తూర్పుగోదావరి

అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామర్లకోట, ఏప్రిల్ 16: ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు, మరోవైపు ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చి పనిచేస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. స్థానిక పిఠాపురం రోడ్డులో నిర్వహిస్తున్న తహసీల్దారు కార్యాలయాన్ని ఎంపిడిఒ కార్యాలయం నూతన భవనం చెంతనే వున్న పాత ఎంపిడిఒ కార్యాలయంలోకి మార్పిడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం పాత ఎంపిడిఒ భవనంలో ఏర్పాటు చేసిన నూతన తహసీల్దారు కార్యాలయాన్ని మంత్రి చినరాజప్ప ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ ఇన్‌ఛార్జి ఆర్డీవో డేవిడ్‌రాజు అధ్యక్షత వహించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి రాజప్ప మాట్లాడుతూ పంచాయతీరాజ్ జాతీయ ఆవార్డు కింద సామర్లకోట మండలానికి వచ్చిన రూ.20 లక్షలు ప్రైజ్‌మనీతో రూ.10 లక్షలతో శిథిలస్థితిలోవున్న పాత ఎంపిడివో భవనాన్ని అభివృద్ధి చేసి ఆధునీకరించాలని, అలాగే రూ.10 లక్షలతో ఎంపిడివో కొత్త కార్యాలయంలో అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. సామర్లకోట క్లస్టర్ ఆసుపత్రి అభివృద్ధికి రూ.4 కోట్ల నిధులు మంజూరయ్యాయని, త్వరలో పనులు జరుగుతాయన్నారు. అలాగే స్థానిక భీమేశ్వరాలయం వద్ద రూ.3 కోట్లతో గోదావరి కాల్వపై శాశ్వత వంతెన నిర్మాణం పనులకు టెండర్లు పూర్తయ్యాయని, త్వరలో పనులు చేపడతామని మంత్రి చినరాజప్ప చెప్పారు. త్వరలో పెద్దాపురంలో సంత మార్పిడి వివాదం పరిష్కరించి, రెండు నెలల్లో ఆర్టీసీ కాంప్లెక్స్‌ను మెయిన్‌రోడ్డులో నిర్మించేలా ఆర్టీసీ ఎండి ద్వారా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా సుమారు 36వేల ఎన్టీఆర్ ఆరోగ్య కార్డుల పంపిణీకి మంత్రి రాజప్ప సభలో శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ డి సునీల్‌బాబు, ఎంపిడిఒ అడపా వెంకటలక్ష్మి, ఎఎంసి చైర్మన్ పాలకుర్తి శ్రీనుబాబు, వైస్ ఎంపిపి ఆకునూరి సత్తిబాబు, టిడిపి రాష్ట్ర ప్రచార కార్యదర్శి మన్యం చంద్రరావు, పట్టణ టిడిపి అధ్యక్షుడు అడబాల కుమారస్వామి, కార్యదర్శి బడుగు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ కార్యక్రమానికి సామర్లకోట ఎంపిపి గొడత మార్త, జడ్పీటీసీ గుమ్మళ్ళ విజయలక్ష్మి రామకృష్ణ హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది.