తూర్పుగోదావరి

‘పోలవరం’ గందరగోళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, డిసెంబర్ 11: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రశ్నార్ధకంగా మారిందా అంటూ రాజమహేంద్రవరంలో వైసీపీ ఆధ్వర్యంలోని అఖిలపక్షం ఆందోళన వ్యక్తం చేసింది. ఒక వైపు పోలవరంలో ముఖ్యమంత్రి పోలవరం పనులను సమీక్షిస్తుండగా మరో వైపు పోలవరంపై అఖిలపక్షం నిర్వహించడం ప్రత్యేకత సంతరించుకుంది. రిటైర్డు ఇరిగేషన్ ఉన్నతాధికారులు, వివిధ పక్షాల ప్రతినిధులు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వైసీపీ రైతు విభాగం ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. బీజేపీ పక్షం నుంచి ఈ సమావేశానికి హాజరైన బీజేపీ నాయకుడు అడబాల రామకృష్ణ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రశ్నార్ధకమా అనే అనుమానానికే తావులేదని, ఎంత ఖర్చయినా, కేంద్రమే నిర్మించి తీరుతుందని స్పష్టం చేశారు. పోలవరం నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. అనుమానాలకు తావులేదన్నారు. రాష్ట్రంపై నమ్మకంతోనే కేంద్రం అప్పగించిందన్నారు. అదరాబాదరా నిర్మించి, అల్లరి చేసే రాజకీయాలకు తావులేదన్నారు. పోలవరం విషయంలో కేంద్రం పక్కకు తప్పుకోలేదన్నారు. కేంద్రం నిబంధనలకు లోబడే రాష్ట్రం నిర్మించాల్సి ఉందన్నారు. పోలవరం కోసం దాదాపు డెబ్బై ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నామని, మరో రెండు మూడేళ్ళు ఆగలేమా అన్నారు. స్థానిక ఆనం రోటరీ హాలులో సోమవారం పోలవరంపై అఖిలపక్షం సమావేశం నిర్వహించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన వైసీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి త్రినాధరెడ్డి మాట్లాడుతూ పోలవరం అంచనాలకు ప్రాజెక్టు అధారిటీ అనుమతి లేకుండా రూ. 58వేల కోట్లకు పెంచేయడం వెనుక ఉన్న ఉద్ధేశ్యం అనేక అనుమానాలను రేకెత్తిస్తోందన్నారు. ప్రాజెక్టు స్పిల్ వే పనులు 10 శాతం కూడా పూర్తి చేయకుండా 30 అడుగులు నిర్మించాల్సిన కాఫర్ డ్యామ్ 41 అడుగులకు పెంచేసి గ్రావిటీ ద్వారా 2018 నాటికి నీరిస్తామని అనడం ఎంత వరకు సాధ్యమని ప్రశ్నించారు. ఇన్ని అనుమానాలున్న ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రశ్నార్ధకంగా మారుతుందని అనే అనుమానం కలగక మానదన్నారు.
రిటైర్డు ఎస్‌ఇ విప్పర్తి వేణుగోపాల్ మాట్లాడుతూ లోపభూయిష్టమైన పనుల కేటాయింపు వల్లే పోలవరానికి ఈ పరిస్థితి దాపురించిందన్నారు. తనకు తెలిసి పదేళ్ళయినా పడుతుందన్నారు. ప్రజలను మభ్యపెట్టడం మంచిది కాదన్నారు. లోక్‌సత్తా ఎం వి రాజ్‌గోపాల్ మాట్లాడుతూ కేంద్రం వద్ద ముఖ్యమంత్రి విశ్వసనీయత కోల్పోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. పోలవరం విషయంలో ప్రజలను చైతన్యవంతం చేసి ఉద్యమానికి కార్యాచరణ తీసుకోవాలన్నారు. సిపి ఐ నాయకుడు నల్లా రామారావు మాట్లాడుతూ బీజేపీ నిధులు ఆపడం వల్లే అనుమానాలు రేకెత్తుతున్నాయన్నారు. కమిషన్ల కోసమే రాష్ట్రం నిర్మాణ బాధ్యత నెత్తినేసుకుందని ఆరోపించారు. న్యాయవాదుల సంఘం రాష్ట్ర నాయకుడు ముప్పాళ్ళ సుబ్బారావు మాట్లాడుతూ కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్రం మళ్ళిస్తోందనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. పోలవరం ప్రాజెక్టు రాజకీయం చేయడం దురదృష్టకరమన్నారు. రాజకీయంగా వినియోగించుకోవాలని చూస్తే ప్రజలకు ద్రోహం చేసినట్టేనన్నారు. సిపి ఎం మూర్తి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం, రాష్ట్రం మధ్య జరిగిన ఒప్పందాన్ని బయట పెట్టాలన్నారు. మాజీ ఎమ్మెల్సీ కందుల లక్ష్మీ దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్రం వైఖరి వల్లే పోలవరానికి గ్రహణం పట్టిందన్నారు. వైసీపీ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ పోలవరం ప్రజలకు వరం కాకపోయినా చంద్రబాబునాయుడుకు మాత్రం వరంగా పరిణమించిందని ఆరోపించారు. రిటైర్డు ఎస్‌ఈ ఆకుల గంగాధరరావు మాట్లాడుతూ పోలవరానికి ఉండాల్సిన ఎస్టాబ్లిష్‌మెంట్ లేదన్నారు. రైతు వెంకటరావు మాట్లాడుతూ రాష్ట్రానికి అప్పగించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.
