తూర్పుగోదావరి

అర్హులందరికీ న్యాయం చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముమ్మిడివరం, డిసెంబర్ 17 : ప్రభుత్వం నుంచి అనుమతులు లేకుండా 2014 తరువాత నిర్మించుకున్న గృహ లబ్ధిదారులందరికీ రుణాలు మంజూరుకు చర్యలు తీసుకుంటామని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు హామీ ఇచ్చారు. ఆదివారం మండలంలోని సిహెచ్ గునే్నపల్లి గ్రామంలో నియోజకవర్గస్థాయి సమన్వయ కమిటీ సమావేశం ఎమ్మెల్యే దాట్ల అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2014 తరువాత నిర్మించుకున్న గృహాలపై నిష్పక్షపాతంగా విచారణ నిర్వహించి అర్హులైనవారందరికీ రుణాలు అందేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. నియోజకవర్గంలో పార్టీ మండల, గ్రామ కమిటీ సమావేశాల ఫొటోలు, మినిట్స్ బుక్ కాపీలు ఎప్పటికప్పుడు కైజాల యాప్ ద్వారా రాష్ట్ర పార్టీకి అప్‌లోడ్ చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, ఎఎంసి ఛైర్మన్‌లు గొలకోటి దొరబాబు, మందాల గంగసూర్యనారాయణ, పొనమండ రామలక్ష్మి, టేకిమూడి లక్ష్మణరావు, సాగిరాజు సూరిబాబురాజు, రాయపురెడ్డి నీలకంఠేశ్వరరావు, శీలం సత్యనారాయణ, నడింపల్లి సుబ్బరాజు, అర్ధాని శ్రీనివాసరావు, భీర సత్యకుమారి, ఆకాశం శ్రీను, పొద్దోకు నారాయణరావు, కాశి పరివాజ్‌కుమార్, గాదిరాజు సత్యనారాయణ, నడింపల్లి సూర్యప్రభాకరం తదితరులు పాల్గొన్నారు.
జీవితానికి భరోసా ప్రధానమంత్రి, చంద్రన్న బీమా
- ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు
రాజమహేంద్రవరం, డిసెంబర్ 17: ప్రధానమంత్రి, చంద్రన్న బీమా పథకంలో అర్హులైన వారంతా తమ పేర్లను నమోదు చేసుకుని తమ జీవితాలకు భరోసా కల్పించుకోవాలని, ఈ పథకం భవిష్యత్‌లో వారి కుటుంబ సభ్యులకు ఎంతో ధీమాగా ఉంటుందని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. స్థానిక రెండో డివిజన్‌లో కార్పొరేటర్ పితాని లక్ష్మీకుమారి కుటుంబరావు ఆధ్వర్యంలో చంద్రన్న బీమా బాండ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా పేద, మధ్యతరగతి ప్రజల కోసం సిఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించారన్నారు. కార్యక్రమంలో బత్తిన వీరలక్ష్మి, సలాది మంగతాయారు, భారతి, ఆకాశపు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.