తూర్పుగోదావరి

జిల్లాలో జూదాల జాతర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జనవరి 16: జిల్లాలో అన్ని గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపందేలను యథేచ్ఛగా నిర్వహించారు. గతంలో కొన్ని గ్రామాల్లో నిర్వహించే ఈ పందేలు ఈసారి కోలాహలంగా అన్ని ముఖ్యగ్రామాల్లో నిర్వహించారు. భోగి రోజున ప్రారంభమైన ఈ పందేలు కనుమ వరకు బహిరంగంగా నిర్వహించారు. కోలాహలంగా జరుగుతున్న ఈ పందేలను అడ్డుకునేందుకు పోలీస్, రెవెన్యూ అధికారులు ఎటువంటి ప్రయత్నాలు చేయలేదని స్పష్టంగా కనిపిస్తోంది. అమలాపురం, ఐ పోలవరం, ముమ్మిడివరం, కాకినాడ రూరల్, జగ్గంపేట, గోకవరం, కడియం, రామచంద్రపురం, పిఠాపురం, రాజానగరం వంటి మండలాల్లో కోడిపందేలతో పాటుగా గుండాట, పేకాట వంటి జూద క్రీడలను ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో రోజుకు ఈ ఆటలపై 1కోటి రూపాయల నుండి 10 కోట్ల వరకు బెట్టింగులు జరుగుతున్నాయని అధికారికంగా నిర్వాహకులే చెబుతున్నారు. ఆ కేంద్రాల వల్ల జాతరను తలపించేలా మద్యం, పలావ్, ఇతర తినుబండారాలు విక్రయించే కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలీస్, రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించకుండా ఒక్కొక్క జూద కేంద్రం నుండి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లుగా కోడిపందేల నిర్వాహకులు పోలీస్‌స్టేషన్‌కు పంపుతున్నారు. పోలీసులే దాడులు చేసి కోడిపందేలు ఆడుతున్న వారిని అరెస్టు చేసినట్లు కేసులను నమోదు చేయిస్తున్నారు. అరెస్టయిన వ్యక్తికి రోజుకు 500 కూలీ, అతని కుటుంబానికి అవసరమైన ఖర్చు, కోర్టు విధించే జరిమానాను నిర్వాహకులే కడుతున్నారు. కోడిపందేల బరులన్నీ రాజకీయ, ప్రజాప్రతినిధులు కనుసన్నల్లోనే నిర్వహించటమే కాక దగ్గరుండి మరీ ఆడిస్తున్నారు. జిల్లాలో సుమారుగా 190కి పైగా బరులను నిర్వహించారు. ఇంత యథేచ్ఛగా కోడిపందేలు, పేకాట, గుండాటలు జరుగుతున్నా జిల్లాలో దాడులు జరిగిన దాఖలాలు మాత్రం కనిపించలేదు.

బిటెక్ విద్యార్థిపై బ్లేడుతో దాడి
రాజమహేంద్రవరం, జనవరి 16: మూత్ర విసర్జన విషయంలో ఏర్పడిన వివాదం చినికిచినికి గాలివానగా మారి, బిటెక్ విద్యార్థిపై బ్లేడుతో దాడికి దారితీసింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం మల్లయ్యపేటలో నివసించే సోములురెడ్డి కుమారుడు కెవి వెంకటరెడ్డి బిటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం రాత్రి మల్లయ్యపేట ఎస్‌బిఐ ఎటిఎం వద్ద తన స్నేహితులతో కలిసి మూత్ర విసర్జన చేస్తుండగా గుర్తుతెలియని యువకులు వారిని బెదిరించారు. దీంతో వారి మధ్య వివాదం నెలకొంది. ఈసందర్భంగా వెంకటరెడ్డి స్నేహితుడు బైరెడ్డిని కొట్టారు. ఇదేమని ప్రశ్నించిన వెంకటరెడ్డిని బ్లేడుతో దాడిచేసి వీపు, మెడమీద చీరేశారు. తీవ్రంగా గాయపడిన వెంకటరెడ్డిని ప్రభుత్వాసుపత్రిలో చేర్చగా పదుల సంఖ్యలో కుట్లు పడ్డాయి. వెంకటరెడ్డిపై బ్లేడు బ్యాచ్ దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. త్రీటౌన్ పోలీసులు కేసుదర్యాప్తు చేస్తున్నారు.