తూర్పుగోదావరి

ఖైదీ ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జనవరి 16: రాజమహేంద్రవరం సెంట్రల్‌జైలుకు చెందిన ఖైదీ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన కె కిషోర్(45)ను చోరీ కేసులో విజయవాడ టూటౌన్ పోలీసులు అరెస్టు చేసి, గత అక్టోబర్‌లో రిమాండ్ నిమిత్తం రాజమహేంద్రవరం సెంట్రల్‌జైలుకు తరలించారు. తీవ్రమమనస్తాపంతో ఉన్న కిషోర్ ఆదివారం జైలు బ్యారెక్‌లోని బాత్రూమ్‌లో తువాలుతో ఉరి వేసుకున్నాడు. తీవ్ర అస్వస్థతకు గురైన కిషోర్‌ను తొలుత రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి, మెరుగైన చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం కిషోర్ కన్నుమూశాడు. వన్‌టౌన్ పోలీసులు కేసుదర్యాప్తు చేస్తున్నారు.
కాపులకు రిజర్వేషన్లు ఇచ్చింది టీడీపీయే
మలికిపురం, జనవరి 16: కాపులను బీసీల్లో చేరుస్తూ తెలుగుదేశం పార్టీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని విజయవాడ ఎమ్మెల్యే బొండా ఉమ అన్నారు. మంగళవారం ఆయన మలికిపురంలో ఒక ప్రయివేటు కార్యక్రమంలో పాల్గొని అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడారు. త్వరలో పార్లమెంటులో ఈ బిల్లు ఆమోదం పొందనున్నదన్నారు. రాష్ట్ర విభజన తర్వాత నిధుల లేమితో ఉన్న ప్రత్యేకాంధ్రాను అభివృద్ధి పథంలో నడిపించిన చంద్రబాబు అభినందనీయుడన్నారు. నిధులు లేకపోయినా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆయన జోడు గుర్రాల పరిగెటిస్తున్నారని ఉమ పేర్కొన్నారు. ఆయన వెంట రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు, మాజీ ఎమ్మెల్సీ చైతన్యరాజు తదితరులు ఉన్నారు.