తూర్పుగోదావరి

సొసైటీల బలోపేతానికి చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, ఏప్రిల్ 19: సహకార సంఘాల అభివృద్ధిపైనే రైతు సంక్షేమం ఆధారపడి ఉంటుందని, వాటిని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం విధానాలను రూపొందిస్తోందని రాష్ట్ర సహకార శాఖ, అటవీ శాఖా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. ఉప్పలగుప్తం మండలం పెదగాడవిల్లిలో మంగళవారం ఉప ముఖ్యమంత్రి తండ్రి, సహకార ఉద్యమ నాయకుడు నిమ్మకాయల వెంకట రంగయ్యనాయుడు శిలావిగ్రహ ఆవిష్కరణ, సొసైటీ నూతన భవన ప్రారంభ కార్యక్రమాల్లో బొజ్జల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో బొజ్జల మాట్లాడుతూ సహకార సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో గతేడాది 80శాతం పైగా ధాన్యాన్ని కొనుగోలు చేయగా, ఈ ఏడాది ఇప్పటికే 50 శాతం పైగా ధాన్యం సేకరించామన్నారు. ప్రభుత్వ పగ్గాలు చేపట్టే నాటికి సహకార సంఘాలు రూ.15000 కోట్లు నష్టాల్లో ఉన్నాయని, ఆ లోటును పూడ్చడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషికి వెలకట్టలేమన్నారు. ఉపముఖ్య మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ పశ్చిమ సహకారం రంగ అభివృద్ధిలో ఉభయ గోదావరి జిల్లాలు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయన్నారు. అయితే పశ్చిమ గోదావరి జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండగా తూర్పు గోదావరి రెండవ స్థానంలో ఉందన్నారు. సహకార సంఘాలు వాణిజ్య బ్యాంకుల మాదిరిగా వ్యాపార కార్యకలాపాలను విస్తరించాలన్నారు. రైతులకు వ్యక్తిగత రుణాలు ఇచ్చి వారి అభివృద్ధికి కృషి చేయాలన్నారు. చేపల చెరువులు సాగు చేసే రైతులకు 90 శాతం రాయితీతో సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సమావేశంలో జడ్పీ చైర్మన్ నామన రాంబాబు, ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ కి రవికిరణ్‌వర్మ, డిసిసిబి చైర్మన్ , డిసిఎంఎస్ చైర్మన్ కెవివి సత్యనారాయణరెడ్డి, అమలాపురం మున్సిపల్ ఇన్‌చార్జి చైర్‌పర్సన్ పెచ్చెట్టి విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే చిల్లా జగదీశ్వరి పాల్గొన్నారు.