తూర్పుగోదావరి

రిపబ్లిక్ డే పేరెడ్‌కు ఇద్దరు నన్నయ విద్యార్థులు ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, డిసెంబర్ 14: ఆదికవి నన్నయ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు విద్యార్థులు రిపబ్లిక్ డే పేరెడ్‌కు ఎంపికయ్యారని, ఇది మరో గౌరవంగా పరిగణించాలని వీసీ ఆచార్య ముర్రు ముత్యాలనాయుడు అన్నారు. గురువారం యూనివర్సిటీలో ఎంపికైన ఈ ఇద్దరు విద్యార్థులను వీసీ అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రిపబ్లిక్ డే పేరెడ్‌కు ఆదిత్య డిగ్రీ కాలేజికి చెందిన ఎ స్వాతి ప్రియ, ఎస్‌కెఆర్ ఉమెన్స్ కాలేజీకి చెందిన బి పుష్పలత ఎంపికయ్యారని తెలిపారు. ఎపి నుంచి ఎనిమిది మంది అమ్మాయిలను ఎంపిక చేయగా వారిలో ఇద్దరు నన్నయ యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలకు చెందిన వారు కావడం విశేషమన్నారు. రిపబ్లిక్ డే పేరెడ్‌లో ప్రతీ ఏటా నన్నయ యూనివర్సిటీ ప్రత్యేక స్థానం దక్కుతుందన్నారు.
ఫార్మా, మార్కెటింగ్ రంగంలో శిక్షణ, ఉద్యోగవకాశాలు

రాజమహేంద్రవరం, డిసెంబర్ 14: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో జరుగుతున్న మెగా జాబ్‌మేళాలో గురువారం ఫార్మా, మార్కెటింగ్ రంగానికి సంబంధించి 1850 ఉద్యోగావకాశాలకు నిర్వహించిన ఈ జాబ్ మేళాలో 1250 మంది అభ్యర్ధులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని వీసీ ఆచార్య ముర్రు ముత్యాలనాయుడు తెలిపారు. మెక్స్ లూఫ్, ఐసి ఐసి ఐ, మైహెల్త్ ఫార్మా, అపోలో ఫార్మా, బిగ్ సి, కేర్ హాస్పిటల్, ఐడిబి ఐ ఫెడరల్ ప్రైవేటు లిమిటెడ్, జి 4 ఎస్ వంటి 23 ప్రముఖ కంపెనీలు రావడం జరిగిందని తెలిపారు. అభ్యర్ధులకు సూచనలు తెలియజేశారు. జాబ్‌మేళా ఏర్పాట్లను పరిశీలించి, వారితో కలిసి భోజనం చేశారు. ఈ జాబ్ మేళాలో ప్రముఖ కంపెనీలు అవసరమైన శిక్షణ కల్పించి ప్లేస్మెంట్ ఇస్తాయని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జాబ్ మేళాను ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ సందర్శించారు. కౌశల్ గోదావరి, వికాస ఆధ్వర్యంలో జరుగుతోన్న ఈ జాబ్‌మేళాలో శిక్షణ, ప్లేస్మెంట్‌లను అందుకోవాలని వికాస పీడీ వి ఎన్ రావు తెలిపారు.