కాంగ్రెస్ నాయకులు ఆకుల భాగ్యలక్ష్మి, ఎన్ వి శ్రీనివాస్, వైసీపీ ఫ్లోర్ లీడర్ షర్మిలారెడ్డి, రిటైర్డు ఎస్‌ఈలు సానా నాగేశ్వరావు, విప్పర్తి వేణుగోపాల్, ఆకుల గంగాధరరావు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దొండపాటి శంకరరావు, నాయకులు నక్కా శ్రీ నగేష్, మాజీ ఎమ్మెల్సీ కందుల లక్ష్మీ దుర్గేష్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, వైసీపీ నేతలు జక్కంపూడి విజయలక్ష్మి, ఆకుల వీర్రాజు, గిరజాల బాబు, సీపీఎం మూర్తి, సీపీఐ నల్లా రామారావు, లోక్‌సత్తా ఎంవీ రాజ్‌గోపాల్, యడ్ల లక్ష్మి, సేపేని రమణమ్మ, పశ్చిమ గోదావరి జిల్లా వాసు, ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్, న్యాయవాదుల సంఘం రాష్ట్ర నాయకుడు ముప్పాళ్ల సుబ్బారావు, వైసీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవిఎస్ నాగిరెడ్డి, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్నేని నాగేంద్ర నాధ్, సత్యనారాయణ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
వైట్ బర్లీ పొగాకు కొనుగోళ్లు ప్రారంభం
ధరపెంచాలంటూ రైతుల గగ్గోలు
రాజవొమ్మంగి, డిసెంబర్ 11: విదేశీ సిగరెట్ పరిశ్రమలో ఎక్కువగా ఉపయోగించే వైట్ బర్లీపొగాకు కొనుగోలు సోమవారం మండలంలో ప్రారంభమయ్యాయి. రాజవొమ్మంగి, జడ్డంగి తదితర కొనుగోలు కేంద్రాల్లో ఐటిసి, మద్దిలక్ష్మయ్య, నాగార్జున పొగాకు కంపెనీలు రైతుల వద్ద నుండి సుమారు 350 పొగాకు బేళ్లను కొనుగోలు చేశారు. బి1, బి2, బి3 రకం పొగాకు క్వింటాలు రూ.8,400 నుండి 9,000 వరకు కొనుగోలు చేసారు. గత ఏడాది గరిష్ఠంగా క్వింటాలుకు రూ.8,900 చెల్లించగా ఈ ఏడాది కేవలం వంద రూపాయలే పెంచడం పట్ల రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గత ఏడాదికంటే ఈ ఏడాది పొగాకు నారు, కూలీ ధరలు ఎక్కువగా చెల్లించామని, తీవ్రమైన వర్షాభావ పరిస్థితులతోబాటు చీడపీడలు సోకి పంటనష్టం ఎక్కువగా జరిగిందన్నారు. దీనితో కనీసం క్వింటాలుకి పదివేల రూపాయలు పలుకుతుందని ఆశించామని, కంపెనీలు రింగ్‌గా మారి తమకు అన్యాయం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పొగాకు కొనుగోలు రేటు పెంచాలని రైతులు కోరుతున్నారు. రాజవొమ్మంగి, కొయ్యూరు మండలాల్లో ఎక్కువగా ఈ పంటను రైతులు సాగు చేశారు. రాజవొమ్మంగి మండలంలో రాజవొమ్మంగి, వట్టిగెడ్డ, సూరంపాలెం, లబ్బర్తి, కిండ్ర, జడ్డంగి, ఎబికాలనీ, వణకరాయి, అప్పలరాజుపేట, వయ్యోడు తదితర గ్రామాల్లో ఎక్కువ మంది రైతులు ఈ పంటపైనే ఆధారపడి జీవిస్తున్నారు.