తూర్పుగోదావరి

ప్రత్తిపాడు టిడిపిలో అసంతృప్తి అగ్ని‘పర్వతం’ !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంఖవరం, డిసెంబర్ 17: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రత్తిపాడు నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం పార్టీలో అంతర్యుద్ధం మొదలయ్యింది. ముఖ్యంగా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఆదినుంచీ వెన్నుదన్నుగా నిలిచిన పర్వత వర్గానికి ప్రాధాన్యత తగ్గుతున్న సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో ఆ వర్గంలో ప్రస్తుతం అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసిపి) చేజిక్కించుకుంది. ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేగా వరుపుల సుబ్బారావు ఎన్నికయ్యారు.
నియోజకవర్గంలో దివంగత పర్వత సుబ్బారావు, పర్వత బాపనమ్మ, పర్వత శ్రీ సత్యనారాయణమూర్తి(చిట్టిబాబు) టిడిపి ఎమ్మేల్యేలుగా ఎన్నికై టీడీపీ అంటే పర్వత కుటుంబం, పర్వత కుటుంబం అంటేనే టీడీపీ మాదిరిగా వెలుగొందారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో పర్వత కుటుంబానికి బలమైన కేడర్ ఉంది. 2014 ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్‌పై ఎమ్మేల్యేగా పోటీచేసి ఓటమి చవిచూసిన పర్వత చిట్టిబాబుకు పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని ఇచ్చి గౌరవించింది. దీనితో ఓటమి చెందినప్పటికీ పార్టీ అధికారంలో ఉండడంతో ఎమ్మేల్యేకు దీటుగా తన హవాను కొనసాగిస్తూ కార్యకర్తలకు చేదోడుగా నిలుస్తూ, తన కేడర్‌ను మరింత బలపర్చుకున్నారు. ఈ దశలో చిట్టిబాబు అకస్మికంగా మృతి చెందడంతో నియోజకవర్గంలో పలు కీలకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. చిట్టిబాబు మృతితో పర్వత వర్గీయులైన టీడీపీ కేడర్ డోలాయమానంలో పడిపోగా, ఆయన సోదరుడు పర్వత గుర్రాజు(రాజబాబు)ను తమ నాయకునిగా ఎన్నుకుని ముందడుగు వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. చిట్టిబాబు మృతి సందర్భంగా శంఖవరంలో నిర్వహించిన సంతాపసభలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడుతూ పర్వత కుటుంబానికి టీడీపీతో చాలా అనుబంధముందని, వారికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు.
అయితే చిట్టిబాబు మృతి చెందిన కొద్ది రోజుల్లోనే స్థానిక వైసిపి ఎమ్మెల్యే వరుపుల టిడిపి తీర్ధం పుచ్చుకోవడంతో పార్టీలో వరుపుల శకం ఆరంభమయ్యింది. దీనితో పర్వత రాజబాబు వర్గీయుల్లో కొంత అసంతృప్తి, స్తబ్దత ఏర్పడింది. ఈ పరిణామాల్లో అధిష్ఠానం జిల్లా నాయకులను పంపి, పర్వత కుటుంబానికి, వారి వర్గీయులకు ఎటువంటి ఢోకా ఉండదని, అందరికీ న్యాయం జరిగేలా అధిష్ఠానం ప్రత్తిపాడు నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని భరోసా ఇప్పించింది.
దీనితో సంక్షేమ పథకాల అమలులో పర్వత, వరుపుల వర్గీయులకు సమాన ప్రాధాన్యమిచ్చేవారు. అయితే రాన్రానూ ఇరువర్గాల్లో చిన్నచిన్న పొరపొచ్చాలు మొదలయ్యాయి. ఎమ్మేల్యే వరుపుల వర్గం పట్టు బిగించడంతో పర్వత వర్గీయులుగా నియోజకవర్గంలో రకరకాల కార్యకలాపాలతో స్థిరపడిన కొంతమంది వరుపుల సరసకు చేరారు. ఇలా వర్గం మారిన నేతలు పర్వత రాజబాబును రాజకీయంగా బలహీన పరిచేందుకు కుట్రచేస్తున్నారని పర్వత వర్గీయులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. 2019 ఎన్నికలకు సమయం దగ్గర పడుచుండడంతో వరుపుల వర్గం నియోజకవర్గంపై మరింత పట్టుబిగిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నానని, టిక్కెట్ తనదేనని, పలు సమావేశాల్లో ఎమ్మేల్యే వరుపుల ప్రకటిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇటీవల పర్వత చిట్టిబాబు సోదరుడు పర్వత రాజబాబు, జానకి దంపతులు ప్రత్యేకంగా పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావును కలుసుకోవడంపై నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గంలోని సమస్యలతోపాటు, పార్టీలో తనకు, తమ వర్గీయులకు ఎదురవుతున్న సమస్యలను రాజబాబు దంపతులు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్ళినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. పార్టీకి పర్వత సేవలు అవసరమని, పార్టీ పర్వతకు తగిన ప్రాధాన్యమిస్తుందని, త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని అధిష్ఠానం వారికి హామీనిచ్చినట్లు తెలిసింది.
అయితే తమకు తెలియకుండా పర్వత అధిష్ఠానాన్ని కలవడంతో వరుపుల వర్గంలో ఆగ్రహం పెల్లుబుకుతోంది. ఈనేపథ్యంలో పర్వత వర్గానికి అసంతృప్తి కలిగించే ఘటనలు నియోజకవర్గంలో ప్రారంభమయ్యాయి. పర్వత చిట్టిబాబు హయాం నుండి కూడా శంఖవరం మండల టిడిపి కార్యకర్తల సమావేశం ఆయన స్వగృహంలోనే నిర్వహించేవారు. కానీ దానికి భిన్నంగా ఇటీవల మండల కార్యకర్తల సమావేశాన్ని కత్తిపూడిలో నిర్వహించడం పర్వతకు, ఆయన వర్గీయులకు సరైన సమాచారం ఇవ్వకపోవడం ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. కత్తిపూడి సమావేశంలో పర్వత రాజబాబుకు కార్యకర్తల సాక్షిగా ఘోర పరాభవంతోపాటు, ఏకాకిని చేసేందుకు పక్కా ప్రణాళికలు చేసినట్లు పర్వత వర్గీయులు పేర్కొంటున్నారు. రాజబాబును పొమ్మనకుండానే పొగ పెడుచున్నారని పర్వత అభిమానులు మథనపడుతున్నారు. అవమానాలు ఎదురైనా కార్యకర్తల కోసం రాజబాబు సర్దుకుపోతున్నారని వారు పేర్కొంటున్నారు.
కాగా ప్రత్తిపాడు టీడీపీ టిక్కెట్‌పై వరుపుల సుబ్బారావుతోపాటు ఆయన సన్నిహితుడు డిసిసిబి ఛైర్మన్ వరుపుల రాజా కూడా కనే్నశారు. పర్వత కుటుంబం నుండి రాజబాబు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈసారి మహిళలకే పార్టీ టిక్కెట్ ఇచ్చేందుకు అధిష్ఠానం మొగ్గు చూపుచున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనితో పర్వత రాజబాబు సతీమణి జానకిదేవి కూడా పోటీకి సుముఖత వ్యక్తంచేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ నియోజకవర్గం నుండి పర్వత బాపనమ్మ ఎమ్మెల్యేగా పనిచేసివుండటంతో మహిళలకు అనుకూలమైన నియోజకవర్గంగానే చెప్పవచ్చు. బాపనమ్మ పోటీచేసిన నాటి నుండి జానకిదేవికి పార్టీ ప్రచారం, కార్యక్రమాల్లో పాల్గొన్న అనుభవం ఉంది. అలాగే లయన్స్ క్లబ్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో పర్వత, వరుపుల వర్గాల మధ్య అంతరాలు మరింత పెరగడం ఖాయమనే వాదన వినిపిస్తోంది. ఈ వ్యవహారంలో అధిష్ఠానం ఎలా వ్యవహరిస్తుందనే అంశంపై నియోజకవర్గంలో జోరుగా చర్చసాగుతోంది.

