తూర్పుగోదావరి

పట్టిసీమ భక్తులకు సౌకర్యాల పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీతానగరం, ఫిబ్రవరి 13: మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా మండలంలోని వంగళపూడి గోదావరి రేవు నుండి పశ్చిమ గోదావరి జిల్లా పట్టిసీమలోని వీరభద్రేశ్వరుని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులకు చేసిన ఏర్పాట్లను రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ సాయికాంత్ వర్మ, రాజానగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌లు సోమవారం పరిశీలించారు. వంగళపూడి ర్యాంపులో భక్తులు గోదావరి పాయ దాటేందుకు ఏర్పాటుచేసిన భద్రతా ఏర్పాట్లు, పడవలు, మంచినీరు, భోజన, వైద్య తదితర సౌకర్యాలను వారు నిశితంగా పరిశీలించారు. వీరి వెంట తహసీల్దార్ కనకం చంద్రశేఖర్, ఎంపీడీఓ డి శ్రీనివాసరావు, నార్త్‌జోన్ డీఎస్పీ శ్రీనివాసరావు, కోరుకొండ సీఐ కె రవికుమార్, ఎస్సై ఎ వెంకటేశ్వరావు, జడ్పీటీసీ కాండ్రు త్రివేణీ శ్రీనివాసరావు, ఎంపీపీ చిట్టూరి శారద, వైస్ ఎంపీపీ కోసూరి త్రిమూర్తులరాజు, మాజీ ఎంపీపీ పెందుర్తి దేవదాసు, సర్పంచ్ గద్దే సురేష్, గద్దే వెంకట కృష్ణచౌదరి, దూలం కృష్ణ, ఆర్‌ఐ లక్ష్మి, వివిధ శాఖలకు చెందిన మండల స్థాయి అధికారులు, ఆయా శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
ద్రాక్షారామకు పోటెత్తిన భక్తులు
రామచంద్రపురం, ఫిబ్రవరి 13: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ద్రాక్షారామ భీమేశ్వరస్వామి ఆలయాన్ని మంగళవారం భక్తజనం అశేష రీతిలో దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి పెండ్యాల వెంకట చలపతిరావు నేతృత్వంలో భక్తులకు ఏర్పాట్లు చేశారు. భీమేశ్వరస్వామికి విశేష రీతిలో అభిషేకాలు అనువంశిక అర్చకులు, రుత్విక్కులు నిర్వహించారు. మాణిక్యాంబ అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజాకార్యక్రమాలు జరిపించారు. వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు భక్తులకు వౌలిక సదుపాయాలు కల్పించారు. ఆలయం పక్కనే ఉన్న శ్రీ పైండా వెంకన్న రామకృష్ణయ్య అన్నదాన సత్రంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఆలయంలో క్యూలైన్‌లు నిండిపోవడంతో మెయిన్‌రోడ్డుకు క్యూలైన్ వచ్చింది. రామచంద్రపురం డీఎస్పీ జయంతి వాసవీ సంతోష్ నేతృత్వంలో పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. రామచంద్రపురం ఆర్టీసీ డిపో మేనేజర్ రోణంకి సీతారామనాయుడు నేతృత్వంలో ఆర్టీసీ బస్సులు ప్రత్యేకంగా ద్రాక్షారామకు, కోటిపల్లికి నడిపారు. గ్రామ ప్రముఖులు పేపకాయల సత్యనారాయణ (బాబ్జీ) నేతృత్వంలో శ్రీసాయి మాధవానంద రైస్ మిల్లు వద్ద అఖండ నామ సంకీర్తన, భారీ స్థాయిలో అన్నదానం జరిపించారు.