తూర్పుగోదావరి

రమణక్కపేటలో ఎమ్మెల్యే వర్మ ఘెరావ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యు కొత్తపల్లి, డిసెంబర్ 11: కొత్తపల్లి మండలం రమణక్కపేట గ్రామంలో సోమవారం పిఠాపురం ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ చేబట్టిన ఇంటింటికి టీడీపీ కార్యక్రమం రసాభాసగా జరిగింది. సెజ్ బాధితులు, రైతులు ఎమ్మెల్యే కార్యక్రమానికి అడుగడుగునా అడ్డుతగిలారు. సెజ్ అధికారులు రైతులను ఇబ్బందులకు గురిచేస్తుంటే, మూడేళ్లుగా ఏమీ పట్టించుకోకుండా గ్రామంలోకి ఎలా వచ్చారంటూ పలువురు రైతులు ఎమ్మెల్యే వర్మను నిలదీశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమతో ఏరువాక కార్యక్రమాన్ని చేబట్టి, భూములు తిరిగి ఇచ్చేస్తామని చెప్పిన హామీ ఎందుకు నెరవేర్చలేదంటూ ఎమ్మెల్యే వర్మను నిలదీశారు. ఒకానొక దశలో ఎమ్మెల్యేను రైతులు చుట్టుముట్టి కదలనివ్వకపోవడంతో పోలీసులు, స్పెషల్ బెటాలియన్ బృందం రంగ ప్రవేశం చేశాయి. డీఎస్పీ రవివర్మ సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసు బలగాల మధ్య ఎమ్మెల్యేను బయటకు అతి కష్టంపై తీసుకువచ్చారు. అనంతరం పోలీసుల పహరా మధ్య ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వర్మ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను ఎమ్మెల్యే అయ్యాక రైతులకు సెజ్ అధికారుల నుంచి అదనంగా ఎకరాకు రూ.2లక్షలు పరిహారం ఇప్పించానని, మొత్తం రూ.340 కోట్లు అదనంగా నష్టపరిహారం ఇప్పించానన్నారు. అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, సమస్యలు ఉంటే చర్చలతో పరిష్కరించుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో వైసీపీకి చెందిన సుమారు వంద మంది కార్యకర్తలు టీడీపీలో చేరారు. వీరందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా టీడీపీలోకి ఆహ్వానించారు.
మున్సిపల్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని ఆత్మహత్యా యత్నం

అమలాపురం, డిసెంబర్ 11: అమలాపురం పురపాలక సంఘంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఒక మహిళ సోమవారం పురుగులు మందు సేవించి ఆత్మ హత్యాయత్నానికి పాల్పడింది. కార్యాలయంలో పనిచేస్తున్న విజయ అనే మహిళ సోమవారం మద్యాహ్నం భోజన విరామ సమయంలో పురుగులు మందు సేవించడంతో సహచర ఉద్యోగులు ఆమెను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెపుతున్నారు. అయితే పురపాలక సంఘంలో పనిచేస్తున్న ఇద్దరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగినుల మధ్య ఏర్పడిన వివాదమే ఈసంఘటనకు కారణంగా తెలుస్తోంది.