తూర్పుగోదావరి

25న దేవీశ్రీప్రసాద్‌చే నన్నయ గీతం ఆవిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జనవరి 19: ప్రముఖ సినీ సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్‌చే ఈ నెల 25వ తేదీన విశ్వవిద్యాలయాల గీతం ఆవిష్కరణ జరగనున్నదని ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ముర్రు ముత్యాలనాయుడు చెప్పారు. శుక్రవారం వీసీ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోనే పెద్దదైన ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ గీతాన్ని ప్రముఖ సినీ సంగీత రచయిత డాక్టర్ వెనిగళ్ల రాంబాబుచే వ్రాయించడం జరిగిందని, దీనిని పద్మభూషణ్ డాక్టర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్వరసంకల్పణ చేశారన్నారు. గోదావరి ప్రాంత చరిత్రను, విశ్వవిద్యాలయ ఔన్నత్యాన్ని తెలియజేసే విధంగా రూపొందించిన ఈ గీతాన్ని సుప్రసిద్ధ దక్షిణ భారతీయ సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ ఆవిష్కరిస్తారని తెలిపారు. విశ్వవిద్యాలయ చరిత్రలో ఒక ప్రధాన గట్టంగా ఉండే ఈ గీతావిష్కరణ కార్యక్రమానికి గోదావరి జిల్లా వాసులంతా హాజరు కావాలని వీసీ పిలుపునిచ్చారు. 25వ తేదీన ఉదయం 10 గంటలకు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో కార్యక్రమం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి సినీ సంగీత రచయిత డాక్టర్ వెనిగళ్ల రాంబాబు, దేవీశ్రీప్రసాద్ తల్లి శిరోమణి తదితరులు హాజరవుతారని తెలిపారు.

ఏపీ జెన్కో సివిల్ ఇంజనీర్స్ రాష్ట్ర అధ్యక్షునిగా మూర్తి

రాజమహేంద్రవరం, జనవరి 19: ఏపీ జెన్కో ఇంజనీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా కొలగాని వీవీఎస్ మూర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయవాడలోని విద్యుత్ సౌదాలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కొలగాని మూర్తి పోలవరం పవర్ ప్రాజెక్టులో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. అధ్యక్ష హోదాలో అసోసియేషన్‌కు సేవలందించడంతోపాటు తమ తోటి ఉద్యోగులు ఆంధ్రాకు చెందిన 1250 మంది తెలంగాణాలో రిలీవ్ అయిన వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి పలు వేదికల ద్వారా తీసుకెళ్లారు. పోలవరం ప్రాజెక్టు విశిష్టత, ముంపు గ్రామాల ఆవశ్యకతను, దిగువ సీలేరులో ఉన్న 450 మెగావాట్ల విద్యుత్ కేంద్రం సీమాంధ్రకు దక్కాలని అవగాహనకు కృషిచేశారు. మూర్తి రెండవ దఫా కూడా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల తమ సమస్యలు పరిష్కరించడంలో ముందుంటారని ఉద్యోగులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. జెన్కో ఉన్నతాధికారులు, ఉద్యోగులు పుష్పగుచ్ఛాలతో అభినందనలు తెలియజేశారు.