తూర్పుగోదావరి

ముగిసిన కోనసీమ చిత్రకళా ప్రదర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, జనవరి 21: తమ భావాలకు రంగులద్ది చిత్రకళకు జీవంపోస్తున్న చిత్రకారులు సేవలు వెలకట్టలేనివని పలువురు వక్తలు పేర్కొన్నారు. కోసీమ చిత్ర కళాపరిషత్ ఆధ్వర్యంలో అమలాపురంలో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న చిత్రకళా ప్రదర్శన పోటీలు ఆదివారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా స్థానిక సత్యసాయి కల్యాణ మండపంలో కోనసీమ చిత్ర కళాపరిషత్ వ్యవస్థాపక కార్యదర్శి కొరసాల సీతారామస్వామి అధ్యక్షతన జరిగిన సభలో పలువురు వక్తలు పాల్గొని మాట్లాడారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ ఛైర్మన్ చిక్కాల గణేష్ మాట్లాడుతూ గత 28 ఏళ్లుగా కోనసీమ చిత్ర కళాపరిషత్ చిత్రకారులను ప్రొత్సహించేందుకు నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందనీయం అన్నారు. ఈ సందర్భంగా కోనసీమ చిత్ర కళాపరిషత్ జీవనసాఫల్య అవార్డుకు ఎంపికైన హైదరాబాద్‌కు చెందిన చిత్రకారుడు యర్రమెల్లి రోహిణీ కుమార్‌ను ఘనంగా సత్కరించారు. చిత్రకళా పోటీల్లో ప్రథమ బహుమతి సాధించిన హైదరాబాద్‌కు చెందిన ఆగాచార్యను చిత్ర కళాపరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ప్రథమ బహుమతి సాధించిన ఆగాచార్యకు ప్రముఖ శిల్పి రాజ్‌కుమార్ అడియార్ తన తండ్రి పేరుమీదుగా రూ.31వేల నగదు పురస్కారంతోపాటు, భారత చిత్రకళారత్న అవార్డును ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. అలాగే అమరావతి చిత్రకళారత్న అవార్డులు పొందిన రాజేశ్వర్ న్యాలపల్లి (సికింద్రాబాద్), కొండా శ్రీనివాసరావు (హైదరాబాద్), కిరణ్‌కుమార్ తాడోజు, గోర్తి రవిసీతారామశాస్ర్తీ (అమలాపురం)లకు రూ.10వేలు నగదు పురస్కారం, అవార్డులతో ఘనంగా సత్కరించారు. అలాగే చిత్రమయూరి అవార్డు కింద ఎంపికైన జింకా రామారావు (సత్తెనపల్లి), ఆకాష్ ఎస్ అలీ (కర్ణాటక), జీ మధు (మోరి)లకు రూ.5వేలు నగదు, అవార్డులతో సత్కరించారు. అలాగే పోటీల్లో పాల్గొన్న చిత్రకారులను కూడా జాతీయ చిత్ర కళాపరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కోనసీమ చిత్ర కళాపరిషత్ అధ్యక్షుడు మెట్ల రమణబాబు, సీవీ సర్వేశ్వరశర్మ, డాక్టర్ జీ అనంతలక్ష్మి, డాక్టర్ బసవా వరహాలు తదితరులు పాల్గొన్నారు.
కత్తిపూడిలో నాలుగు వాహనాలు ఢీ
*డ్రైవర్‌కు గాయాలు
శంఖవరం, జనవరి 21: మండలంలోని కత్తిపూడి జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వాహనాలు ఒకదాని వెనుక మరొకటి ఢీ కొట్టుకున్న ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాజమండ్రి నుండి కత్తిపూడి వైపుకు జాతీయ రహదారిపై 4 వాహనాలు ప్రయాణిస్తుండగా ముందుగా వెళ్తున్న లారీ అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో దాని వెనుకనే వస్తున్న మరో లారీ ఢీ కొట్టింది. దాని వెనుకనే వస్తున్న కారు లారీ వెనుక భాగంలో ఢీ కొట్టగా, కారు వెనుకనే వస్తున్న మరో లారీ కారు వెనుక భాగంలో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నకారు డ్రైవర్ గాయాలపాలయ్యాడు. దీనితో గాయపడిన డ్రైవర్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.