తూర్పుగోదావరి

అటవీ అకాడమీని మరింత పటిష్టపరుస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహే0ద్రవరం, ఫిబ్రవరి 18: అటవీ అకాడమీ రాజమహేంద్రవరంలోనే సుస్థిరంగా వుంటుందని, మరింత పటిష్టపరుస్తామని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు చెప్పారు. అటవీ అకాడమీని ఎక్కడికీ తరలించేది లేదన్నారు. ఆదివారం అటవీ అకాడమీని మంత్రి సందర్శించారు. మెరుగైన పనితీరుతో వనం మనం, మిషన్ హరితాంధ్రప్రదేశ్ లక్ష్యాలను సాధిస్తూ అటవీ శాఖకు మంచి పేరు తేవాలని అటవీ అకాడమిలో శిక్షణ పొందుతున్న బీట్ అధికారులు, సెక్షన్ అధికారులకు మంత్రి పిలుపునిచ్చారు. అటవీ అకాడమీలోని ట్రెయినీల డార్మిటరీని, ఆడిటోరియాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రెయినీలనుద్దేశించి మాట్లాడుతూ శిక్షణా సమయంలో శాఖకు చెందిన సమగ్ర విషయాలు అవగాహన చేసుకోవాలన్నారు. వన సంరక్షణ విధులను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. అకాడమీలో అన్ని సదుపాయాలు కల్పిస్తామని, సమస్యలేమైనా వుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. అటవీ విస్తీర్ణం వ్యాప్తిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలోకి రావడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దీని పట్ల అభినందనలు తెలిపారన్నారు. అటవీ సంపద అక్రమ నిరోధం, వన్యప్రాణుల రక్షణకు, అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది పూర్తి చైతన్యంతో వ్యవహరించాలని మంత్రి అన్నారు. వనం మనం కార్యక్రమంలో నాటిన 18 కోట్ల మొక్కలు పూర్తిగా బతికేలా చర్యలు తీసుకుంటే రాష్ట్రం హరితాంధ్రప్రదేశ్‌గా మారడం కష్టమేమీ కాదన్నారు. వనం మనం మిషన్, హరితాంధ్రప్రదేశ్ లక్ష్యాల సాధనకు పూర్తి స్థాయిలో కృషి చేస్తామని ఈ సందర్భంగా అకాడమీలో శిక్షణ పొందుతున్న ట్రెయినీలు మంత్రి ఎదుట ప్రతిజ్ఞ చేశారు.

వైభవంగా వీరేశ్వరస్వామి తెప్పోత్సవం
ఐ పోలవరం, ఫిబ్రవరి 18: నిత్య కల్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ళ శ్రీ వీరేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి మహోత్సవాలు ఆదివారం తెప్పోత్సవం కార్యక్రమంతో ఘనంగా ముగిశాయి. ఈ నెల 14వ తేదీ నుండి 5 రోజుల పాటు ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఆఖరి రోజు స్వామి, అమ్మవార్లు పవిత్ర వృద్ధగౌతమీ నదిలో హంస వాహనంపై నదీవిహారం చేశారు. తొలుత ఆలయం నుండి భారీ బాణా సంచా, భారీ ఊరేగింపుగా మేళతాళాలు, శక్తివేషాలతో స్వామివారి, అమ్మవారిని గ్రామ పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించుకుంటూ గోదావరి చెంతకు తీసుకువచ్చారు. అక్కడ ప్రత్యేక ఆకృతితో తయారుచేసిన గోదావరి మాత, భద్రకాళి, వీరేశ్వరస్వామివార్లకు ఆలయ పురోహితులు ప్రత్యేక పూజలు జరిపి అనంతరం గోదావరి మాతకు పంచహారతులిచ్చారు. స్వామివారి నదీవిహారం సమయంలో చిన్నారులు చేసిన భరతనాట్యం, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఆలయ ఈవో వై సత్యనారాయణ (సత్యంబాబు) ఏర్పాట్లు పర్యవేక్షించారు.