తూర్పుగోదావరి

శ్రీకాళహస్తి రోడ్డు ప్రమాదంలో దిండి వాసులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మలకిపురం, ఫిబ్రవరి 13: శివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీకాళహస్తిస్వామిని దర్శించుకొని తిరిగి వస్తుండగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మలికిపురం మండలం దిండి గ్రామానికి చెందిన కట్టా రామారావు, కుమారి దంపతులు మృతిచెందారు. గత 16 సంవత్సరాలుగా శ్రీకాళహస్తిలోనే జీవిస్తూ మయూరి సుగర్స్‌లో ఫిట్టర్‌గా పనిచేస్తున్న రామారావు మంగళవారం స్వామిని దర్శించుకొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని దిండిలోని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. భార్యభర్తలు ఇరువురు మృతిచెందడంతో ఆయన స్వగ్రామమైన దిండిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వారం రోజుల క్రితమే రామారావు స్వస్థలం వచ్చి వెళ్లారని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఆరు ఇళ్లు దగ్ధమై
రూ.8 లక్షల ఆస్తినష్టం

ఏలేశ్వరం, ఫిబ్రవరి 13: ఏలేశ్వరం మండలం జెడ్డంగి అన్నవరం గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం సంభవించిన అగ్ని ప్రమాదంలో ఆరు ఇళ్లు దగ్ధమై సుమారు రూ.8 లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. ఈ ప్రమాదంతో ఆయా ఇంటి యజమానులతోపాటు అద్దెకు ఉన్న మరో అయిదు కుటుంబాలు కూడా వీధినపడ్డాయి. మొత్తం 11 కుటుంబాల వారు నిరాశ్రయులయ్యారు. సమాచారం అందిన వెంటనే ప్రత్తిపాడు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఇలావుండగా ఏలేశ్వరం తహసీల్దారు కె లక్ష్మీ కళ్యాణి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ పొన్నాలు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. వంట గ్యాస్ లీకై మంటలు వ్యాపించడంతో ఈ ప్రమాదం సంభవించిందని బాధితులు తెలిపారు. కాండ్రేగుల అప్పారావు, కొప్పిశెట్టి నాగు, గాంజా మహేశ్వరరావు, జుత్తుగ అప్పలరాజులతోపాటు మరో ఆరు కుటుంబాలు అద్దెకు ఉంటున్నారని బాధితులు తెలిపారు. ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, గృహోపకరణాలు, సామాగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి.