తూర్పుగోదావరి

కోజ యమ మజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, జనవరి 16: పందెం కోడి మాంసం అంటే మాంసాహారులకు ఎంతో ఇష్టం. పందెంలో ఓడిన కోడిని కోజ అంటారు. అయితే ఆ పందెం కోడిని సుమారు సంవత్సం నుండి రెండేళ్ళ పాటు పెంచిన తీరును, దానికి అందించిన ఆహారం గురించి తెలిస్తే పందెపు పుంజుపై మనిషికే ఈర్ష్య కలగక మానదు. పందాలను సిద్ధం చేసే పుంజులను ఒక ప్రత్యేక తరహాలో పెంచుతారు. వాటికి రోజువారీ ఆహారంగా ప్రారంభలో నూకలు, తవుడు, రాగులు, చోళ్ళు, గోదుమలు అందిస్తారు. అనంతరం పందెపు పుంజు లక్షణాలు కలిగిన వాటిని గుర్తించి పుంజులకు జీడిపప్పు, బాదంపప్పు, పిస్తాపప్పు, మేక కైమా, కోడి గుడ్లను ఆహారంగా అందిస్తారు. అంతేకాదు ప్రతీ రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయిస్తారు. ఈప్రక్రియ కోడిపందాలకు ఆరు నెలల ముందు నుండే నిర్వహిస్తామని పెంపకందార్లు చెపుతున్నారు. అటువంటి కోడి పుంజులను ఆషామాషీ పందాలకు ఉపయోగించరు. అలా పెంచి పోషించిన కోడి పుంజులపై పందాలు లక్షలు, కోట్లలో జరుగుతాయి. బరిలోకి దిగిన పుంజులకు కత్తులు కట్టడంవల్ల వాటిలో ఏదో ఒకటి నేల కొరగడం సహజం. ఓడిన పుంజును కోజగా నిర్ధారించి, విజేత పుంజులు వైద్యం చేయించి మళ్ళీ పందాలకు సిద్ధం చేస్తారు. అయితే పందెంలో ఓడిన పుంజు మాంసం కోసం మాంసహారులు ఎందుకు ఎగబడతారో ఇప్పటికైనా అర్ధమయ్యే ఉండాలి. పందాల్లో ఓడిన పుంజుల ఖరీదు ఏమంత తక్కువ అనుకుంటే పొరపాటే. ఓడిన పుంజును రూ.5 వేల నుండి 10 వేల వరకూ మాంసాహార ప్రియులు కొంటారంటే దాని రుచిని చెప్పకనే చెప్పొచ్చు. ఇక సాధారణ కోజలైతే రూ. 2 వేలు నుండి 4 వేల మద్య కొనుగోలు చేసారు.