తూర్పుగోదావరి

అంతర్వేది ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మలికిపురం, జనవరి 19: ఈ నెల 24 నుండి ఫిబ్రవరి 1వ తేదీ వరకూ జరిగే అంతర్వేది శ్రీలక్ష్మినరసింహస్వామివారి ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్వామివారి రథాన్ని షెడ్ నుండి బయటకు తీసి రిపేర్లు పూర్తిచేసి నూతన రంగులతో తీర్చిదిద్దారు. ఆలయం ప్రాకార మండపాలు నూతన రంగులతో ఉత్సవ కళను సంతరించుకున్నాయి. స్వామివారి కల్యాణం జరిగే కల్యాణ మండప ప్రదేశాన్ని తీర్చిదిద్దుతున్నారు. తొమ్మిది రోజులపాటు స్వామివారి గ్రామోత్సవాల నిర్వహణకు వాహనాలను తీర్చిదిద్దుతున్నారు. తీర్ధంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 60 సీసీ కెమేరాలను ఏర్పాటు చేసి వీటన్నింటిని పర్యాటక భవనంపై ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసి జాగ్రత్త చర్యలకు శ్రీకారం చుట్టారు. ఆలయ గోపురాలన్నీ విద్యుద్దీపాలతో అలంకరిస్తున్నారు. ప్రయాణీకులకు ఏవిధమైన అడ్డంకి లేకుండా వన్‌వే విధానాన్ని అమలు చేయనున్నారు. కళ్యాణోత్సవానికి చేయాల్సిన ఏర్పాట్లన్నీ దేవాదాయశాఖ పరంగా పూర్తి చేశామని అసిస్టెంట్ కమిషనర్, ఇన్‌ఛార్జి ఈవో ఎం లక్ష్మీనారాయణ తెలిపారు. యాత్రికులకు మంచినీటి సౌకర్యం నిమిత్తం అంతర్వేదిలో ఉన్న మంచినీటి చెరువు నుండి పాత నీటి ఇంజన్లతో తోడి కొత్త నీటిని నింపుతున్నారు. జిల్లా కలెక్టర్ కార్తీకేయమిశ్రా పర్యవేక్షణలో రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు నేతృత్వంలో రాజా కలిదిండి కుమార సత్యనారాయణ సింహా జగపతిరాజా బహుదూర్ నేతృత్వంలోని ధర్మకర్తల మండలి, ముప్పర్తి నాని అధ్యక్షతన ఏర్పాటైన ఉత్సవ కమిటీ ఉత్సవాలను విజయవంతం చేయడానికి తమ వంతు కృషి చేస్తున్నారు. 27వ తేదీ రాత్రి 11గంటల 29 నిమిషాలకు స్వామివారి కల్యాణం, 28వ తేదీ మధ్యాహ్నం 2గంటల 5 నిమిషాలకు స్వామివారి రథయాత్ర జరుగుతాయని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఎం లక్ష్మీనారాయణ తెలిపారు.
ఇసుక ర్యాంపులో విజిలెన్స్ తనిఖీలు
కపిలేశ్వరపురం, జనవరి 19: కపిలేశ్వరపురం ఇసుక ర్యాంపులో శుక్రవారం మైన్స్ అండ్ విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాంపు నిర్వహణ, తదితర రికార్డులు పరిశీలించారు. అనంతరం మైన్స్ అసిస్టెంట్ జియాలజిస్టు డీవీఆర్ కుమార్ మాట్లాడుతూ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్సుమెంట్ ఎస్పీ ఆర్ గంగాధరరావు ఆదేశాల మేరకు మైన్స్ అండ్ జియాలజీ రాజమహేంద్రవరం ఆర్‌ఐ లక్ష్మీనారాయణ, మైనింగ్ సర్వేయర్ గీతావాణి, విజిలెన్స్ ఎస్సై ఎస్ రామకృష్ణ తదితరులు ర్యాంపు నిర్వహణను నిశితంగా పరిశీలించినట్టు తెలిపారు. ఈ తనిఖీలో జియో కోఆర్డినేట్స్ పరిధిలో నీరు ఉన్న కారణంగా వేరే ప్రదేశంలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నట్టు తాము గుర్తించామన్నారు. ఇసుక లోడు వాహనాలకు జియోట్యాగింగ్, ఆధార్ ఫీడింగ్ లేకుండా జరుగుతున్నట్టు గుర్తించామన్నారు. అలాగే ఈ ప్రదేశంలో రెవెన్యూ పర్యవేక్షణ కొరవడిందన్నారు. ర్యాంపులో గుర్తించిన లోపాలను స్థానిక కోర్ కమిటీకి నివేదిస్తామన్నారు. ఈ తనిఖీలో డిప్యూటీ తహసీల్దార్ వరప్రసాద్, ఆర్‌ఐ శ్రీరాం, సర్వేయర్ గంగాదేవి, వీఆర్వోలు, పోలీసు సిబ్బంది ఉన్నారు.