తూర్పుగోదావరి

‘అమ్మకు వందనం’కు నిధుల లేమి !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జనవరి 21: రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా చేపట్టే అమ్మకు వందనం కార్యక్రమం ప్రాధమిక, ప్రాధమికోన్నత పాఠశాలల్లో నిధుల లేమితో ఆరంభమవుతోంది. లక్ష్యం మంచిదే అయినప్పటికీ నిర్వహణ మాత్రం విద్యా శాఖాధికారులకు తలకు మించిన భారంగా పరిణమించిందంటున్నారు. విద్యార్థి దశలో మాతృమూర్తి పట్ల గౌరవ భావాన్ని పెంపొందించేందుకు ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా ఈ నెల 22వ తేదీ నుంచి అమ్మకు వందనం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అయ్యే ఖర్చును ఉపాధ్యాయులపైనే రాష్ట్ర ప్రభుత్వం నెట్టేయడంతో ఎలా నిర్వహించాలో తెలియని అయోమయం నెలకొంది. నిధుల ఊసు లేకుండా అమ్మకు వందనం చెప్పమనడం పట్ల గందరగోళం వ్యక్తమవుతోంది.
జిల్లాలోని ఉన్నత, ప్రాధమికోన్నత, ప్రాధమిక పాఠశాలల్లో తప్పకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంది. అయితే ఉన్నత పాఠశాలకు మాత్రం నిధులు మంజూరు చేసింది. ప్రాధమిక, ప్రాధమికోన్నత పాఠశాలల్లో నిర్వహణ ఖర్చులు మాత్రం ఉపాధ్యాయుల మెడకు చుట్టుకున్నాయి. ఒక్కో ఉన్నత పాఠశాలకు రూ.2500 చోప్పున జిల్లాకు రూ.12,92,500 మంజూరు చేసినట్టు ప్రకటించారు గానీ ఇప్పటికీ నిధులు విడుదల కాలేదు. నిర్ధేశించిన రీతిలో రూ.2500 కంటే అదనంగా ఖర్చయితే ఉపాధ్యాయులే భరించాల్సింది ఉంది. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి చిల్లి గవ్వకూడా విడుదల చేయలేదు గానీ కార్యక్రమాన్ని మాత్రం ఘనంగా నిర్వహించాలని ఆదేశించింది. నిధులు లేకుండా ఈ కార్యక్రమాలను ఎలా నిర్వహించాలని విద్యా శాఖాధికారులు తలలు పట్టుకున్నారు.
జిల్లాలో 22 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 47 జిల్లా పరిషత్, 46 మున్సిపల్, 2 మోడల్ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ఉన్నత పాఠశాలలకు మాత్రమే నిధులు ఇస్తామని ప్రకటించింది. అవి కూడా రేపటి నుంచి కార్యక్రమం మొదలు పెట్టాల్సి ఉన్నప్పటికీ ఇంకా విడుదల కాలేదు. అమ్మకు వందనం పేరిట బ్యానర్లు కట్టాల్సి వుంది. విద్యార్థుల తల్లిదండ్రులను పిలవాల్సి వుంది. కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను డిఈవోలకు ఉపాధ్యాయులు వాట్సాప్‌లో పంపించాల్సి ఉంది. ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రుల ఫొటోలతో బ్యానర్లు కట్టించాల్సి వుంది. అమ్మ ఔదార్యం, గొప్పదనం తెలిసేలా పాటలు, నృత్యాలు వంటి రూపకాలను ప్రదర్శించాల్సి ఉంది. పిల్లలకు, తల్లిదండ్రులకు రిఫ్రెష్‌మెంట్లు, సీటింగ్ వంటి వౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. ఇత్తడి లేదా, స్టీలు ప్లేటులో తల్లి పాదాలను ఉంచి విద్యార్థులతో వారివారి తల్లుల పాదాలు కడిగించి పాదపూజ చేయించాల్సి ఉంది. అమ్మగొప్పదనంపై వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలి. జూనియర్, సీనియర్ స్థాయిల్లో బహుమతులు ఇవ్వాల్సి ఉంది. ఇదంతా చేయాలంటే కనీసం రూ.3 నుంచి రూ.5 వేల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. కార్యక్రమం అంటే నిర్వహిస్తాం గానీ నిధులెక్కడ నుంచి తెచ్చేదని వాపోతున్నారు. ప్రాధమిక, ప్రాధమికోన్నత పాఠశాలలకు కూడా ఎంతో కొంత నిధులు కేటాయిస్తే భారం తప్పుతుందని అంటున్నారు.