తూర్పుగోదావరి

నర్సరీ రైతుల సమస్య పరిష్కరించకపోతే ఆందోళన ఉద్ధృతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడియం, జనవరి 19: నర్సరీ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎంపీ మాగంటి మురళీమోహన్ ఇచ్చిన హామీపై తమకు నమ్మకం లేదని, నెలాఖరులోగా స్పష్టమైన నిర్ణయం ప్రకటించకుంటే తమ పార్టీ తరపున ఆందోళన ఉధృతం చేస్తామని గ్రేటర్ రాజమహేంద్రవరం వైసీపీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ హెచ్చరించారు. శుక్రవారం కడియంలో నర్సరీ రైతుల ఆందోళనకు మద్దతు పలికిన వైసీపీ నాయకులు స్థానిక విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నర్సరీ రైతులను చులకనగా చూస్తోందని మాజీ ఎమ్మెల్సీ కందుల, ఆ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, రాజమహేంద్రవరం రూరల్ వైసీపీ కోఆర్డినేటర్లు గిరజాల బాబు, ఆకుల వీర్రాజులు పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్సార్ అమలుచేసిన ఉచిత విద్యుత్ పథకాన్ని కొనసాగించి తీరాలని వారు డిమాండు చేశారు. లేనిపక్షంలో నర్సరీ రైతులకు అండగా ఉండి తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. సమావేశంలో వైసీపీ నాయకులు గట్టి నర్సయ్య, చిక్కాల ఉమామహేశ్వరరావు, దాసరి శేషగిరి, కొత్తపల్లి మూర్తి తదితరులు ఉన్నారు.
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే అనుమతులు రద్దు
*కాకినాడ ఆర్డీవో రఘుబాబు
కాకినాడ, జనవరి 19: కాకినాడ డివిజన్ పరిధిలో గర్భస్ధ లింగ నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తే స్కానింగ్ సెంటర్ల అనుమతులన్నీ రద్దు చేస్తానని కాకినాడ ఆర్డీవో ఎల్ రఘుబాబు స్కానింగ్ సెంటర్లను హెచ్చరించారు. శుక్రవారం ఆర్డీఓ కాకినాడ నగరంలోని పలు స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేశారు. తనికీ నిర్వహించిన స్కానింగ్ సెంటర్లలో సంబంధిత విషయాలను అక్కడున్న వారితో అడిగి తెలుసుకున్నారు. గర్భంలో ఉన్న శిశువు ఆడా, మగా అనే విషయాలు వెల్లడించడం చట్ట రీత్య నేరమన్నారు. మహిళలు, చిన్నారులు, గర్భవతులు వివిధ పరీక్షల నిమిత్తం వస్తారని అక్కడ అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని నిర్వాహకులను సూచించారు. అందించే వైద్య సదుపాయం, వైద్యుని పేరు డిస్‌ప్లే బోర్డుపై స్పష్టంగా రాయాలన్నారు. తాను ఆకస్మికంగా తనికీలకు వస్తానని, కేంద్రాల వద్ద పరిశుభ్రతను పాటించాలని సూచించారు. ఈ తనిఖీల్లో ఆర్డీవో వెంట అదనపు డీఎంహెచ్‌వో డాక్టర్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.