తూర్పుగోదావరి

ప్రజా సమస్యలకు సకాలంలో పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, డిసెంబర్ 11: ప్రజల నుంచి వచ్చిన అర్జీల పరిష్కారానికి సకాలంలో చర్యలు తీసుకోవాలని జిల్లా సంయుక్త కలెక్టర్-2 జే రాధాకృష్ణమూర్తి అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రం కాకినాడ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన మీకోసం, ప్రజావాణి కార్యక్రమాలను జాయింట్ కలెక్టర్ పర్యవేక్షించారు. ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. అర్జీలను పరిశీలించిన అనంతరం ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. పారదర్శకంగా ప్రజాసేవ చేయడంతోపాటు ప్రజల నుండి అందిన అర్జీలను సకాలంలో పరిష్కరించడం ద్వారా ప్రభుత్వ వ్యవస్థపై ప్రజలకు నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంచాలన్నారు. సంక్షేమ పథకాల సక్రమ అమలుతో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని పేర్కొన్నారు. సుదూర ప్రాంతాల నుండి అధికారులకు విన్నవించుకునేందుకు వచ్చే అర్జీదారుల పట్ల మర్యాదపూర్వకంగా మెలగాలని జేసీ హితవు పలికారు. కాగా ఈ వారం ప్రజావాణికి 154 మంది హాజరై అర్జీలు సమర్పించుకున్నారు. భూ సంబంధ సమస్యలు, ఇళ్ల పట్టాలు, గృహ నిర్మాణం, పింఛన్లు, రేషన్ కార్డులు, వికలాంగులకు పింఛన్లు, ఉద్యోగాలు, ఉపాధి కల్పన కోసం అధికంగా అర్జీలందాయి. నిరుద్యోగులు, ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న మహిళలు, వికలాంగులు దరఖాస్తులు సమర్పించారు. కాపు, బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పోరేషన్ల నుండి రుణాలు మంజూరు చేయాలని కోరుతూ పలువురు అర్జీలు సమర్పించుకున్నారు. సంబంధిత తహసీల్దార్లకు సదరు సమస్యలను బదలాయించి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్డీవోలు కూడా ఆయా సమస్యల పరిష్కారానికి తక్షణం చొరవ తీసుకోవాలన్నారు. మండల, డివిజన్ల స్థాయిలో కూడా గ్రీవెన్స్‌ను పటిష్టంగా నిర్వహించి, ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జే రాధాకృష్ణమూర్తి స్పష్టం చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి యూసీజీ నాగేశ్వరరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
గిరిజనాభివృద్ధిని గాలికొదిలేసిన ప్రభుత్వాలు
*సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ మిడియం

చింతూరు, డిసెంబర్ 11: ఏజన్సీలోని గిరిజనుల అభివృద్ధిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గాలికి వదిలేశాయని మాజీ ఎంపీ, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు మిడియం బాబూరావు ఎద్దేవా చేశారు. సోమవారం తుమ్మల గ్రామంలో చింతూరు ఎంపీపీ సీహెచ్ మురళీ అధ్యక్షతన సీపీఎం విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ముందుగా అమరవీరులైన అప్పారావు, ముత్యం స్మారక స్థూపాల వద్ద సీపీఎం నేతలు నివాళులర్పించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి టీ అరుణ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మిడియం బాబూరావు మాట్లాడుతూ గిరిజన ఉప ప్రణాళిక నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేయకుండా అన్యాయం చేస్తున్నాయన్నారు. అటవీ హక్కుల చట్టాన్ని అమలుచేయకుండా గిరిజనులు అటవీ ఉత్పత్తులను పొందకుండా అడ్డుతగులుతున్నారని దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టు వలన విలీన మండలాల గిరిజనులు సర్వం కోల్పోతున్నారని, కానీ వారిని ఆదుకునేందుకు ఇప్పటి వరకూ ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం శోచనీయమన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు ఎం కృష్ణమూర్తి, బీవీజీ తిలక్, డీ శేషావతారమ్, కారం శిరమయ్య, కుంజా రాధ, కొమరం పెంటయ్య, బొప్పిన కిరణ్, పల్లపు వెంకట్, యర్రంశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.