తూర్పుగోదావరి

నాటకరంగానికి పూర్వవైభవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 16: నాటకరంగ కళాకారులను ప్రోత్సహించి, తెలుగు నాటకరంగానికి పూర్వవైభవం తీసుకుని వచ్చేందుకు కృషిచేస్తామని వక్తలు పేర్కొన్నారు. నవయుగ వైతాళికుడు, సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం జయంతిని పురస్కరించుకుని శనివారం సాయంత్రం ఆనంకళాకేంద్రంలో నాటకరంగ దినోత్సవ వేడులను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా రాష్టస్థ్రాయి కళాకారులు ఒకరికి, ఐదుగురు జిల్లాస్థాయి కళాకారులకు రూ. 25వేలు, 10వేల చొప్పున నగదు పురస్కారాలతో సత్కరించారు. జిల్లాస్థాయిలో సిహెచ్ నరసింహారావు, ప్రసాదుల గురుమూర్తి, పంపన దయానందబాబు, పక్కి మణిబాల, ఎన్ సీతారామంలను సత్కరించి, 10వేల నగదు పురస్కారాన్ని అందజేసి సత్కరించారు. ఈసందర్భంగా జరిగిన సభలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ నాడు ప్రజల్లో చైతనాన్ని తెచ్చిన నాటకరంగాన్ని బతికించుకునేందుకు కృషిచేస్తామన్నారు. కళాకారులకు ప్రభుత్వ గృహాలు, పెన్షన్లు మంజూరు చేస్తామన్నారు. త్వరలో రాజమహేంద్రవరంలో నాటకరంగ శిక్షణా సంస్థను ప్రారంభిస్తామన్నారు. ఇళ్ల మంజూరులో నాటకరంగ కళాకారులకు మొదటి ప్రాధాన్యతనివ్వాలని ఆయన అధికారులకు సూచించారు. స్థానిక కళాకారులను ప్రోత్సహించేందుకు ఆనంకళాకేంద్రం పై అంతస్తులో ఉన్న సర్వారాయ కళామందిరాన్ని తక్కువ అద్దెకు నాటకాల రిహార్సల్స్, నాటకాలు ప్రదర్శించుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. నగరంలో కనె్వన్షన్ సెంటర్ నిర్మాణానికి టెండర్లు పిలిచామన్నారు. కనె్వన్షన్ సెంటర్ అందుబాటులోకి రాగానే ఆనంకళాకేంద్రాన్ని కళాప్రదర్శనలకు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ కందుకూరి స్థాపించిన విద్యాసంస్థలు అటు దేవాదాయశాఖ, ఇటు విద్యాశాఖ ఆధీనంలో లేకుండా త్రిశంఖుస్వర్గంలో ఉన్నాయన్నారు. కందుకూరి విద్యాసంస్థలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని దేవాదాయశాఖ మంత్రిని కోరామని, త్వరలోనే అధ్యయన బృందం వచ్చి పరిశీలిస్తుందన్నారు. జాయింట్ కలెక్టర్ ఎస్ సత్యనారాయణ మాట్లాడుతూ వీరేశలింగం సాంస్కృతిక, సాంఘిక విప్లవానికి ఆద్యుడన్నారు. నాడు సమాజంలో నెలకొన్న రుగ్మతలపై పోరాటం చేశారన్నారు. కమిషనర్ వి విజయరామరాజు మాట్లాడుతూ చిరస్మరణీయుడైన కందుకూరి ఆశయాలను, స్ఫూర్తిని విద్యార్థుల్లో నింపేందుకు ప్రతీ ఏటా ఆయన జన్మగృహాన్ని, ఆయనకు సంబంధించిన ప్రదేశాలను విద్యార్థులకు చూపించాలన్నారు. మేయర్ పంతం రజనీశేషసాయి మాట్లాడుతూ కందుకూరి స్థాపించిన విద్యాసంస్థలో చదివి ఈస్థాయికి రావడం ఆనందంగా ఉందన్నారు. ఆదికవి నన్నయ్య యూనివర్శిటీ వైస్ చాన్సలర్ ముత్యాలనాయుడు మాట్లాడుతూ మహనీయుడు కందుకూరి నడయాడిన ప్రాంతంలో విసిగా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. కందుకూరి సాహిత్య, నాటకరంగాల్లో ఎన్నో ప్రయోగాలు చేసి, అన్నింటికీ ఆద్యుడిగా నిలిచారని కొనియాడారు. దేశభక్తుడి కన్నా సంఘసంస్కర్తే గొప్పవాడన్నారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ కందుకూరి ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన స్థాపించిన విద్యాసంస్థలను నిర్వీర్యం చేశారని, ఆస్తులు కబ్జాకు గురయ్యాయన్నారు. కళాకారులను ప్రోత్సహించకపోతే నాటకరంగమే అంతరించిపోతుందన్నారు. టౌన్‌హాలును పునర్నిర్మించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ కందుకూరి తన సర్వస్వాన్ని సమాజం కోసం త్యాగం చేశారని, అందుకే అందరం ఆయన వారసులమేనన్నారు. కళాకారులను ప్రోత్సహించేందుకు కళాకేంద్రం అద్దెను తగ్గించాలన్నారు. ఈసందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.