తూర్పుగోదావరి

పెట్రోలియం ఉత్పత్తులను పొదుపుగా వాడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జనవరి 21: పెట్రోలియం ఉత్పత్తులను అత్యంత పొదుపుగా వాడాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ఎ మల్లిఖార్జున ప్రజలకు పిలుపునిచ్చారు. భావితరాలకు ఇందనం అందించేందుకు ఈ తరం అప్రమత్తం కావల్సి ఉందన్నారు. జిల్లా కేంద్రం కాకినాడ నగరంలో ఆదివారం పెట్రోలియం ఉత్పత్తుల వాడకంలో పొదుపు పాటించాలని కోరుతూ జెఎన్‌టియుకె నుండి కలెక్టరేట్ వరకు నిర్వహించిన సైకిల్ ర్యాలీని జేసీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లిఖార్జున మాట్లాడుతూ ప్రకృతి నుండి మనకు లభిస్తోన్న పెట్రోల్, గ్యాస్, డీజిల్, గ్రీజ్ తదితర ఆయిల్ ఉత్పత్తులను అత్యంత పొదుపుగా వాడుకోవల్సి ఉందన్నారు. పెట్రోలియం వనరులు మన దేశంలో తక్కువగా ఉన్నందున ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నట్టు చెప్పారు. ఫలితంగా పెద్ద ఎత్తున మన ద్రవ్యం విదేశాలకు వెళ్ళి లోటు బడ్జెట్ తప్పడం లేదన్నారు. మనం ప్రస్తుతం వినియోగించుకున్న సౌకర్యాలు రానున్న తరాలకూ ఉపయోగపడాలంటే ఇందన పొదుపు పాటించాల్సి ఉందని పేర్కొన్నారు. ఇందుకు తగిన ప్రచార కార్యక్రమాలు చేపట్టాల్సి ఉందని తెలిపారు. ప్రజలందరూ ఈ వాస్తవాన్ని గ్రహించేలా స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు కృషి చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇందన పొదుపు చర్యలు చేపడుతోందన్నారు. అన్ని ఆయిల్ కంపెనీలు, హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పొదుపుపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు ఈ సైకిల్ ర్యాలీ నిర్వహించినట్టు జెసి మల్లిఖార్జున వివరించారు. కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ ఎ కృష్ణారావు, హెచ్‌పిసిఎల్ ఏరియా సేల్స్ మేనేజర్ కె శ్యామ్‌సుందర్, బిపిసి ఎల్ అధికారి నితిన్ థామ్సన్, ఐఒసిఎల్ కృష్ణమోహన్, గ్యాస్, పెట్రోలియం కంపెనీల సేల్స్‌బోయ్స్ తదితరులు పాల్గొన్నారు.