ఆంధ్రప్రదేశ్‌

బైక్‌పైనే మృతదేహం తరలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజవొమ్మంగి, ఫిబ్రవరి 13: వాహనం అందుబాటులో లేకపోవడంతో అనారోగ్యంతో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని బైక్‌పై ఇద్దరు వ్యక్తుల నడుమ ఉంచి తరలించిన విషాద ఘటన ఇది. తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని వట్టిగెడ్డ గ్రామంలో మంగళవారం ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. వివరాలిలావున్నాయి.. రాజవొమ్మంగి మండలం వట్టిగెడ్డ గ్రామానికి చెందిన గవిరెడ్డి తాతయ్య (56) అనే వ్యవసాయ కూలీ మంగళవారం పొలంలో పనిచేస్తుండగా ఆకస్మికంగా అనారోగ్యానికి గురయ్యాడు. 108 వాహనం అందుబాటులో లేకపోడంతో కుటుంబసభ్యులు అతడిని బైక్‌పై హుటాహుటిన స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు. అయితే వైద్యులు పరీక్షించి, అతడు మృతిచెందాడని ధ్రువీకరించారు. దీనితో మృతదేహాన్ని తిరిగి తమ ఇంటికి తీసుకెళ్లడానికి వాహనం కోసం కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. ఆరోగ్య కేంద్రానికి అంబులెన్సు ఉండటంతో ఆ వాహనం కోసం ప్రయత్నించారు. అయితే డీజిల్ లేదని సిబ్బంది చెప్పడంతో ఆటోల కోసం ప్రయత్నించారు. అవీ అందుబాటులో లేకపోవడంతో గత్యంతరం లేక మృతదేహాన్ని బైక్‌పైనే ఇంటికి తరలించారు. బైక్‌పై ఇద్దరు బంధువుల మధ్య తాతయ్య మృతదేహాన్ని కూర్చోబెట్టి, తలపై టవల్ కప్పి తరలించడం చూపరులను కంటతడి పెట్టించింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మృతదేహాలను తరలించడానికి ప్రారంభించిన ‘మహాప్రస్థానం’ సేవలు తూరు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.