తూర్పుగోదావరి

కాజులూరులో రోడ్డెక్కిన బీసీ సంఘాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాజులూరు, జనవరి 16: మండల కేంద్రమైన కాజులూరులో కోడిపందాలు నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం వివిధ ప్రాంతాల నుండి బీసీ సంఘీయులు భారీస్థాయిలో తరలివచ్చి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీస్ అధికారులు ఆందోళనకారులకు నచ్చజెప్పినప్పటికీ వినకపోవడంతో భారీస్థాయిలో పోలీసులు మోహరించారు. వివరాల్లోకి వెళ్తే... కాజులూరులో గత మూడు రోజులుగా కోడిపందాలు జోరుగా సాగుతున్నాయి. ఈ తరుణంలో సోమవారం కోడిపందాలు నిర్వహిస్తున్న చోట కాపు సామాజిక వర్గం, బీసీ వర్గాల మధ్య వివాదం చోటుచేసుకుంది. దీంతో గ్రామంలో కోడిపందాలు నిర్వహించ వద్దని మంగళవారం భారీస్థాయిలో బీసీ సంఘ నేతలు గొల్లపాలెం - కుయ్యేరు ప్రధాన రహదారిపై కాజులూరు కృష్ణుడి గుడి సెంటర్లో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రోడ్డుపై బైఠాయించడంతో ఇరువైపులా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న కాకినాడ రూరల్ సిఐ రాంబాబు, గొల్లపాలెం ఎస్‌ఐ షేక్ జబీరు, పెదపూడి ఎస్‌ఐ కిషోర్‌బాబు తదితరులు సిబ్బందితో వచ్చి ఆందోళనకారులతో చర్చలు జరిపారు. ఆందోళనకారులు అంగీకరించకపోవడంతో కోడిపందాల స్థావరంపై దాడిచేసి, పందెం రాయుళ్లను చెల్లాచెదురు చేశారు. అదేవిధంగా కాకినాడ డిఎస్పీ కొద్దిసేపటికి సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామంలో పరిస్థితిని సమీక్షించారు. అనంతరం 144 సెక్షన్ విధించారు. గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక బలగాలను మోహరించారు. సిఐ రాంబాబు స్థానిక నాయకులతో చర్చించి వారికి హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా సిఐ రాంబాబు స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ చట్టం దృష్టిలో అందరూ సమానులేనని, హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రజలకు గౌరవం ఇచ్చి గ్రామాల్లో ఎటువంటి గుండాటలు, కోడిపందాలు నిర్వహించ వద్దని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని హెచ్చరించినట్టు చెప్పారు. కాజులూరులో వివాదం సమాచారం అందడంతో ఆందోళనకారులతో చర్చించి, గ్రామంలో 144 సెక్షన విధించామని చెప్పారు. బీసీ నేతలు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు, మేడిశెట్టి అన్నవరం, పెంకె సత్యనారాయణ, పితాని సుబ్రహ్మణ్యం, మేడిశెట్టి ఇజ్రాయేలు తదితరులు ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు.