తూర్పుగోదావరి

యానాం నుండి జోరుగా ఎన్‌డిపిఎల్ మద్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, డిసెంబర్ 10: కోనసీమకు ఆనుకుని ఉన్న కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నుండి సుంకం చెల్లించని మద్యం (ఎన్‌డిపిఎల్) రవాణా ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. ఎన్‌డిపిఎల్ రవాణాఅరికట్టేందుకు ఎదుర్లంక బాలయోగి వారిధి వద్ద ఎక్సైజ్ చెక్‌పోస్టు ఉన్నా వారి కళ్లుగప్పి మద్యాన్ని విచ్చలవిడిగా తరలించేస్తున్నారు. యానాం-ఎదుర్లంక గోదావరి నదిపై వంతెన నిర్మించక పూర్వం యానాం - ఎదుర్లంక మధ్య రాకపోకలు పడవలపై సాగేవి. ఆ సమయంలో ప్రతీ ప్రయాణీకుడిని ఎక్సైజ్ పోలీసులు విధిగా తనిఖీచేసిన అనంతరమే బయటకు పంపించేవారు. గోదావరి నదిపై వారధి నిర్మించిన తరువాత 24 గంటలూ రాకపోకలు సాగుతుండటంతో యానాంవైపు నుండి వచ్చే ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయడం సాధ్యం కావడంలేదన్నది ఎక్సైజ్ అధికారుల వాదన. దీంతో యానాం నుండి మద్యాన్ని తరలిస్తున్న వారి పని మరింత సులభమైపోయింది. ఎక్సైజ్ అధికారుల కదలికలను పసిగట్టిన అక్రమ మద్యం రవాణాదారులు నిర్భయంగా ప్రతీరోజు లక్షలు విలువ చేసే ఎన్‌డిపిఎల్‌ను తరలించేస్తూ గ్రామాల్లో జోరుగా విక్రయాలు సాగిస్తున్నారు. ఇక తీర ప్రాంత మండలాలైన కాట్రేనికోన, తాళ్లరేవు, ముమ్మిడివరం మండలాలకు పడవలపై ఎన్‌డిపిఎల్ రవాణా జోరుగా సాగుతోంది. ఇటీవల ప్రభుత్వ ప్రకటించిన నూతన మద్యం విధానంలో గ్రామాల్లో ఎక్కడా బెల్ట్ షాపులు ఉండకూడదన్న ఆదేశాలు ఉండటంతో గతంలో బెల్ట్‌షాపులను నిర్వహించిన వారిలో కొంతమంది ఆ వ్యాపారాన్ని వదులుకోలేక తమ దృష్టిని యానాం మద్యం వైపు మళ్లించారు. దీంతో జల మార్గం గుండా యానాం మద్యాన్ని తరలించి సొమ్ములు చేసుకుంటున్నారు. ఇటీవల ముమ్మిడివరం, ఐ పోలవరం, కాట్రేనికోన మండలాల్లో బెల్ట్ షాపుల్లో పట్టుబడిన మద్యం సీసాల్లో ఎన్‌డిపిఎల్ మద్యం సీసాలు కూడా ఉన్నట్లు ఆశాఖ అధికారులు చెప్పడం దీనికి బలం చేకూర్చుతోంది. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు అంతగా దృష్టి సారించకపోవడంతో స్థానిక సిబ్బంది అక్రమ రవాణా దారులతో కుమ్మక్కై వాటాలు పంచుకుంటున్నారనే అరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఎక్సైజ్ ప్రత్యేక బృందాలు తనిఖీల్లో మాత్రమే పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు తప్ప మిగిలిన సమయాల్లో పట్టుబడినవారిపై కేసులు నమోదు చేయకుండా స్థానిక సిబ్బంది సెటిల్ చేసుకుని సొమ్ములు చేసుకుంటున్నారనే అరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో అక్రమార్కులు మరింతగా రెచ్చిపోతున్నారు. దీనిపై ఎక్సైజ్ స్క్వాడ్ సిఐ గంగాదరరావు తెలిపిన వివరాలను పరిశీలిస్తే చెక్‌పోస్టు సిబ్బంది పనితీరును ఇట్టే అంచనావేయవచ్చు. 2017 జనవరి నుండి నవంబర్ వరకూ ఎదుర్లంక చెక్ పోస్టులో కేవలం 16 కేసులను నమోదు చేసి వారి నుండి 15.125 లీటర్ల లిక్కర్‌ను స్వాధీనం చేసుకుని ముగ్గురిని మాత్రమే అరెస్టు చేసారు. మొబైల్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో 37 కేసులు నమోదు చేసి 17 మందిని అరెస్టు చేశారు. వారి నుండి 81.175 లీటర్ల మద్యాన్ని, 50.750 లీటర్ల బీరు, 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ తెలిపారు. చెక్ పోస్టు వద్ద సిబ్బంది కొరత కారణంగా అన్ని వాహనాలను తనిఖీ చేయడం సాధ్యం కావడం లేదన్నారు. దీంతో కొంత మంది తప్పించుకుంటున్న మాట వాస్తవమేనని సిఐ తెలిపారు.