తూర్పుగోదావరి

భక్త్భివంతోనే ఉత్తమ జీవనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయవరం, జనవరి 19: ఆధ్యాత్మిక వేత్తల అడుగుజాడల్లో పయనిస్తూ భక్త్భివంతో మెలిగినప్పుడే ఉత్తమ జీవనం సాధ్యమవుతుందని రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీమోహన్ అన్నారు. శుక్రవారం రాయవరం మండలం వెదురుపాక విజయదుర్గా పీఠాధిపతి గాడ్ 82వ జన్మదిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రొఫెసర్ కేఎస్ రత్నాకర్ అధ్యక్షతన జరిగిన జన్మదిన వేడుకల సభలో ఎంపీ మాట్లాడుతూ పీఠాధిపతులు, ఆధ్యాత్మిక వేత్తలు చేసే బోధనలను అనుసరించి ఆచరణలో పెట్టడం ద్వారానే సత్ప్రవర్తనతో కూడిన జీవితం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ విజయదుర్గా పీఠాన్ని ఏర్పాటుచేసి తన ఆధ్యాత్మిక బోధనలతో భక్తులను సన్మార్గంలో నడుపుతున్న గాడ్ పూజ్యనీయులన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న సాహితీవేత్తలు డాక్టర్ బేతవోలు రామబ్రహ్మం, డాక్టర్ మేడసాని మోహన్, డాక్టర్ ఆకెళ్ల విభీషణశర్మ, ఆర్ అనంతపద్మనాభరావు, డాక్టర్ చిలకపాటి విజయరాఘవాచార్యులు మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణకు పీఠాధిపతులు చేస్తున్న సేవలను కొనియాడారు. అనంతరం రాష్టప్రతి అవార్డు గ్రహీత, మహామహోపాధ్యాయ విశ్వనాధ గోపాలకృష్ణ దంపతులను ఘనంగా సత్కరించారు. పీఠాధిపతి గాడ్ ఆధ్యాత్మిక ప్రసంగం చేస్తూ మానవత్వంలో మెలిగినప్పుడే అమ్మ సాక్షాత్కారం పొందవచ్చునన్నారు. సాంకేతిక విలువలు పెరుగుతున్న స్థాయిలో ప్రేమ, అప్యాయతలు తగ్గుతున్నాయన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నతనం నుంచీ ఉన్నత విలువలతోపాటు భక్త్భివాన్ని పెంపొందింపజేయాలన్నారు. అనంతరం భక్తులు గాడ్‌కు గజమాల వేసి, పూల కిరీటం, దుశ్శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ ఛైర్మన్ పెండ్యాల నళినీకాంత్, రాజమహేంద్రవరం నగర మేయర్ పంతం రజనీ శేషసాయి, రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి, ఆర్డీవో ఎస్ రాజశేఖర్, అన్నవరం దేవస్థానం ఈఓ జితేంద్ర, తహసీల్దార్ వీ సీత, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అడ్మినిస్ట్రేటర్ వీవీ బాపిరాజు, పీఆర్వో బాబి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా ముగిశాయి.