తూర్పుగోదావరి

పురావస్తుశాఖ తవ్వకాలను అడ్డుకున్న గ్రామస్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విఆర్‌పురం, డిసెంబర్ 14: మండలంలోని వడ్డిగూడెం గ్రామం వద్ద గోదావరి నదీ పరివాహంలో కాకతీయుల కాలంలో నిర్మించిన, పురాతన శ్రీ రుద్రకోటేశ్వరస్వామి ఆలయాన్ని పురావస్తుశాఖ అధికారులు, గురువారం తవ్వకాలు ప్రారంభించగా స్థానిక వడ్డిగూడెం, మండల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించి తవ్వకాలను అడ్డుకున్నారు. ఇటు గ్రామస్థులకు కానీ, దేవాదాయశాఖ అధికారులకు కానీ ఎటువంటీ సమాచారం ఇవ్వకుండా పురావస్తుశాఖ అధికారులు ఎవరూ రాకుండా, వారు పంపించిన కూలీలు తవ్వకాలు ప్రారంబించటం ఏమిటని గ్రామస్థులు వాపోతున్నారు. ఎన్నో ఏళ్లుగా మాతాత ముత్తాల నుంచి ఈఆలయంలో పూజలు నిర్వహించుకుంటున్న పురాతన ఆలయాన్ని, తవ్వకాలు పేరుతో ఆలయ రూపు రేఖలను మార్చేసై తాము ఊరుకోమని గ్రామస్థులు హెచ్చరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఛైర్మన్ బొర్రా నరసింహారావు మాట్లాడుతూ పురావస్తుశాఖ అధికారులతో ఫోనులో మాట్లాడనని, ఆలయానికి పైన వేసిన సిమ్మెంటు పూతలను తొలగించి, పుర్వకాలంలో దేవాలయం ఏరూపు రేఖలు ఉన్నాయో ఆ విధంగా ఉంచి, వాటిని ఫోటోలు తీసి, డాక్యుమెంట్ చేస్తామని, ఆ తరువాత ఆలయాన్ని తొలగించి పునరావాసం ఎక్కడ ఇస్తారో అక్కడ నిర్మించి ఇస్తామని అంటున్నారని అన్నారు. ఎప్పుడో వచ్చే పోలవరానికి ఇప్పుడే తవ్వకాలు జరిపి గుడి రూపురేఖలను మార్చేస్తే ఎలాగని, మాకు పునరావాసం కల్పించిన తరువాత గుడిని తవ్వకాలు జరిపి తమకు గుడిని నిర్మించి ఇవ్వాలని మేము తెలిపామని అన్నారు. గుడి త్వకాలు జరుపుతున్న విషయం తెలుసుకున్న దేవాదయశాఖ ఇఒ తారకేశ్వరరావు, గత ఇఒ సత్యనారాయణలు ఆలయం వద్దకు వచ్చి పరిస్థితి గమనించారు. మాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఆలయం వద్ద తవ్వకాలు జరుపుతున్నారని, ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియచేస్తామని అన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ముత్యాల రామారావు, బొర్రా నరేష్, బొర్రాదుర్గారావు, గౌతం తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ పొదుపుపై దృష్టి సారించాలి
*జెసి మల్లికార్జున

కాకినాడ, డిసెంబరు 14: విద్యుత్‌ను పొదుపు చేయడం ద్వారా భవిష్యత్ తరాలకు ఇందన లోటు ఉండదని అందువల్ల ప్రజలందరూ విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలని జెసి ఎ మల్లికార్జున సూచించారు. గురువారం కలెక్టరేట్ ఆవరణలో విద్యుత్ శాఖ ఏర్పాటు చేసిన విద్యుత్ పొదుపు ర్యాలీని జెసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జెసి మల్లికార్జున మాట్లాడుతూ ఇందనాన్ని వృధా చేయడం వల్ల భవిష్యత్ తరాలకు లోటు వస్తాదని ఉద్ధేశ్యంతో ఇందన పొదుపుపై దృష్టి సారించారని చెప్పారు. పంచాయతీలు, అర్బన్ ప్రాంతాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఎల్‌ఇడి లైట్లను వాడి పొదుపు పాటించాలని జెసి చెప్పారు. ఈ నెల 14 నుండి 20వ తేదీ వరకు నిర్వహించే ఇందన పొదుపు వారోత్సవాల్లో పాఠశాల, కళాశాలల విద్యార్ధులను భాగస్వాములను చేసి ఇందన పొదుపుపై వారికి అవగాహన కల్పించాలన్నారు. ఒక యూనిట్ విద్యుత్ పొదుపు చేయడం వల్ల రెండు యూనిట్లు ఉత్పత్తికి సమానమని చెప్పారు. 15న విద్యుత్ పొదుపుపై ర్యాలీని జిల్లా కేంద్రం కాకినాడ నగరంలో నిర్వహించామని 15న డివిజన్ స్ధాయిలో పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తామని చెప్పారు. 16న విద్యార్ధులకు ఇందన ప్రాధాన్యతపై అవగాహన, 17న పాఠశాల విద్యార్ధులకు డ్రాయింగ్, వ్యాసరచన పోటీలను నిర్వహిస్తారని చెప్పారు. 18న విద్యుత్ పొదుపుపై అవగాహన కార్యక్రమాలు, 20న పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను ప్రధానం చేస్తామని తెలిపారు. అనంతరం ఆయన విద్యుత్ అధికారులు, విద్యార్ధులచే పొదుపుపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ డిఇలు జి ప్రసాద్, ఎస్ రమణమూర్తి, ఎఇలు తదితరులు పాల్గొన్నారు.