తూర్పుగోదావరి

సిద్ధి వినాయకుని నాలుగో మాడ వీధి ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయినవల్లి, నవంబర్ 20: ప్రసిద్ధిచెందిన అయినవిల్లి సిద్ధివినాయకస్వామి ఆలయం వద్ధ సోమవారం నాల్గవ మాడ వీధిని ఆలయ చైర్మన్ రావిపాటి సుబ్బరాజు, ఈఓ మాచిరాజు లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ఉదయం 11 గంటలకు స్వామివారికి ప్రత్యేక పూజలుచేసి మాడ వీధిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ మాడ వీధి ప్రారంభించడం వలన స్వామివారి ఆలయం చూట్టూ భక్తులు ప్రదర్శన చేయడానికి వెసులుబాటు కలుగుతుందన్నారు. ఇంతకుముందు ఈ మాడ వీధి లేకపోవడంతో భక్తులు ప్రదక్షిణలు చేయడానికి సౌకర్యంగా ఉండేది కాదన్నారు. 4.50 సెంట్ల భూమిని రూ.19 లక్షలతో కొనుగోలు చేసి రూ.50 వేలతో మెటల్ రోడ్డు నిర్మించామన్నారు. మాడ వీధి ప్రారంభం అనంతరం కేరళ వాయిద్య కళాకారులతో మూషిక వాహనంపై స్వామివారిని ఆలయం చూట్టూ ఊరేగించారు. ఈ కార్యక్రమంలో అయినవిల్లి పీహెచ్‌సీ చైర్మన్ గుత్తుల భాస్కరరావు, ఎంపీటీసీ గన్నవరపు గన్నవరపు శ్రీనివాస్, సర్పంచ్ కొపనాతి శ్రీరామచంద్రమూర్తి, ఆలయ ప్రధాన అర్చకులు సురేష్, ధర్మకర్తల మండలి సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
పెను విషాదం
కోరుకొండ, నవంబర్ 20: పెళ్లయిన అయిదేళ్లకే అత్తింటి వేధింపులను తట్టుకోలేకపోయింది ఆ యువతి... జీవితంపై విరక్తితో బావిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది... అయితే మూడేళ్ల వయసున్న కుమార్తె, ఆరు నెలల పసికందు అయిన కుమారుడు ఇతరులకు భారం కాకూడని వారిని కూడా తనతో పాటు తీసుకుపోవాలని నిర్ణయించుకుంది.. పుట్టింటికి వచ్చిన ఆమె అర్థరాత్రివేళ పిల్లలిద్దరితో కలిసి ఇంటి ఆవరణలో ఉన్న పురాతన బావిలో దూకేసింది.. ఈ అలికిడిక మేల్కొన్న పుట్టింటివారు ముగ్గురినీ బావి నుండి వెలికి తీసినా, అప్పటికే చిన్నారులు మృతిచెందగా, ఆ యువతి మాత్రం ప్రాణాపాయం నుండి బయటపడింది... మండల కేంద్రం కోరుకొండలో ఆదివారం అర్థరాత్రి చోటుచేసుకున్న ఈ విషాద ఘటన అందరినీ కలచివేసింది... జీవితంపై విరక్తితో తనువు చాలించాలని భావించిన ఆ యువతి ప్రస్తుతం కడుపుకోతతో మరింత వేదనకు గురవుతోంది. మూడు పదుల వయస్సు కూడా లేని కుమార్తె వేదన చూసి ఆమెను కన్నవారు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇంత దారుణం జరిగినా సోమవారం మధ్యాహ్నం వరకు బాహ్య ప్రపంచానికి ఈ విషాదం తెలియలేదు. ఆనోటా ఈనోటా వ్యవహారం వెలుగులోకి రావడంతో పోలీసులు, రెవెన్యూ అధికార్లు రంగంలోకి దిగి, వివరాలు సేకరించారు. అప్పటికే పిల్లల మృతదేహాలను ఖననం చేయడంతో వాటిని బయటకు తీసి పోస్టుమార్టం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. రాజమహేంద్రవరం ఉత్తర మండల డీఎస్పీ ఎ శ్రీనివాసరావు, సిఐ మధుసూదనాచారి రంగంలోకి దిగి వివరాలు సేకరిస్తున్నారు. వీఆర్వో ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేశారు.