తూర్పుగోదావరి

ఇంటర్‌లో మెరుగైన ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 19: ఇంటర్మీడియెట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు గత ఏడాది కన్నా మెరుగైన ఉత్తీర్ణతను సాధించారు. రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లా తూర్పుగోదావరి రాష్టస్థ్రాయిలో ఫలితాల్లో వెనుకబడింది. మంగళవారం ప్రకటించిన ప్రథమ సంవత్సరం ఇంటర్మీడియెట్ ఫలితాల్లో 64శాతం, ద్వితీయ సంవత్సరంలో 68శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయిగా నిలిచింది. రాష్టస్థ్రాయిలో జిల్లాకు మొదటి సంవత్సరంలో 5వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 9వ స్థానం దక్కాయి. వరుసగా 2015, 2014లో ప్రథమ సంవత్సరంలో 49.19, 51శాతం ఉత్తీర్ణత నమోదైంది. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 66, 65శాతం ఉత్తీర్ణులయ్యారు. ఈఏడాది జిల్లాలో ప్రథమ సంవత్సరం మొత్తం 42వేల 438 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, వారిలో 27వేల 186 మంది ఉత్తీర్ణత సాధించారు. 18వేల 825 మంది బాలురు పరీక్షకు హాజరుకాగా, వారిలో 58శాతం మంది అంటే 10వేల 968 మంది ఉత్తీర్ణత సాధించారు. 23వేల 610 మంది బాలికలు పరీక్షకు హాజరుకాగా, 16వేల 218 మంది ఉత్తీర్ణత సాధించారు. పరీక్షకు హాజరైన బాలికల్లో 69శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరం పరీక్షలకు మొత్తం 37వేల 525 మంది హాజరుకాగా, వారిలో 25వేల 653 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురలో 64, బాలికల్లో 72శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. 16వేల 652 మంది బాలురు పరీక్షకు హాజరుకాగా 10వేల 701 మంది, 20వేల 873 మంది బాలికల్లో 14వేల 952 మంది ఉత్తీర్ణులయ్యారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 356 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వాటిలో 45 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలలకు సంబంధించి ఉత్తీర్ణత ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. ప్రథమ సంవత్సరం విద్యార్థులు మొత్తం 6వేల 186 మంది పరీక్షకు హాజరుకాగా, వారిలో 3వేల 96 మంది ఉత్తీర్ణత సాధించారు. 53శాతం ఉత్తీర్ణత నమోదైంది. ద్వితీయ సంవత్సరంలో 4880 మంది పరీక్షకు హాజరుకాగా, వారిలో 3181 మంది ఉత్తీర్ణత సాధించారు. ఎయిడెడ్ కళాశాలలకు సంబంధించి ప్రథమ సంవత్సరం విద్యార్థులు 35శాతం, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 46శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఓకేషనల్ విద్య మొదటి సంవత్సరంలో 61శాతం, ద్వితీయ సంవత్సరంలో 75శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. సాంఘిక సంక్షేమ కళాశాలలకు చెందిన మొదటి సంవత్సరం విద్యార్థులు 74, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 77శాతం, ఎపిఆర్జెసి మొదటి సంవత్సరం విద్యార్థులు 72, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 85శాతం మంది, గిరిజన సంక్షేమశాఖ కళాశాలలకు చెందిన మొదటి సంవత్సరం విద్యార్థులు 69, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 80శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.