తూర్పుగోదావరి

నేత్రపర్వంగా మహాశివరాత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఫిబ్రవరి 13: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని శైవక్షేత్రాలు భక్తులతో పోటెత్తాయి. ‘ఓం నమో నమఃశివాయః శివ శివ శంకర.. హర హర మహదేవ.. శంభో కైలాస వాస’ అంటూ దేవ దేవుడిని వేడుకున్నారు. మంగళవారం వేకువజాము నుండి భక్తులు విశేష సంఖ్యలో శివాలయాలకు పరమ శివుని దర్శనభాగ్యం కోసం తరలివెళ్ళారు. జిల్లా కేంద్రం కాకినాడలోని రామారావుపేటలో ప్రసిద్ధిగాంచిన శివాలయం, దేవాలయం వీధి, జగన్నాథపురంలోని శైవ క్షేత్రాలు భక్తులతో క్రిక్కిరిశాయి. భక్తులు ఆ పరమ శివుడికి ప్రత్యేక పూజలు చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ప్రసిద్ధిగాంచిన శివాలయాలకు భక్తులు తరలి వెళ్ళారు. ఆయా ప్రాంతాల్లో శివాలయాల పరిసరాలు శివనామ స్మరణతో మార్మోగాయి. రాష్ట్రంలోని ఐదు పంచారామాల్లో రెండు జిల్లాలోని ద్రాక్షారామ, సామర్లకోటలో ఉండటంతో ఇతర జిల్లాలకు చెందిన భక్తులు సైతం ఈ ఆలయాలకు భారీగా తరలివచ్చారు. సామర్లకోటలోని శ్రీ చాళుక్య కుమార రామ భీమేశ్వరాలయం భక్తులతో కిక్కిరిసింది. ఆలయ పరిసరాలు జన సంద్రాన్ని తలపించాయి. కాకినాడ-రాజమహేంద్రవరం కెనాల్ రోడ్‌లో వందలాది వాహనాల రాకపోకలతో ట్రాఫిక్ స్తంభించింది. సామర్లకోట రైల్వేగేట్ వద్ద గంటల తరబడి ట్రాఫిక్ జామయింది. ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించేందుకు పోలీసులు అవస్థలకు గురయ్యారు. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ద్రాక్షారామ, కోటిపల్లి, మురమళ్ళ శివాలయాల్లో భక్తులు పోటెత్తారు. ఆయా ఆలయాల్లో దేవాదాయ, రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. జిల్లాలోని పట్టిసీమలో ఉన్న ప్రసిద్ధ శివాలయానికి జిల్లా నలుమూలల నుండి జనం తరలివెళ్ళారు. ప్రజలు ఆటోలు, జీపులు, కార్లు, మినీ బస్సులు బుక్ చేసుకుని పట్టిసీమ, రంపచోడవరం, పలివెల, రాజమహేంద్రవరంలోని కోటి లింగాల రేవులకు తరలివెళ్ళారు. ప్రసిద్ధిగాంచిన ద్రాక్షారామ, సామర్లకోట తదితర ఆలయాల్లో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, వీఐపీలకు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. వీఐపీలు వచ్చిన సమయాల్లో క్యూలైన్లలో ఉన్న భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. ఆలయ పరిసరాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం భక్తులతో కిటకిటలాడింది.

ఇద్దరు వ్రత పురోహితులకు ఛార్జి మెమో
తుని, ఫిబ్రవరి 13: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం సత్యనారాయణ దేవస్థానంలో భక్తుల నుండి డబ్బుల డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణపై ఇద్దరు వ్రత పూరోహితులకు ఈవో మంగళవారం చార్జి మెమో జారీ చేశారు. ఆలయ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం దేవస్థానంలో ప్రధాన వ్రత పురోహితలు నాగాభట్ల కామేశ్వరశర్మ, ఎ వన్ గ్రేడు వ్రత పురోహితుడు కర్రి విశ్వనాధం నెల్లూరు జిల్లా నాయుడుపేటకు చెందిన పరమశివయ్య, కె అశోక్‌బాబు నుండి రూ.500 లనుండి రూ.1500 ఇవ్వాలని డిమాండ్ చేయడంతో వారు ఈవో కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీంతో ఇవో జితేంద్ర వారికి ఛార్జి మెమో జారీ చేశారు.