తూర్పుగోదావరి

కాకినాడ వైసీపీలో గ్రూపు విభేదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, నవంబర్ 20: జిల్లా కేంద్రం కాకినాడ వైఎస్సార్ కాంగ్రెస్‌లో గ్రూపు విభేదాలు రచ్చకెక్కాయి. నగరంలోని వెంకటేశ్వర ఫంక్షన్ హాలులో సోమవారం రాత్రి కాకినాడ నగర వైసీపీ అధ్యక్షుడిగా కంపర రమేష్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో నగర పార్టీ రెండు గ్రూపులుగా చీలినట్టు బహిర్గతమయ్యింది. ప్రమాణ స్వీకార సభకు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి వర్గం దూరం కావడం చర్చనీయాంశమైంది. కాకినాడ కార్పొరేషన్‌లో వైసీపీ ఫ్లోర్ లీడర్ చంద్రకళాదీప్తి సహా ఆమె భర్త ఫ్రూటీ కుమార్ గైర్హాజరయ్యారు. వైసీపీకి చెందిన దాదాపు కార్పొరేటర్లందరూ సభకు దూరం కావడం గమనార్హం! కంపర రమేష్ ప్రమాణ స్వీకారానికి ముందు కాకినాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక భానుగుడి జంక్షన్‌లో కంపర రమేష్‌కు అభినందనలు తెలియజేస్తూ ఏర్పాటుచేసిన బ్యానర్‌లోని పార్టీ నేతల ఫొటోలకు గుర్తుతెలియని వ్యక్తులు నలుపురంగు పూశారు. జరిగిన పరిణామాలతో కాకినాడలో వైసీపీ రెండుగా చీలినట్టు స్పష్టమయ్యింది. కాగా కంపర ప్రమాణ స్వీకార సభ సాక్షిగా మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ ముగ్గురు నేతలను వచ్చే ఎన్నికల్లో తమ అభ్యర్థులుగా ప్రకటించారు. కాకినాడ పార్లమెంట్ స్థానానికి చలమలశెట్టి సునీల్, కాకినాడ సిటీ అసెంబ్లీకి ముత్తా శశిధర్, కాకినాడ రూరల్‌కు కురసాల కన్నబాబు పోటీ చేస్తారని, వీరిని ఆశీర్వదించాలని మాజీ మంత్రి బోసు కోరారు. బోసు ప్రతిపాదనను వేదికపై వున్న నేతలందరూ సమర్ధించారు. దీంతో కాకినాడ రూరల్ అసెంబ్లీ సీటును ఆశిస్తున్న చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, సిటీ టిక్కెట్ నాదే అని భావిస్తున్న ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి చెక్ పెట్టినట్టేనని కార్యకర్తలు చర్చించుకున్నారు. ఈ పరిణామాన్ని ముందుగానే గ్రహించిన ద్వారంపూడి ఉద్దేశపూర్వకంగానే సభకు దూరమైనట్టు చెప్పుకున్నారు. సభలో వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా పరిశీలకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మరో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తదితరులు ప్రసంగించారు. మాజీ మంత్రి కొప్పన మోహనరావు, కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి చలమలశెట్టి సునీల్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, మాజీ ఎమ్మెల్యేలు కుడిపూడి చిట్టబ్బాయి, పెండెం దొరబాబు, రౌతు సూర్యప్రకాశరావు, పార్టీ నాయకులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ముత్తా శశిధర్, ముత్యాల శ్రీనివాస్, పర్వత పూర్ణచంద్రప్రసాద్, తోట సుబ్బారావునాయుడు, మిండగుదిటి మోహన్, మాదిరెడ్డి దొరబాబు, బసవా చంద్రవౌళి తదితరులు పాల్గొన్నారు.