పిఠాపురం-కాకినాడ రైల్వేలైనుకు బీజేపి కృషి

పార్టీ జిల్లా అధ్యక్షుడు మాలకొండయ్య
పిఠాపురం, డిసెంబర్ 17: పిఠాపురం-కాకినాడ రైల్వే మెయిన్‌లైన్ ఏర్పాటు చేయడానికి బీజేపి పార్టీ తీవ్రంగా కృషిచేస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎనిమిరెడ్డి మాలకొండయ్య అన్నారు. ఆదివారం పిఠాపురం వచ్చిన ఆయన విలేఖర్లతో మాట్లాడారు. బీజేపీ గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో విజయఢంకా మోగిస్తుందన్నారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రంలో హవా సాగిస్తుందన్నారు. సీపీఎం నేతలకు మోదీని విమర్శించే అర్హతలేదన్నారు. సమావేశంలో పసుపులేటి సత్యనారాయణ, బుర్రి మురళీధరరావు, ఈగల కొండబాబు, అల్లుబోయిన సూరిబాబు, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు పెండెం బాబి తదితరులు పాల్గొన్నారు.
హ్యాపీ సండేలో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
రాజమహేంద్రవరం, డిసెంబర్ 17: రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో పుష్కర ఘాట్ వద్ద ప్రతీ ఆదివారం జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సాహంగా సాగాయి. నగరపాలక సంస్థకు చెందిన విద్యార్థులతోపాటు వివిధ డ్యాన్స్ అకాడమీ విద్యార్థులు, కార్యక్రమాన్ని తిలకించడానికి వచ్చిన వారిలో కొంత మంది చిన్నారులు సైతం చక్కని నృత్యాలు ప్రదర్శించారు. లాలాచెరువు ప్రాధమిక పాఠశాల, కోటిలింగాలపేట ఆదిఆంధ్ర పాఠశాల, కోర్లమ్మపేట, సంజీవనగర్, ఆర్‌సిఎస్ మిల్స్ పాఠశాల, మెరకవీధి పాఠశాలలకు చెందిన విద్యార్థులతోపాటు స్టెప్ ఆఫ్ డ్యాన్స్ అకాడమి, ఓంకార్ నృత్య నికేతన్, స్టార్‌వన్ బాయ్స్ డ్యాన్స్ గ్రూప్ విద్యార్థులు, విద్యార్థులు విజయ్, హిమాన్సురెడ్డి సినీ గీతాలు, డ్యాన్స్‌లు చేసి అలరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ఇన్నమూరి రాంబాబు, గొర్రెల సురేష్, డిప్యూటీ కమిషనర్ ఎంఎడి ఫణిరామ్, మేనేజర్ సిహెచ్ శ్రీనివాసరావు, కార్యదర్శి శైలజావల్లి తదితరులు పాల్గొనగా స్కూల్స్ సూపర్‌వైజర్ దుర్గా ప్రసాద్, రమాదేవి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.