తూర్పుగోదావరి

అర్చకులకు పట్టాదారు పాస్ పుస్తకాల జారీకి చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జనవరి 21: అర్చకులకు ఇచ్చిన భూములకు సంబంధించి పట్టాదార్ పాస్ పుస్తకాలను జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆర్జేసీ వేండ్ర త్రినాధరావు పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో ఆదివారం స్థానిక దేవాదాయ ధర్మాదాయ శాఖ చందా సత్రంలో జిల్లా ఆదిశైవ అర్చక సంఘం ఆధ్వర్యంలో అర్చక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి విశిష్ట అతిధిగా హాజరైన ఆర్జేసీ వేండ్ర త్రినాధరావు మాట్లాడుతూ అర్చక సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. అర్చకుల పేరు మీద పట్టాదార్ పాస్ పుస్తకాలను మార్చిలోగా అందజేసేందుకు కృషి చేస్తానన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆదిశైవ అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యనమండ్ర సత్య సీతారామ శర్మ (మురమళ్ళ రాంబాబు), రాష్ట్ర ఆదిశైవ సంఘం ప్రధాన కార్యదర్శి పొన్నూరి బాల కుటుంబరావు హాజరై మాట్లాడుతూ సుప్రీం కోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం శిరసావహించాలన్నారు. ఆదిశైవ అర్చక సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రవౌళి కనకదుర్గా ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కోశాధికారి మామిళ్లపల్లి వెంకటరావు, కార్యనిర్వాహక కార్యదర్శి శివలింగ ప్రపుల్ల చంద్ర, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ రాణి శ్రీనివాసరావు, వికాస డైరెక్టర్ డిఎల్‌ఎన్ మూర్తి, గోవిందు, జిల్లా ప్రధాన కార్యదర్శి వెలివలపల్లి బాలసుబ్రహ్మణ్యం, జిల్లా కోశాధికారి ఉండి షణ్ముఖేశ దత్తు, జిల్లా ఇన్‌చార్జి కాళ్ళకూరి దుర్గాప్రసాద్ తదితరులు హాజరయ్యారు. వివిధ సమస్యలను ఆర్జేసీ దృష్టికి తీసుకెళ్ళారు.