తూర్పుగోదావరి

ఆగంతకుల దహనకాండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, నవంబర్ 20: రాజమహేంద్రవరం, పరిసర ప్రాంతాల్లో గత కొద్దిరోజులుగా గుర్తుతెలియని ఆగంతకులు దహనకాండకు పాల్పడుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం అర్థరాత్రి, సోమవారం తెల్లవారుజామున కూడా దుండగుల దహనకాండ కొనసాగింది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కూరగాయల టోకు వ్యాపారం జరిగే రాజమహేంద్రవరంలోని ఎస్వీ మార్కెట్‌లో ఆదివారం అర్థరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే నిప్పంటించినట్లు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనలో శ్రీగౌరీనాధ్ ట్రేడర్ ఉల్లిపాయల దుకాణంలోని సుమారు 10 టన్నుల ఉల్లిపాయలు దగ్ధమయ్యాయి. పక్కనే ఉన్న జట్లు లేబర్ కార్యాలయం కూడా అగ్నికి ఆహుతయ్యాయి. ఈసంఘటనలో సుమారు 8లక్షల ఆస్తినష్టం సంభవించినట్లు అంచనా. మంటలు వ్యాపిస్తున్న విషయాన్ని గమనించిన దుకాణం వాచ్‌మెన్ పరుగుతీయడంతో స్వల్పగాయాలతో బయటపడ్డారు. అలాగే ఏనుగుగుమ్మాల వీధిలో రెండు మోటారుసైకిళ్లను దహనం చేశారు. హుకుంపేటలో సుంకర లక్ష్మి కుటుంబం నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు వారు నివసిస్తున్న పాకకు నిప్పంటించారు. ఈసంఘటనలో రూ. 50వేల నగదు, ఫర్నీచర్, ఆమె కుమార్తెకు సంబంధించిన సర్ట్ఫికెట్లు దహనమయ్యాయి. సంఘటనా స్థలాన్ని తహశీల్దార్ కె పోశయ్య, స్థానిక పెద్దలు దుద్దుపూడి రామకృష్ణ, బొప్పన నాగేశ్వరరావు తదితరులు బాధితులను పరామర్శించారు. బాధితులకు బియ్యాన్ని పంపిణీ చేశారు. అలాగే సమీపంలోని పశువుల పాకను కూడా దుండగులు నిప్పంటించారు. అయితే పశువులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈసంఘటనలో సుమారు 50వేల ఆస్తినష్టం సంభవించింది. పిడింగొయ్యిలోని వెంకటగిరిలో కిళ్లీ దుకాణాన్ని, ఒక హోటల్‌ను కూడా గుర్తుతెలియని ఆగంతకులు దహనం చేశారు. ఈసంఘటనల్లో సుమారు 3లక్షలకు పైగా ఆస్తినష్టం సంభవించింది.
పార్టీ నేత వేధింపులపై ఆత్మహత్యాయత్నం

కాకినాడ, నవంబర్ 20: ఓ నేత తనను తెలుగుదేశం పార్టీలో చేరమని వేధిస్తున్నాడంటూ తూర్పుగోదావరి జిల్లాలోని రౌతులపూడి మండలం డి జగన్నాథపురం గ్రామానికి చెందిన బాధితుడు సోమవారం కాకినాడలోని కలెక్టరేట్‌లో గ్రీవెన్స్ సెల్ సాక్షిగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పురుగుల మందు తాగిన బాధితుడిని సకాలంలో పోలీసులు ఆసుపత్రికి తీసుకువెళ్ళడంతో ప్రాణాపాయం తప్పింది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. డి జగన్నాథపురం గ్రామానికి చెందిన కొల్లు నానాజీ (32)ని అదే గ్రామానికి చెందిన పల్లా సూరిబాబు అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీలో చేరాల్సిందిగా బలవంతం చేస్తున్నాడు. నానాజీ స్థానికంగా కిరాణా వ్యాపారం చేసుకుంటున్నాడు. సూరిబాబు సూచించినట్టు తెలుగుదేశంలో చేరేందుకు నానాజీ ఆసక్తి చూపలేదు. ఇదిలావుంటే ఇటీవల నానాజీకి చెందిన తాటాకిల్లు అగ్నికి ఆహుతయ్యింది. దీంతో ఆయన గృహాన్ని తిరిగి నిర్మించుకున్నాడు. ఆ ఇంటి ముందు పంచాయతీ అధికారులు పెద్ద మురికి కాలువను తవ్వారు. ఆ కాలువలో ఇటీవల నానాజీ ఇద్దరు పిల్లలు ప్రమాదవశాత్తూపడి గాయపడ్డారు. ఈ సంఘటనలకు తీవ్రంగా కలత చెందిన నానాజీ ఇందుకు సూరిబాబే కారణమని భావించాడు. తనకు జరిగిన అన్యాయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళేందుకు సోమవారం మధ్యాహ్నం గ్రీవెన్స్ సెల్‌కు వచ్చాడు. అర్జీని కలెక్టర్‌కు సమర్పించకుండానే తన దగ్గరున్న పురుగుల మందును సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అనూహ్యంగా జరిగిన ఈ పరిణామానికి అక్కడే ఉన్న కలెక్టర్ సహా ఇతర అధికారులు అవాక్కయ్యారు. విధి నిర్వహణలో ఉన్న ఓ కానిస్టేబుల్ తదితరులు బాధితుడి చేతిలో ఉన్న పురుగుల మందు డబ్బా స్వాధీనం చేసుకుని, హుటాహుటిన కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సకాలంలో చికిత్స అందజేయడంతో ప్రాణాపాయ స్థితి నుండి బాధితుడు బయటపడ్డాడు. ఈ సంఘటనపై కాకినాడ మూడవ పట్టణ సీఐ దుర్గారావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.