తూర్పుగోదావరి

అటవీ ప్రాంత రహదారితో మహర్దశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఫిబ్రవరి 18: జిల్లాలోని గిరిజన ప్రాంతం నుండి విశాఖ జిల్లా అటవీ ప్రాంతం మీదుగా సుమారు 2 వేల కోట్లతో 516వ నంబరు జాతీయ రహదారిని నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి సిహెచ్ అయ్యన్నపాత్రుడు చెప్పారు. 404 కిలోమీటర్ల మేర నిర్మించే ఈ రహదారితో అటవీ ప్రాంతానికి మహర్దశ పడుతుందన్నారు. జిల్లా కేంద్రం కాకినాడ నగరంలోని వాకలపూడి ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఆదివారం మంత్రి అయ్యన్న విలేఖరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి, విస్తరణ కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నట్టు తెలిపారు. గడచిన మూడున్నర సంవత్సరాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, 13, 14 ఆర్థిక సంఘాల నిధులను సమర్ధవంతంగా వినియోగిస్తూ గ్రామాల్లో 15 కిలోమీటర్ల సిమెంటు రహదారులు నిర్మించి ఆంధ్రప్రదేశ్ దేశంలో ప్రథమ స్థానంలో ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకించి అభినందించి, రాష్ట్రానికి 14 అవార్డులు అందజేశారన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6400 కిలోమీటర్ల నిడివిలో జాతీయ రహదారుల నిడివి వుండగా కేంద్రం కొత్తగా 800 కిలోమీటర్ల మేర రహదారులు నిర్మించనున్నట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాజమహేంద్రవరం నుండి రంపచోడవరం, లంబసింగి, చింతపల్లి, పాడేరుల మీదుగా విజయనగరం కలెక్టరేట్ కూడలి వరకు దేశంలో అటవీ ప్రాంతం మీదుగా సాగే 404 కిలోమీటర్ల రహదారి నిర్మాణం పనులు త్వరలో ప్రారంభం కానున్నట్టు తెలియజేశారు. రాష్ట్రంలోని రహదారులన్నిటినీ సిమ్మెంట్‌తో నిర్మించాలని నిర్ణయించామని, చిరకాల మన్నిక కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో బ్రిటీష్ కాలం నాటి సుమారు 600 వంతెనలు శిథిలావస్థకు చేరుకున్నాయని, వాటి స్థానే కొత్త వంతెనల నిర్మాణానికి కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలియజేశారు. రాష్ట్రంలో రహదార్ల అభివృద్ధి, విస్తరణ, నిర్వహణ కోసం ఈ సంవత్సరం బడ్జెట్‌లో రూ. 7 వేల కోట్లు కేటాయించారన్నారు. రాష్ట్రంలో రహదారులు త్వరితంగా పాడవుతున్న తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాలకు, రాతి నేలలు అధికంగా ఉండే ఇతర జిల్లాల కంటే అధికంగా నిథులు కేటాయించాలని నిర్ణయించినట్టు మంత్రి అయ్యన్నపాత్రుడు వివరించారు.