గుంటూరు

క్రిస్మస్ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 14: రాష్ట్రప్రభుత్వ ఆధ్వర్యంలో ఈనెల 23వ తేదీన నిర్వహించనున్న క్రిస్మస్ వేడుకలను ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకానున్నందున విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు సూచించారు. గురువారం స్థానిక అర్ అండ్ బి అతిథిగృహంలో జిల్లా కలెక్టర్ కోన శశిధర్, వివిధ క్రిస్టియన్ సంఘాల ప్రతినిధులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనందబాబు మాట్లాడుతూ 23వ తేదీ సాయంత్రం 5 గంటలకు లాడ్జిసెంటర్‌లోని ఎల్ ఇ ఎం స్కూలు ఆవరణలో క్రిస్మస్ వేడుకలు జరుగుతాయన్నారు. సుమారు 6 గంటల వరకు ముఖ్యమంత్రి పాల్గొనే అవకాశం ఉందన్నారు. ఈ వేడుకలకు అధిక సంఖ్యలో భక్తులు, ప్రజలు హాజరయ్యేలా చూడాలని ప్రతినిధులకు సూచించారు. వేడుకల్లో ముఖ్యమంత్రి భక్తులనుద్దేశించి మాట్లాడతారని తెలిపారు. ఆ రోజు స్కూలుకు సెలవు ప్రకటించాలని సూచించారు. సమావేశంలో జెసి-2 ముంగా వెంకటేశ్వరరావు, మతపెద్దలు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

లేడీ కిలాడీ అరెస్ట్

*189 గ్రాముల ఆభరణాలు స్వాధీనం

తెనాలి, డిసెంబర్ 14: దేవాలయాలలో మకాంవేస్తూ రాత్రి సమయాలలో దొంగతనాలు చేసే ముఠాలోని ఓ మహిళా నిందితురాలిని తెనాలి టూటౌన్ పోలీసులకు దొరికిపోయిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. డిఎస్పీ ఎం స్నేహిత తెలిపిన వివరాల ప్రకారం టూటౌన్ సిఐ కళ్యాణ్‌రాజ్ తన సిబ్బంది, గుంటూరు రూరల్ సిసిఎస్ సిబ్బదింతో కలసి మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో తెనాలి గంగానమ్మపేట శివాలయం సమీపంలో అనుమానాస్పాదంగా తిరుగుతున్న బత్తుల అంకమ్మ అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు. సత్తెనపల్లి మండల బృగుబండ గ్రామానికి చెందిన అంకమ్మను విచారించగా గతనెల 26 రాత్రి తెనాలి రామలింగేశ్వరపేటలో జవంగుల శ్రీరామవెంకటదాసు గృహంలో, ఈనెల 1వ తేదీ రాత్రి ఐతానగర్ ప్రాంతంలోని ఈదర వివేకానంద గృహంలో చోరీలకు పాల్పడినట్లు నేరం అంగీకరించినట్టు తెలిపారు. ఇదిలాఉండగా నిందితురాలు అంకమ్మ ఆమె కొడుకులు బక్తుల మణికంఠ, గోపి, పాత నేరస్తుడైన మిండాల రాజుతో కలిసి ఓముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడున్నట్లుగా విచారణలో తేలిందన్నారు. వీరు ఇటువంటి దొంగతనాలేగాక మరికొన్ని ప్రాంతాలల్లోనూ పలునేరాలకు పాల్పడినట్లు చెప్పారు. తెనాలి ఐతానగర్‌లో చోరీ చేసిన 40వేల రూపాయలను, రామలింగేశ్వరపేటలో చోరీచేసిన బంగారు వస్తువులలో కొన్నింటిని, ఇతర ప్రాంతాలలో చోరీచేసిన సుమారు 5లక్షల రూపాయల విలువగల 189 గ్రాముల బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ తెలిపారు. ముద్దాయిలను పట్టుకోవటంతో చాకచక్యంగా వ్యవహరించిన సిఐ కళ్యాణ్‌రాజ్, సిబ్బంది, సిసిఎస్, ఫింగర్ ప్రింట్ సిబ్బందిని గుంటూరు రూరల్ ఎస్పీ వెంకటప్పలనాయుడులు అభినందించినట్లు డిఎస్పీ వెల్లడించారు.