తూర్పుగోదావరి

ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, నవంబర్ 20: గ్రీవెన్స్ కార్యక్రమానికి వివిధ సమస్యలతో వచ్చే ప్రజల సమస్యలు తక్షణ పరిష్కారానికి కృషిచేస్తామని జిల్లా ఎస్పీ విశాల్ గున్ని హామీ ఇచ్చారు. సోమవారం స్థానిక పోలీస్ కనె్వన్షన్ హాలులో జిల్లాస్థాయి గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ఎస్పీ విశాల్ గున్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి వచ్చిన పలువురు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఫిర్యాదుల రూపంలో ఎస్పీకి అందజేసి తమ సమస్యలను నేరుగా ఆయనకు వివరించారు. తనకు అందే ఫిర్యాదులపై తక్షణం విచారించి వెంటనే పరిష్కారానికి కృషిచేస్తానని ఎస్పీ అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీలు ఆర్ విజయభాస్కర్‌రెడ్డి, ఎస్ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఆత్మహత్యకు తల్లీకూతుళ్ల విఫలయత్నం
రాజమహేంద్రవరం, నవంబర్ 20: అర్బన్ పోలీసు కార్యాలయంలో పనిచేస్తున్న బంధువు వేధింపులు భరించలేక ఒక మహిళ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి రోడ్డుకంరైలు వంతెన పైనుంచి గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం రేపింది. స్థానిక సుబ్బారావుపేటలో నివసించే ఎం నళిని, ఆమె ఇద్దరు కుమార్తెలు వౌనిక(18), గాయత్రి(16) గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించారు. స్థానికులు గుర్తించి, వారిని అడ్డుకుని, టూటౌన్ పోలీసులకు అప్పగించారు. బాధితులు, స్థానికుల సమాచారం ప్రకారం నళిని బావ కుమారుడు ఆనంద్ ఎస్పీ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. నళిని, ఆనంద్ కుటుంబాల మధ్య ఆస్తి తగాదాలు, ఇతర వివాదాలు ఉన్నాయి. వాటిని పరిష్కరించాలని ఆమె త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే ఎస్పీని కలిసి తమ గోడు వెళ్లబోసుకునేందుకు ప్రయత్నించగా ఆనంద్ అడ్డుకున్నాడు. ఈనేపథ్యంలో ఆమె భర్త శ్రీనివాసరావు కూడా గతంలో ఆత్మహత్యకు ప్రయత్నించి, ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సోమవారం కూడా నళిని ఎస్పీని కలిసేందుకు ప్రయత్నించగా ఆనంద్ అడ్డుకున్నాడు. దీంతో జీవితంపై విరక్తి చెందిన నళిని తన ఇద్దరు కుమార్తెలతో కలిసి రోడ్డుకంరైలు వంతెన మీదుగా గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించారు.