తూర్పుగోదావరి

కాకినాడ బీచ్‌లో యుద్ధ్దట్యాంకర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ రూరల్, డిసెంబర్ 11: కాకినాడ బీచ్‌లో యుద్ధట్యాంకర్లను చూసి అటుగా పోయే జనం భయభ్రాంతులకు గురయ్యారు. ఏదైనా యుద్ధ జరుగుతుందా! అన్న అనుమానాలకు గురయ్యారు. కొందరు విచిత్రంగా చూశారు. ఏటా ఏదో సమయంలో ఆర్మీ-నేవీ సైనికులకు శిక్షణ నిమిత్తం వీటిని ఉపయోగిస్తారు. అదే సందర్భంలో 9 ట్యాంకర్లు కాకినాడకు తెచ్చారు. వీటిని సముద్రంలో షిప్‌లు, ఎస్‌ఎల్ బోట్‌ల ద్వారా ఒడ్డుకు తెచ్చారు. ఐఎన్‌ఎస్ శాస్ర్తీ, ఐఎన్‌ఎస్ జరియాల్, ఐఎన్‌ఎస్ కేసరిలు శిక్షణలో ఉన్నారు. సుమారు 60 మంది సైనికులు ఈ శిక్షణలో పాల్గొన్నట్లు, దేశంలో ఏదో ఒక తీరంలో ఈ శిక్షణను ఏర్పాటుచేస్తామని, అదీ తక్కువ సమయంలో శిక్షణ ఇస్తామని ఓ సైనికాధికారి తెలిపారు. ఈ వివరాలు తాము పూర్తిగా ఇవ్వలేమని, ఎవరికి సమాచారం ఇవ్వమని పేరు చెప్పడానికి నిరాకరించారు. ఈ కార్యక్రమంలో కమాండర్, కెప్టెన్లు, సైనికులు పాల్గొన్నారు.