసిపిలు వన సమారాధనలు వేదికలుగా చేసుకున్నాయి. ఒకప్పుడు ఫలానా కులం, వర్గం పేరుకు ప్రాధాన్యతనివ్వకుండా, అన్ని కులాల వారు ఏకమై వన సమారాధనలను ఏర్పాటుచేసుకునేవారు. ఇటీవలి కాలంలో కులాల వారీ కార్తీక వన సమారాధలు నిర్వహించుకోవడం పరిపాటిగా మారింది. ఈ పరిణామం రాజకీయ పార్టీలకు కలసివచ్చినట్టయ్యింది. కుల సంఘాలు నిర్వహించే ఈ వన సమారాధనలకు పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించడంతోపాటు రాజకీయ సభల మాదిరిగా నేతలు ప్రసంగాలు సాగాయి. ఫలానా కులం తమ పార్టీకే అనుకూలంగా ఉందన్న సంకేతాలు జనంలోకి పంపేందుకు సదరు నేతలు విశ్వ ప్రయత్నాలు చేశారు. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కుల కార్తీక వన సమారాధనలను పెద్ద ఎత్తున ప్రోత్సహించారు. జిల్లాకు చెందిన ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు యాదవ సామాజికవర్గానికి చెందిన వారు కాగా ఇదే సామాజికవర్గానికి చెందిన నేతలు పెద్ద ఎత్తున వన సమారాధనలు నిర్వహించారు. మంత్రి యనమల సోదరుడు కృష్ణుడు తదితరులు యాదవ సామాజికవర్గ వన భోజనాలను తెలుగుదేశానికి అనుకూలంగా చూపించే ప్రయత్నం చేశారు. జిల్లాలో మరో ప్రధాన సామాజికవర్గం ఉన్న శెట్టిబలిజ/గౌడ సంఘాల ఆధ్వర్యంలో సమారాధనలపై పట్టుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు విశ్వప్రయత్నాలు చేశాయి. అలాగే ఎన్నడూ లేని రీతిలో ఈ కార్తీక మాసంలో దాదాపు అన్ని కుల సంఘాలు వన సమారాధనలకు తెర తీశాయి.

తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో భారతీయ నర్తనోత్సవం
*అలరించిన వినూత్న సంప్రదాయ నృత్య రీతులు

రాజమహేంద్రవరం, నవంబర్ 19: ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ, విజయవాడకు చెందిన శ్రీ మువ్వగోపాల ఆర్ట్ కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో నిర్వహించిన భారతీయ నర్తనోత్సవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదైంది. రాజమహేంద్రవరం ఆనం కళా కేంద్రంలో జాతీయ స్థాయిలో ఆదివారం జరిగిన భారతీయ నర్తనోత్సవంలో మొత్తం 610 మంది నృత్య రీతులను వినూత్నంగా సంప్రదాయంగా ప్రదర్శించి ఆకట్టుకున్నారు. మొత్తం 98.5 మార్కులు సాధించి రికార్డు సొంతం చేసుకున్నట్టు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ చింతపట్ల వెంకటాచారి, సలహాదారు తుమ్మిడి రామ్‌కుమార్, జాతీయ పర్యవేక్షకుడు డాక్టర్ సాయిశ్రీ వెల్లడించారు. ఈ ధ్రువీకరణ పత్రాన్ని భారతీయ నర్తనోత్సవం నిర్వాహకులు శ్రీ మువ్వ గోపాల ఆర్ట్స్ కల్చరల్ అకాడమీ నందిరాజు కృష్ణ, అరుణ కళ్యాణి దంపతులకు ముఖ్య అతిథిగా హాజరైన మేయర్ పంతం రజనీ శేషసాయి చేతుల మీదుగా అందజేశారు. ఒడిస్సీ, కధాకళి, కూచిపూడి, భరతనాట్యం, ఆంధ్రనాట్యం ప్రక్రియల్లో విలక్షణ, వినూత్న సంప్రదాయ నృత్య రీతులు ప్రదర్శించడం విశేషంగా ఆకట్టుకుంది. ముగింపు సభకు ముఖ్య అతిధిగా హాజరైన మేయర్ పంతం రజనీ శేషసాయి నిర్వాహకులను అభినందించారు. కృష్ణా, గోదావరి నదీ సంగమం మాదిరిగా విజయవాడకు చెందిన సంస్థ రాజమహేంద్రవరంలో జాతీయ స్థాయి భారతీయ నర్తనోత్సవం నిర్వహించడం అభినందనీయమన్నారు. సభకు అధ్యాపకులు నాదిండ్ల పావని కృష్ణ, మండ కృష్ణమోహన్, తాళ్లపాక అన్నమాచార్యులు వంశీకులు తాళ్ళపాక శేషాదర రవికుమారాచార్యులు, వెంకట రాఘవ అన్నమాచార్యులు, సందీప్‌కుమార్, శాస్ర్తియ నృత్య గురువుల సంక్షేమ సంఘం అడ్డాల నాగేశ్వరరావు, డాక్టర్ వేదాంతం రామలింగశాస్ర్తీ, డాక్టర్ దుర్గా భవాని, వేదాంతం పాండురంగ శర్మ, యువ నాట్యాచార్యుడు డాక్టర్ వేదాంతం వాగ్ధేవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.